ఉరుకు పటేల మూవీ రివ్యూ : మనసు దోచే కామెడీ థ్రిల్లర్!

Uruku Patela Movie Review: Mind blowing comedy thriller!

లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కంచర్ల బాల భాను నిర్మాణంలో వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తేజ‌స్ కంచ‌ర్ల‌, కుష్బూ చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. ఉరుకు పటేల సినిమా నేడు (వినాయక చవితి రోజు సెప్టెంబర్ 7న) థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ విషయానికొస్తే.. పటేల(తేజస్) ఊరి సర్పంచ్(గోపరాజు రమణ) కొడుకు. చిన్నప్పుడే తనకు చదువు రాదని అర్ధమయిపోయి చదువు మధ్యలోనే వదిలేసి ఎప్పటికైనా బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అవుతాడు. అప్పట్నుంచి ఊళ్ళో చదువుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుక్కొని ఛీ కొట్టించుకుంటాడు. బాగా డబ్బులు ఉండటం, సర్పంచ్ కొడుకు కావడంతో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఒక పెళ్ళిలో అక్షర(కుష్బూ…

SPEED220 మూవీ  రివ్యూ : అలరించే ప్రేమకథ!

SPEED220 Telugu Movie Review

యువతరాన్ని ఎంగేజ్ చేసే సినిమాలకి  టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో క్రేజ్ ఉంది.  అందుకే నవతరం  దర్శకులు, నిర్మాతలు యూత్ ఫుల్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తుంటారు. ఫలితంగా  బాక్సాఫీస్ వద్ద కూడా నిర్మాతలు ఆశాజనకంగా గట్టేక్కే పరిస్థితి ఉంటుంది.  అందుకు తోడు ఓటీటీకి ఇలాంటి స్టోరీస్ బాగా వర్కవుట్ అవుతాయి. తాజాగా ఇలాంటి కథ… కథనాలతో తెరకెక్కిందే.. SPEED220. ఈచిత్రాన్ని విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో  కొల్ల గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి, తాటికొండ మహేంద్రనాథ్ తదితరులు నటించారు. డెబ్యూ దర్శకుడు హర్ష బీజగం ఈ సినిమాకు  దర్శకత్వం వహించారు. రా లవ్ స్టోరీ.. స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రం  ప్రేక్షకుల…

AAY Movie Review in Telugu : ఆయ్’ మూవీ రివ్యూ.. ముగ్గురు మిత్రుల నవ్వుల నజరానా!

AAY Movie Review in Telugu :

ఎన్టీఆర్ బావమర్ది నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్’. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో అంజి మణిపుత్ర దర్శకత్వంలో ‘ఆయ్’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఆయ్ సినిమా ఆగస్టు 16న థియేటర్స్ లోకి వస్తుండగా నేడు (ఆగస్టు 15)న ప్రీమియర్స్ వేశారు. కథ : కరోనా వచ్చిన కొత్తల్లో ఈ కథ జరుగుతుంది. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న కార్తీక్ (నార్నె నితిన్) వర్క్ ఫ్రమ్ హోమ్ తో గోదావరి జిల్లాల్లోని తన ఊరికి వస్తాడు.…

ఎన్విరాన్ మెంట్ కి ఎగినెస్ట్ గా వెళ్లొద్దని చెప్పే… సింబా

ఇటీవల సీనియర్ నటుడు జగపతి బాబు చాలా సెలెక్టివ్ గా రోల్స్ ఎంపిక చేసుకుంటూ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా నిర్మాత తన చిరకాల మిత్రుడు రాజేందరరెడ్డి నిర్మించిన ‘సింబా’ చిత్రంలో పర్యావరణ ప్రేమికుడిగా పురుషోత్తమ్ రెడ్డి పాత్రను పోషించారు. ఆయనకు సహాయకులుగా నిత్యం వార్తల్లో వుండే గ్లామర్ బ్యూటీ అనసూయ, యానిమల్ లో నటించిన యంగ్ హీరో మాగంటి శ్రీనాథ్ నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ మాస్ దర్శకుడు సంపత్ నంది కథ.. మాటలు అందించారు. ఆయన కూడా నిర్మాణ బాధ్యతల్లో భాగస్వామిగా వ్యవహరించారు. ఈ చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించి… ఓ మెసేజ్ కూడా ఇచ్చినట్టు ఇటీవల మూవీ నిర్మాత తెలిపారు. జగపతిబాబు ఇంటి ఆవరణంలో విపరీతంగా పచ్చదనం ఉంటుందని, ఆయన అయితే ఈ సినిమా టైటిల్ పాత్రకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ…

sriranganethulu movie review in telugu : శ్రీరంగనీతులు మూవీ రివ్యూ.. యువ‌త‌రం భావోద్వేగాల‌ ప్రయాణం!

sriranganethulu movie review in telugu

సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం,రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్య‌తార‌లుగా రూపొందిన చిత్రం శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీర‌జ్ మొగిలినేని ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేశారు. యువ‌త‌రం భావోద్వేగాల‌తో, సినిమాలోని పాత్ర‌ల‌తో త‌మ‌ను తాము ఐడెంటిఫై చేసుకునే క‌థ‌ల‌తో, స‌హ‌జంగా సాగే మాట‌లు, మ‌న‌సుకు హ‌త్తుకునే స‌న్నివేశాల‌తో వ‌చ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. స‌రిగ్గా అలాంటి సినిమానే ‘శ్రీ‌రంగ‌నీతులు’. సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానీశర్మ, విరాజ్‌ అశ్విన్‌ ముఖ్య పాత్రల్లో ఆంథాలజీ సినిమాగా తెరకెక్కిన సినిమా ఇది. ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించారు. ఏప్రిల్‌ 11న ఈ చిత్రం థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. నిర్మాత ధీరజ్‌ మొగిలినేని ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ‘శ్రీరంగనీతులు’ సినిమాను…

Manjummel Boys Movie Review in Telugu : ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ రివ్యూ: ఎమోషనల్ థ్రిల్లర్‌!

Manjummel Boys Movie Review in Telugu

(చిత్రం : మంజుమ్మెల్ బాయ్స్ , విడుదల తేదీ : 06, ఏప్రిల్ 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ తదితరులు, దర్శకత్వం: చిదంబరం, నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, సంగీత దర్శకులు: సుశీన్ శ్యామ్, సినిమాటోగ్రఫీ : షైజు ఖలీద్, ఎడిటింగ్: వివేక్ హర్షన్). సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్ కీలక పాత్రలు పోషించిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ . ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా ఈ శుక్రవారం (6, ఏప్రిల్ 2024) విడుద‌లైంది. మరి ఈ చిత్రం, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం….…

Family Star Movie Review in Telugu : “ది ఫ్యామిలీ స్టార్” మూవీ రివ్యూ…. రొటీన్ ఫ్యామిలీ కథ !

Family Star Movie Review in Telugu

హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. యువతలో సూపర్ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. అతడి యాటిట్యూడ్, మేనరిజమ్స్ యువతకి బాగా నచ్చుతాయి. అందుకే తక్కువ సమయంలోనే విజయ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇప్పటి యువతలో ఉన్న ఆలోచనలకు తగ్గట్లుగా ప్రతి చిత్రంలో అతడి పెర్ఫామెన్స్ ఉంటోంది. ‘గీతా గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కావడంతో అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూవీలో విజయ్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అండ్ ట్రైలర్.. ఇలా ప్రతిదీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీ పై…

‘Tillu Square’ Movie Review in Telugu : ‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రివ్యూ .. రొమాంటిక్‌ కైమ్ర్‌ కామెడీ

'Tillu Square' Movie Review .. Romantic Comedy

(చిత్రం: టిల్లు స్క్వేర్, దర్శకత్వం: మల్లిక్ రామ్, విడుదల తేదీ : 29, మార్చి- 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీ శర్మ, ప్రిన్స్, బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్ తదితరులు. దర్శకత్వం: మల్లిక్ రామ్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ & సాయి సౌజన్య, సినిమాటోగ్రాఫర్‌: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సంగీత దర్శకులు: రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్: నవీన్ నూలి) సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ కైమ్ర్‌ కామెడీ ‘టిల్లు స్క్వేర్‌’. ‘డీజే టిల్లు’ చిత్రంతో ఒక్కసారిగా సినీప్రియుల్లో భారీ క్రేజ్‌ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమాలో టిల్లుగా అతడు చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడా పాత్రతో మరోమారు థియేటర్లలో నవ్వులు పూయించేందుకు ‘టిల్లు స్క్వేర్‌’…

Movie Review : అలరించే ‘లైన్ మ్యాన్’

movie-review-entertaining-line-man

ప్రకృతిలో ఎన్నో జీవరాసులున్నాయి. అవి రోజు రోజుకి వివిధ కారణాల వల్ల అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా రేడియేషన్ వల్ల ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న జీవరాసులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రకృతి ప్రేమికులపై ఉంది. లేకుంటే ఈ భూమి మీద ఉండే అనేక కోటానుకోట్ల జీవరాసులు కాలక్రమంలో అంతరించి పోయే ప్రమాదం ఉంది. మనిషి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా… వాటికి హాని కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందనే సందేశంతో తెరకెక్కందే త్రిగుణ్ తెలుగు, కన్నడ భాషల్లో నటించిన ‘లైన్ మ్యాన్’. ఈ చిత్రానికి వి.రఘుశాస్త్రి దర్శకత్వం వహించారు. ప్రెస్టీజియస్ పర్పుల్ రాక్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై యతీష్ వెంకటేష్, గణేష్ పాపన్న నిర్మించారు. ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ…

‘వెయ్ దరువెయ్’ మూవీ రివ్యూ : ఆకట్టుకునే కామెడీ, డ్రామా!

'Vey Daruvey' Movie Review : Impressive Comedy, Drama!

సాయిరామ్ శంకర్ గతంలో నటించిన 143, బంపర్ ఆఫర్ చిత్రాలు ప్రేక్షకులను ఎలా అలరించాయో తెలిసిందే. సాయిరామ్ శంకర్ తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని అలరించడంలో దిట్ట. తాజాగా యాక్షన్, కామెడీ, డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఇందులో సాయిరామ్ శంకర్ సరసన యషా శివకుమార్, హెబ్బా పటేల్ నటించారు. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నూతన దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని దేవరాజ్ పోతూరు నిర్మించారు. యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సాయిరామ్ శంకర్ ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ఎలా అలరించాడో చూద్దాం.. కథ: తెలంగాణాలోని కామారెడ్డిలో సరదాగా తిరిగే కుర్రాడు కామారెడ్డి శంకర్(సాయిరామ్ శంకర్)… ఏదైనా ఉపాధి పొందాలని…