మార్చి18న ‘గని’ థియేటర్ లోకి వస్తున్నాడు

Varuntej in Ghani Movie Still
Varuntej in Ghani Movie Still
Spread the love

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటించిన లేటెస్ట్ సినిమా ‘గని’ మార్చి 18న థియేటర్ లోకి వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. రినైసాన్స్ పిక్చర్స్- అల్లు బాబి కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద – అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కిరణ్ కుమార్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. మేకర్స్ ముందు ప్రకటించిన డేట్ ప్రకారం అయితే ఈ డిసెంబర్ 24న రిలీజ్ కావాల్సింది. అయితే, వారం ముందు అల్లు అర్జున్ పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’, ‘గని’ రిలీజ్ అనుకున్న రోజు నాని ‘శ్యామ్ సింగ రాయ్’ వస్తుండటంతో ఈ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేశారు. తాజాగా కొత్త డేట్‌ను లాక్ చేసిన చిత్రబృందం వరుణ్ తేజ్ కొత్త లుక్‌తో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 18వ తేదీన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. జగపతి బాబు, సునీల్ శెట్టి, తమన్నా భాటియా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.