Retro Movie Review in telugu : రెట్రో మూవీ రివ్యూ : ఫ్యాన్సుకు పండగే !

Retro Movie Review in telugu
Spread the love

చిత్రం : రెట్రో
విడుదల : 01 మే 2025
రేటింగ్ : 2.75/5
నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జయం రవి, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్, శ్రియా శరణ్ తదితరులు
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు: జ్యోతిక, సూర్య, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండ్యన్
సంగీతం : సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: షఫీఖ్ మహ్మద్ ఆలీ
బ్యానర్: స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్

కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన తాజా చిత్రమే ‘రెట్రో’. సూర్య నుంచి కంబ్యాక్ సినిమా అవుతుంది అనిపించేలా ఒక ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం….
కథ: ఈ చిత్రం 1993 సమయంలో జరిగే కథ. స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించే పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ తిలక్ (జోజు జార్జ్) దత్త పుత్రుడు పారివేల్ కన్నన్ (సూర్య). తండ్రి కోసం క్రిమినల్ వ్యవహారాల్లో భాగమౌతాడు. కానీ రుక్మిణి (పూజా హెగ్డే)తో ప్రేమలో పడిన తర్వాత మాఫియా, స్మగ్లింగ్ యాక్టివిటీస్ వదిలేయాలని నిర్ణయించుకొంటాడు. కానీ పెంపుడు తండ్రి తిలక్‌ కావాల్సిన గోల్డ్ ఫిష్ సమాచారం పారివేల్ వద్ద ఉంటుంది. ఈ క్రమంలో అరెస్ట్ అయిన పారివేల్ జైలు నుంచి తప్పించుకొంటాడు. తనపై కోపంతో వదలేసి వెళ్లిన రుక్మిణి ఆచూకీ కోసం వెతుకులాట మొదలుపెడుతాడు. తన చిన్నతనంలోనే పారివేల్ కణ్ణన్ తన తల్లిదండ్రుల నుంచి వేరయ్యి ఒక గ్యాంగ్ స్టర్ తిలక్ రాజ్ కి దొరుకుతాడు. అయితే అతని భార్య కోరికతో పెంచుకుంటాడు కానీ పారి అంటే ఇష్టం ఉండదు. తను దొరికిన పరిస్థితులుతో పారికి చిన్నతనం నుంచి నవ్వు అనేది ఉండదు. ఆ తర్వాత రుక్మిణితో జరిగిన పరిచయం ఎలా ప్రేమగా మారింది. ఈ క్రమంలో తన కోపం, నవ్వు పారి జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాయి. అసలు ఈ పారి ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవాడు? ఈ మొత్తంలో అండమాన్ లో ఒక దీవిలో ప్రజలని బానిసలుగా చేసిన దొరలు రాజ్ వేల్, తన కొడుకు మైఖేల్ (వేదు)లు చేసే అరాచకాలు ఏంటి? అక్కడికి పారి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? అలాగే తిలక్ రాజ్ కోరుకుంటున్న గోల్డ్ ఫిష్ కి పారికి ఉన్న లింక్ ఏంటి? పారివేల్‌ను తిలక్ ఎందుకు దత్తత తీసుకొన్నాడు? క్రిమినల్ వ్యవహారాలను వదిలేయాలని అనుకొన్న తర్వాత ఎదురైన పరిస్థితులేమిటి? పెంపుడు తండ్రి తిలక్ కోరుకొంటున్న గోల్డ్ ఫిష్ ఏంటి? గోల్డ్ ఫిష్ వివరాలు పారివేల్ నుంచి సేకరించడానికి మాఫియా వర్గాలు ఎలాంటి ప్రయత్నాలు చేశాయి? రుక్మిణి ఆచూకీ దొరికిందా? మైఖేల్ (విధు) టార్గెట్ ఏంటి? అండమాన్‌లో బానిసలుగా మారిన ప్రజల ముఖాల్లో చిరు నవ్వులు చిందించాలని పారివేల్ అనుకొన్న లక్ష్యాన్ని సాధించాడా? అనేవి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ: కథ, కథనాలు, పాత్రల డిజైన్ పరంగా కార్తీక్ సుబ్బరాజు పూర్తిగా విఫలమయ్యాడు. సూర్య, పూజా హెగ్డే, జోజు, ప్రకాశ్ రాజ్, నాజర్ లాంటి ఆరిస్టులను సరిగా వాడుకోలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. క్రైమ్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా గ్యాంగ్‌స్టర్ డ్రామా. సూర్య, పూజా హెగ్డే అభిమానులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. మూడు నాలుగు లేయర్లుగా మంచి పాయింట్స్ స్టోరీలో కనిపిస్తాయి. కానీ వాటిని అన్నింటిని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కిచిడి చేయడంతో గందరగోళమే క్రియేట్ అయింది. రకరకాల అంశాలు సరిగా లేకపోవడంతో కథ ఎటుపోతుంది? పాత్రలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాయి? వారి మధ్య పోరాటానికి టార్గెట్ ఏమిటనే క్లారిటీ లేకపోవడంతో ప్రేక్షకుడికి ఏం చూస్తున్నామో అర్ధం కాని పరిస్థితి. క్లైమాక్స్‌లో కథ సారాంశాన్ని చెప్పిన తీరు ఒక్కటే కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కథ, కథనాలతో ప్రేక్షకుడిని మెప్పించడంలో దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ ఫెయిల్ అయినప్పటికీ.. సూర్య తన స్క్రీన్ ప్రజెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. పారివేల్ పాత్రలో ఉండే డిఫరెంట్ వేరియేన్స్‌ను చక్కగా చూపించాడు. గ్యాంగ్‌స్టర్‌గా, భార్య ప్రేమ కోసం తపించే భర్తగా ఆకట్టుకొనే విధంగా పెర్ఫార్మ్ చేశాడు. ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే.. రోల్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నా కానీ.. సినిమాలో ఇంపాక్ట్ ఉండదు. నటించడానికి స్కోప్ లేని డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఒక్క పాటలో తప్ప ఏ సీన్‌లో కూడా ఎట్రాక్టివ్‌గా అనిపించదు. జోజు జార్జ్, విధు, ప్రకాశ్ రాజ్ పర్వాలేదనిపిస్తారు. కథలో విషయం లేనప్పుడు, పస లేనప్పుడు సాంకేతిక విభాగాల పనితీరు కూడా డీలా పడుతాయనే విషయాన్ని రెట్రో మరోసారి స్పష్టం చేసింది. బేసిగ్గా కథలో వేగం, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎలివేట్ కాకుండా పోయాయి. సంతోష్ నారాయణ్ తన వంతుగా బీజీఎంతో న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫి బాగుంది. అండమాన్ ప్రాంతాల్లో సీనిక్ బ్యూటీని చక్కగా కెమెరాల బంధించాడు. జ్యోతిక, సూర్య అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో ఫస్టాఫ్ మంచి బలం అని చెప్పవచ్చు. మేకర్స్ అనౌన్స్ చేసిన లవ్, లాఫ్టర్ (నవ్వు), వార్ ఈ పాయింట్స్ కి తగ్గట్టుగా నడిపిన కథనం మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ క్రమంలో సూర్య నటన కూడా సాలిడ్ గా ఉందని చెప్పవచ్చు. తన లోని నటుణ్ని మిస్ అవుతున్న వారికి చాలా కాలం తర్వాత ఈ సినిమా ఫస్టాఫ్ లో అలాగే తనలో ఉన్న లోపంని అద్దంలో చూసుకునే సీక్వెన్స్ లో సూర్య జీవించేశారు అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే తనపై పలు క్రేజీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇంకా పూజా హెగ్డే తన రోల్ లో బానే చేసింది. వీరితో పాటుగా జోజు జార్జ్ ఇంకా జైరాం లు తమ గత సినిమాలు నుంచి కొంచెం డిఫరెంట్ పాత్రల్లో కనిపించి మెప్పిస్తారు. అలాగే నెగిటివ్ రోల్ లో కనిపించిన యంగ్ నటుడు విదు తన పాత్రలో మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు. అలాగే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ అందుకు తగ్గ కొన్ని కనెక్షన్ లు అలాగే ఫస్టాఫ్ లో ఒక సింగిల్ టేక్ సీక్వెన్స్ మొత్తం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరోసారి సెకండాఫ్ ని ఎంగేజింగ్ గా నడపడంలో తడబడ్డారు అని చెప్పక తప్పదు. ఒక డీసెంట్ ఫస్టాఫ్ ని కొనసాగించి యుద్ధంతో ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చి సెకండాఫ్ కి మంచి స్కోప్ ని హోప్ ని ఇచ్చేలా సెట్ చేసి సెకండాఫ్ ని మాత్రం డల్ గా సాగదీతగా నడిపించారు. కథ ఒకలా మొదలై అది కాస్తా ఏటెటో వెళుతుంది. వీటితో ఆడియెన్స్ ఏకాగ్రత తప్పుతుంది. సూర్యపై కొన్ని సీన్స్ బాగానే అనిపిస్తాయి కానీ అవన్నీ ఫ్లోలో కరెక్ట్ గా లేవు అనిపించక మానదు. అలాగే ప్రీ క్లైమాక్స్ సూర్యపై ట్విస్ట్ వచ్చే వరకు కథనం అంతా చప్పగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే చాలా సీన్స్ ఆడియెన్స్ కి ఇది వరకే ఎక్కడో చూసినట్టే అనిపిస్తాయి. అంతే కాకుండా అక్కడక్కడా సన్నివేశాలు ఈజీగా ఊహించే రేంజ్ లోనే కొనసాగుతాయి. మరో డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే క్లైమాక్స్ కూడా అని చెప్పొచ్చు. కార్తిక్ సుబ్బరాజ్ అనుకున్న పాయింట్ కి ప్లాన్ చేసుకున్న క్లైమాక్స్ అంత ఎఫెక్టీవ్ గా అయితే అనిపించలేదు. అప్పుడు వరకు అంతా స్ట్రాంగ్ గా ఉన్న విలన్లు చాలా ఈజీగా లొంగిపోయినట్టు అనిపిస్తుంది. వీటితో చాలా అంశాలు మాత్రం సెకండాఫ్ లో డిజప్పాయింట్ చేస్తాయి.
సాంకేతిక వర్గం: ఈ చిత్రంలో సంతోష్ నారాయణన్ తన సంగీతంతో చాలా సీన్స్ కి మంచి స్కోర్ అందించి ఎలివేట్ చేసాడు. అక్కడక్కడా కాలా సినిమా స్కోర్ కూడా కొట్టేసాడు. శ్రేయస్ కృష్ణ, సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్యంకి తగ్గట్టుగా మంచి రెట్రో విజువల్స్ అందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే . తెలుగు డబ్బింగ్ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ విషయానికి వస్తే తను ఎంచుకున్న లైన్ అందులో పాయింట్స్ బాగున్నాయి కానీ వాటికి అనుగుణంగా రాసుకున్న కథనం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆకట్టుకునేలా లేదు. మెయిన్ గా సెకండాఫ్ వీక్ గా సాగింది. ఎక్కడో ప్రీ క్లైమాక్స్ లో కలిపిన లింక్ ఒకే కానీ పూర్తి స్థాయిలో ఆడియెన్స్ ని ఎంగేజ్ చేయగలిగే రేంజ్ లో అయితే తన వర్క్ సాగలేదు. ఫస్టాఫ్ వరకు మాత్రం తన మార్క్ కనిపించింది.

Related posts

Leave a Comment