సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి గత శనివారం మృతి చెందింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించడంతో పాటు రాజేందప్రసాద్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వెంకటేశ్ తదితరులు ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. అయితే కూతురు పోయిన బాధలో ఉన్న నటకిరిటిని తాజాగా నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించాడు. ఆయనకు ధైర్యం చెప్పారు. అనంతరం రాజేందప్రసాద్ కూతురు గాయత్రికి నివాళులు అర్పించాడు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె 38 ఏండ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు రాగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేర్చారు. అయితే పరిస్థితి విషమించడంతో…
Category: రివ్యూస్
ఎన్టీఆర్‌తో జర్నీ నాకెప్పుడూ స్పెషలే.. ‘దేవర’ అందరికీ కన్నుల పండుగలా ఉంటుంది : దర్శకుడు కొరటాల శివ
ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ ‘దేవర’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ .. * ‘దేవర’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఉండే ఎగ్జయిట్‌మెంటో, నెర్వస్‌నెస్ ఏదైనా అనుకోవచ్చు.. మనసులో అలా ఉంది. ప్రతి…
మన్యం ధీరుడు… మెప్పించే ఓ విప్లవ వీరుడి కథ
బ్రిటీష్ వారి బాని సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా… వెండితెరపై చూసినా…. కొత్తగానే వుంటుంది. ఆ పాత్ర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. అలాంటి పాత్రను మరోసారి రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ తానే సినిమాని నిర్మించి టైటిల్ పాత్రలో నటించారు. మన్యం ధీరుడు పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి.మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన్యం ధీరుడు ఆడియన్స్ ను ఏమాత్ర ఆకట్టుకున్నారో చూద్దాం పదండి. కథ: మన్యం వీరుడు అంటే ఈ కాలం వారికి అందరికీ తెలిసిందే. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన…
ఉరుకు పటేల మూవీ రివ్యూ : మనసు దోచే కామెడీ థ్రిల్లర్!
లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై కంచర్ల బాల భాను నిర్మాణంలో వివేక్ రెడ్డి దర్శకత్వంలో తేజస్ కంచర్ల, కుష్బూ చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్. ఉరుకు పటేల సినిమా నేడు (వినాయక చవితి రోజు సెప్టెంబర్ 7న) థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ విషయానికొస్తే.. పటేల(తేజస్) ఊరి సర్పంచ్(గోపరాజు రమణ) కొడుకు. చిన్నప్పుడే తనకు చదువు రాదని అర్ధమయిపోయి చదువు మధ్యలోనే వదిలేసి ఎప్పటికైనా బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అవుతాడు. అప్పట్నుంచి ఊళ్ళో చదువుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుక్కొని ఛీ కొట్టించుకుంటాడు. బాగా డబ్బులు ఉండటం, సర్పంచ్ కొడుకు కావడంతో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఒక పెళ్ళిలో అక్షర(కుష్బూ…
SPEED220 మూవీ రివ్యూ : అలరించే ప్రేమకథ!
యువతరాన్ని ఎంగేజ్ చేసే సినిమాలకి టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో క్రేజ్ ఉంది. అందుకే నవతరం దర్శకులు, నిర్మాతలు యూత్ ఫుల్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తుంటారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కూడా నిర్మాతలు ఆశాజనకంగా గట్టేక్కే పరిస్థితి ఉంటుంది. అందుకు తోడు ఓటీటీకి ఇలాంటి స్టోరీస్ బాగా వర్కవుట్ అవుతాయి. తాజాగా ఇలాంటి కథ… కథనాలతో తెరకెక్కిందే.. SPEED220. ఈచిత్రాన్ని విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో కొల్ల గణేష్, మల్లిడి హేమంత్ రెడ్డి, భజరంగ్ ప్రీతి సుందర్ కుమార్, శర్మ జాహ్నవి, తాటికొండ మహేంద్రనాథ్ తదితరులు నటించారు. డెబ్యూ దర్శకుడు హర్ష బీజగం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రా లవ్ స్టోరీ.. స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల…
AAY Movie Review in Telugu : ఆయ్’ మూవీ రివ్యూ.. ముగ్గురు మిత్రుల నవ్వుల నజరానా!
ఎన్టీఆర్ బావమర్ది నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్’. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో అంజి మణిపుత్ర దర్శకత్వంలో ‘ఆయ్’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఆయ్ సినిమా ఆగస్టు 16న థియేటర్స్ లోకి వస్తుండగా నేడు (ఆగస్టు 15)న ప్రీమియర్స్ వేశారు. కథ : కరోనా వచ్చిన కొత్తల్లో ఈ కథ జరుగుతుంది. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న కార్తీక్ (నార్నె నితిన్) వర్క్ ఫ్రమ్ హోమ్ తో గోదావరి జిల్లాల్లోని తన ఊరికి వస్తాడు.…
ఎన్విరాన్ మెంట్ కి ఎగినెస్ట్ గా వెళ్లొద్దని చెప్పే… సింబా
ఇటీవల సీనియర్ నటుడు జగపతి బాబు చాలా సెలెక్టివ్ గా రోల్స్ ఎంపిక చేసుకుంటూ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా నిర్మాత తన చిరకాల మిత్రుడు రాజేందరరెడ్డి నిర్మించిన ‘సింబా’ చిత్రంలో పర్యావరణ ప్రేమికుడిగా పురుషోత్తమ్ రెడ్డి పాత్రను పోషించారు. ఆయనకు సహాయకులుగా నిత్యం వార్తల్లో వుండే గ్లామర్ బ్యూటీ అనసూయ, యానిమల్ లో నటించిన యంగ్ హీరో మాగంటి శ్రీనాథ్ నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ మాస్ దర్శకుడు సంపత్ నంది కథ.. మాటలు అందించారు. ఆయన కూడా నిర్మాణ బాధ్యతల్లో భాగస్వామిగా వ్యవహరించారు. ఈ చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించి… ఓ మెసేజ్ కూడా ఇచ్చినట్టు ఇటీవల మూవీ నిర్మాత తెలిపారు. జగపతిబాబు ఇంటి ఆవరణంలో విపరీతంగా పచ్చదనం ఉంటుందని, ఆయన అయితే ఈ సినిమా టైటిల్ పాత్రకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ…
sriranganethulu movie review in telugu : శ్రీరంగనీతులు మూవీ రివ్యూ.. యువతరం భావోద్వేగాల ప్రయాణం!
సుహాస్, కార్తీక్‌రత్నం,రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం శ్రీరంగనీతులు. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే ‘శ్రీరంగనీతులు’. సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానీశర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో ఆంథాలజీ సినిమాగా తెరకెక్కిన సినిమా ఇది. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించారు. ఏప్రిల్ 11న ఈ చిత్రం థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ‘శ్రీరంగనీతులు’ సినిమాను…
Manjummel Boys Movie Review in Telugu : ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ రివ్యూ: ఎమోషనల్ థ్రిల్లర్!
(చిత్రం : మంజుమ్మెల్ బాయ్స్ , విడుదల తేదీ : 06, ఏప్రిల్ 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ తదితరులు, దర్శకత్వం: చిదంబరం, నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, సంగీత దర్శకులు: సుశీన్ శ్యామ్, సినిమాటోగ్రఫీ : షైజు ఖలీద్, ఎడిటింగ్: వివేక్ హర్షన్). సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్ కీలక పాత్రలు పోషించిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ . ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా ఈ శుక్రవారం (6, ఏప్రిల్ 2024) విడుదలైంది. మరి ఈ చిత్రం, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం….…