అనగనగా ఓ ‘అంతఃపురం’. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. ‘అంతఃపురం’లో అమ్మాయి యువరాణిలా కనిపించాలనే ఏమో… రాశీ ఖన్నాను దర్శకుడు సుందర్ .సి ఎంపిక చేశారు. ఆమెను అందాల బొమ్మలా చూపించారు. ‘అంతఃపురం’లో సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ, ఆ అమ్మాయి మాత్రం భయపడుతోంది. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 31న విడుదల అవుతున్న ‘అంతఃపురం’ సినిమా చూసి తెలుసుకోవాలి. తెలుగులో హిట్ సినిమాలు చేసిన రాశీ ఖన్నా… ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశారు. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌లో అందంగా, అదే సమయంలో అభినయానికి ఆస్కారమున్న పాత్ర చేశారని తెలుస్తోంది. రాశీ ఖన్నా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాశీ ఖన్నా ఓ కథానాయికగా, ఆర్యకు జంటగా నటించిన తమిళ సినిమా ‘అరణ్మణై…
Category: VIDEOS
కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ ‘రెక్కీ’ ఫస్ట్ లుక్ విడుదల
“స్నోబాల్ పిక్చర్స్” పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”. “కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు” అనే ట్యాగ్ లైన్ తో శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణ… ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా… క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా… ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన వేడుకలో యూనిట్ సభ్యులు ఆవిష్కరించుకున్నారు. చిత్ర కథానాయకుడు అభిరామ్, దర్శకుడు ఎన్. ఎస్.ఆర్.ప్రసాద్, నాయకి సమీక్ష, సెకండ్ హీరో భద్రమ్, ఈ చిత్రంలో ఓ ముఖపాత్ర పోషించిన భాష, ఎడిటర్ పాపారావు ఈ…
సుధీర్‌బాబు చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
హీరో సుధీర్ బాబు నటుడు, దర్శకుడు హర్ష వర్దన్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాను సోనాలి నారంగ్, సృష్టి సమర్ఫణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. నేడు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించారు. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక పాత్రధారులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. షూటింగ్ ప్రారంభం అంటూ చిత్రయూనిట్ ఓ వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ బాబు లుక్ పూర్తిగా రివీల్ కాలేదు. కానీ సుధీర్ బాబు మాత్రం ఇది వరకు ఎన్నడూ కనిపించని లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరచబోతోన్నట్టు తెలుస్తోంది. సుధీర్ బాబు కెరీర్‌లో 15వ సినిమాగా రాబోతోన్న ఈ మూవీలో ఛాలెంజింగ్…
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాస్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను అఖండతో మరోసారి నిరూపించారు. బాక్సాఫీస్ వద్ద అఖండ ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతూనే ఉంది. అఖండ విడుదలై 25 రోజులైన ఇప్పటికీ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. నాలుగో వారంలో కూడా అఖండ భారీ కలెక్షన్లు రాబట్టింది. అఖండ భారీ సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ విజయోత్సవాలు నిర్వహించింది. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సహా చిత్రయూనిట్ పాల్గొంది. ఈ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.. చిత్రయూనిట్ కు సక్సెస్ షీల్డ్‌ను అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ చిత్రాన్ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. 2021లో అఖండ…
Mass Maharaja Ravi Teja ‘Ramarao On Duty’ Wishes Merry Christmas With New Poster
Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty being directed by debutant Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks is in last leg of shooting. The makers released a new poster to wish one and all Merry Christmas. Ravi Teja plays an action-packed role in the movie. However, the poster presents him as a Good Samaritan. Ravi Teja is seen ecstatic, as he gives cash to an old couple. We can see bliss in their faces. “To give up one’s very self; to think…
మార్చి18న ‘గని’ థియేటర్ లోకి వస్తున్నాడు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటించిన లేటెస్ట్ సినిమా ‘గని’ మార్చి 18న థియేటర్ లోకి వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. రినైసాన్స్ పిక్చర్స్- అల్లు బాబి కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద – అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కిరణ్ కుమార్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. మేకర్స్ ముందు ప్రకటించిన డేట్ ప్రకారం అయితే ఈ డిసెంబర్ 24న రిలీజ్ కావాల్సింది. అయితే, వారం ముందు అల్లు అర్జున్ పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’, ‘గని’ రిలీజ్ అనుకున్న రోజు నాని ‘శ్యామ్ సింగ రాయ్’ వస్తుండటంతో ఈ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేశారు. తాజాగా కొత్త డేట్‌ను లాక్ చేసిన చిత్రబృందం వరుణ్…
హైద్రాబాద్ వేదికగా ‘మిస్టర్ & మిస్ ఆసియా మోడల్’ 2021-22 పోటీలు!!
అందాల పోటీలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి.. సినిమారంగానికి రాచబాటలు వేస్తాయి!! -మాజీ కేంద్రమంత్రివర్యులు- తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలచారి # హైద్రాబాద్ వేదికగా “మిస్టర్ & మిస్ ఆసియా మోడల్” 2021-22 పోటీలు!! # జనవరి 2, 2022న సెలెక్షన్స్ జనవరి 30న గ్రాండ్ ఫినాలే!! యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్కై జాయింట్ వెంచర్స్ డ్రీమ్ మేకర్స్ ప్రొడక్షన్స్ తో కలిసి “మిస్టర్ అండ్ మిస్ ఏషియా” ఈవెంట్ నిర్వహిస్తోంది. మిస్టర్ & మిస్ ఆసియా మోడల్ 2021-22 సెలెక్షన్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని అట్లాస్ అపార్టుమెంట్ రెండవ ఫ్లోర్ లో నిర్వహించనున్నారు. ఇందులో ఎంపిక అయినవారు ఫినాలే లో తమ ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. ఇక ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను మాజీ మంత్రి మరియు తెలంగాణ విద్యుత్ మరియు వ్యవసాయ…
‘శ్యామ్ సింగ రాయ్’లో సాయి పల్లవి కనిపించదు..దేవదాసి పాత్రే కనిపిస్తుంది : సాయి పల్లవి
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ‘టాలీవుడ్ టైమ్స్’ తో ముచ్చటించింది. అవి ఆమె మాటల్లోనే… ప్రతి మూవీ నాకు నమ్మకం కలిగాకే చేస్తాను. అలాగే స్క్రిప్ట్ చదివేటప్పుడు ‘సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయొచ్చు’ అని ఒక ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చదువుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని ఊహించుకుని ఉంటాం. శ్యామ్ సింగరాయ్‌లో స్క్రిప్ట్ చదివేటప్పుడు దేవదాసి క్యారెక్టర్ ఎలా చేయాలి అనేదాని…
శ్రీవిష్ణు ‘భళా తందనాన’ ఫస్ట్ లుక్ విడుదల
విలక్షణ కథలతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం ‘భళా తందనాన’ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీలో నటిస్తున్నారు. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్. రీసెంట్‌గా మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ‘భళా తందనాన` ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇన్ సైడ్ వైట్ టీ షర్ట్ ధరించి డెనిమ్ షర్ట్, బ్లూ జీన్స్‌తో ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న శ్రీ విష్ణు లుక్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. చేతిలో రెండు తుపాకులు పట్టుకొని ఎంతో కోపంగా కనిపిస్తున్న శ్రీ విష్ణు చుట్టూ రౌడీ గ్యాంగ్ కనిపిస్తుండటం ఈ కథ ఎంత స్ట్రాంగ్‌గా ఉండనుందో చెబుతోంది. భళా తందనాన చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లకు కొదవే…
శ్రీవిష్ణు, తేజ మార్నఅర్జున ఫల్గుణ’ నుంచి ‘ఒక తీయని మాటతో..’ సాంగ్ లిరికల్ వీడియో విడుదల
కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా చిత్రంలోని ఒక తీయని మాటతో సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది. ఓక తీయని మాటతో సాంగ్ హీరో శ్రీవిష్ణు.. హీరోయిన్ అమృత అయ్యర్‌తో రిలేషన్‌లోని ఆనందాన్ని వ్యక్తం చేసే రొమాంటిక్ మెలోడీ. ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. శశ్వత్ సింగ్, శ్రేయా అయ్యర్ ఈ పాటను పాడారు. విజువల్‌గా.. ఈ పాట చక్కగా, లవ్లీగా కనిపిస్తుంది. ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. గతంలో విడుదలైన పాటలు కూడా సంగీత ప్రియులను…
