చిత్రం: హిట్ 3
విడుదల : 01, మే -2025
రేటింగ్ : 3.25/5
నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు
రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను
నిర్మాణం: నాని, ప్రశాంతి త్రిపురనేని
సినిమాటోగ్రఫీ : సాను జాన్ వర్గేసే
సంగీతం : మిక్కీ జే మేయర్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్
శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘హిట్ 3’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా నేడు (01, మే -2025) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం….
కథ: స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ (నాని). అయితే.. కిరాతకంగా మర్డర్స్ చేసి వాటిని వీడియోలు తీస్తుంటాడు. అలాంటి ఆఫీసర్ ప్రవర్తనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, అతడి పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. కాగా.. పోలీసులు, ప్రజలు ఎవరేమీ అనుకొన్నా తన దారిలో తాను ముందుకెళ్తుంటాడు. ఇలాంటి హిస్టరీ ఉన్న ఆఫీసర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ ఆపరేషన్ కోసం సిద్దమవుతాడు. అర్జున్ సర్కార్ ఒక రూత్ లెస్ ఎస్.పీ, చిన్న తనంలోనే అమ్మను కోల్పోవడంతో రఫ్ అండ్ టఫ్ గా పెరుగుతాడు. ఫిల్టర్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఇక సొసైటీలో ఒక్క క్రిమినల్ కూడా బతక్కూడదు అనుకునే పోలీస్. తన చేతికి దొరికిన క్రిమినల్స్‌కు నరకం చూపిస్తుంటాడు అర్జున్. అలాంటి అర్జున్ కి సి.టీ.కే అనే డార్క్ వెబ్ సైట్ గురించి తెలుస్తోంది. ఆ సైట్ ద్వారా సైకో కిల్లర్స్ అంతా వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంటారు. అలాంటి కేసులోకి అర్జున్ సర్కార్ సైకో కిల్లర్ గా వస్తాడు. ఈ మధ్యలో మృదుల (శ్రీనిథి శెట్టి)తో ప్రేమలో పడతాడు. అసలు మృదుల ఎవరు?, ఆమె ఎందుకు అర్జున్ సర్కార్ లైఫ్ లోకి వస్తోంది ?, ఇంతకీ, ఆ డార్క్ వెబ్ సైట్ రన్ చేస్తున్న సైకో కిల్లర్ ఎవరు ?, అతడి మోటో ఏంటి ?, చివరకు ఆ కిల్లర్స్ ను అర్జున్ సర్కార్ ఎలా అంతం చేశాడు ? నిబద్దత, అంకితభావం ఉన్న అర్జున్ సర్కార్ ఎందుకు మర్డర్స్ చేస్తుంటాడు? కశ్మీర్లో ఎలాంటి ఆపరేషన్స్ చేశాడు? సీటీకే అనే డార్క్ వెబ్ టార్గెట్ ఏంటి? సీటీకేలో అర్జున్ సర్కార్ ఎందుకు చేరాలనుకొంటాడు? సీటీకే అర్జున్ సర్కార్ చేరిన తర్వాత ఏం జరిగింది? డార్క్ వెబ్‌లో భాగమైన అర్జున్ సర్కార్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు. మృదులతో ఎలా ప్రేమలో పడ్డాడు? అసలు మృదుల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘హిట్3’ సినిమా కథ.
విశ్లేషణ: వైల్డ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ ‘హిట్ 3’లో.. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా నాని పవర్ ఫుల్ నటన, శైలేష్ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ, కొన్ని సన్నివేశాలు రోటీన్ గా సాగడం, స్క్రీన్ ప్లే రెగ్యులర్ గా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. ఐతే నాని తన నటనతో, తన వైల్డ్ పర్ఫామెన్స్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. క్రైమ్, ఇన్వెస్టిగేషన్ పాయింట్స్ ఆధారంగా ఎమోషన్స్, హీరోయిజం, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను జోడించి దర్శకుడు శైలేష్ కొలను రాసుకొన్న కథ రొటీన్, రెగ్యులర్‌గానే ఉంటుంది. కానీ స్టోరీకి ఇచ్చిన ట్రీట్మెంట్, క్రైమ్ ఎలిమెంట్స్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయి. ఫస్టాఫ్‌లో ఫాదర్, సన్ సీన్లుగానీ, శ్రీనిధి శెట్టితో ఉండే లవ్ ట్రాక్ సినిమాకు కొంత రిలీఫ్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌ను ఇంట్రెస్టింగ్గా రాసుకొన్న డైరెక్టర్ శైలేష్.. అదే రేంజ్లో సెకండాఫ్‌ను కొనసాగించలేకపోయాడనిపిస్తుంది. సెకండాఫ్‌లో మితి మీరిన హింస, ఫైట్స్ రెగ్యులర్ ఆడియెన్స్‌కు చాలా ఇబ్బందిగా, డిస్ట్రబ్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఓవర్ వయోలెన్స్ చుట్టూ సాగే కథలో నానీ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కథలో నాని పాత్రను సెట్ చేసిన విధానమే దర్శకుడిగా శైలేష్ సక్సెస్ కారణమనిస్తుంది. ఎప్పటిలాగే, అర్జున్ సర్కారుగా తన పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో నాని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. నాని నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో నాని ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నాలోని కొత్త కోణం చూడాలనుకొనే వారికి అర్జున్ సర్కార్ ఓ ట్రీట్ అనే విధంగా నాని ఆ పాత్రలో నటించాడు. తాను క్లాస్ అనుకొని పొరపాటుపడ్డారు. ఇక ముందు తాను మాస్ హీరో అని చూడటానికి రెడీగా ఉండాలంటూ సంకేతాలిచ్చాడు. అర్జున్ సర్కార్ పాత్రలో నిజంగా ఓ డిఫరెంట్ నానిని చూసే అవకాశం కలిగింది. ఏ నటుడికైనా ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం చాలా కష్టంగా ఉంటుంది. కెరీర్ మధ్యలో అలాంటి ఇమేజ్ దూరంగా నాని చేస్తున్న పాత్రలు విభిన్నంగా, విలక్షణంగగా ఉంటున్నాయి. కానీ అర్జున్ సర్కార్ లాంటి పాత్రల వల్ల ఓ సెక్షన్ ఆడియెన్స్ దూరంగా ఉండే ప్రమాదాన్ని నాని గ్రహించాలి. ఇక అర్జున్ సర్కార్‌గా యూత్‌ను విశేషంగా ఆకట్టుకొంటాడు. యాక్షన్, రొమాంటిక్ సీన్లలో నాని బాడీ లాంగ్వేజ్ బాగుంది.
‘హిట్ 3’తో తెలుగు తెరకు నేరుగా పరిచయం అయిన శ్రీనిధి శెట్టి తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది. అలాగే, ఆమె స్రీన్ ప్రెజెన్సీ కూడా బాగుంది. ఉన్నంతలో కనిపించనంత సేపు స్క్రీన్ మీద చూపు తిప్పుకోకుండా చేసింది. గ్లామర్‌గానే కాకుండా సర్ప్రైజ్ కలిగించే సన్నివేశాల్లో ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
ఇతర కీలక పాత్రల్లో కనిపించినకోమలి ప్రసాద్, రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి ఆకట్టుకున్నారు. అదేవిధంగా అతిథి పాత్రలో నటించిన అడవి శేష్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. దర్శకుడు శైలేష్ కొలను మూవీకి అనుగుణంగానే ప్లేను నడుపుతూ నానిను కొత్తగా చూపించిన విధానం బాగుంది. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరియు బలమైన భావోద్వేగాలను, అలాగే డార్క్ టచ్ ను కూడా సమపాళ్లలో పెట్టడం సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా నాని పై యాక్షన్ సీక్వెన్స్ లను ఎఫెక్టివ్ గా డిజైన్ చేశారు. అదే విధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. సినిమా యాక్షన్ లవర్స్ కి బాగా నచ్చుతుంది. బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘హిట్ 3’ చాలా వరకు బాగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు డా. శైలేష్ కొలను, కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా ఒక యాక్షన్ సీక్వెన్స్ చుట్టే తిరగడం బాగాలేదు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. డా. శైలేష్ కొలను రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కశ్మీర్, రాజస్థాన్‌లో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్లు బాగున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లో కొన్ని సన్నివేశాలకు ఉపయోగించిన లైటింగ్‌తో విజువల్స్ వండర్పుల్గా అనిపిస్తాయి. వాల్ పోస్టర్, యునాన్మిమస్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. హిట్ 3 సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. మితిమీరిన హింసతో కూడిన రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్. చైల్డ్ ఎమోషన్స్‌తో సాగే మర్డర్స్ మిస్టరీ. అయితే నానికి తన కెరీర్లో డిఫరెంట్ మూవీ చెప్పవచ్చు. ఓవరాల్ గా ఈ చిత్రం నాని అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ ను కూడా అలరిస్తుంది.