గవిరెడ్డి శ్రీను కొత్త చిత్రం ‘చీన్ టపాక్‌ డుం డుం’ ప్రారంభం

Gavireddy Srinu's new film 'Cheen Tapak Dum Dum' launched

‘శుభం’ ఫేమ్ గవిరెడ్డి శ్రీను హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చీన్ టపాక్‌ డుం డుం’.  అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ హిట్ సిరీస్‌లు కుమారి శ్రీమతి, శుభం ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచయిత-నటుడు గవిరెడ్డి శ్రీను కెరీర్‌లో కొత్త అధ్యాయానికి ఈ మూవీ శ్రీకారం చుట్టింది. ఆద్యంతం వినోదాత్మక చిత్రంగా ‘చీన్ టపాక్‌ డుం డుం’ తెరకెక్కనుందని టైటిల్‌ విన్న ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత, దర్శకులు మల్లిడి వశిష్ఠ, గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, బివిఎస్ రవి, గౌతమి తదితరులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి  సమంత క్లాప్…

మెగాస్టార్ కెరీర్ లోనే సరికొత్త రికార్డ్!

A new record in the megastar's career!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అన్ని ప్రాంతాలలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించింది. 6వ రోజు ముగిసే నాటికి, ప్రపంచవ్యాప్తంగా రూ. 261 కోట్లకు పైగా వసూలు చేసింది, ఇప్పుడు రూ. 300 కోట్ల మార్కు చేరువలో ఉంది. ముఖ్యంగా “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం యూఎస్ఏ లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, 3 మిలియన్ల మైలురాయికి చేరువవుతోంది. గతంలో చిరంజీవి అత్యుత్తమ ఓవర్సీస్ చిత్రంగా నిలిచిన ‘సైరా నరసింహారెడ్డి’ (2.7 మిలియన్లు) రికార్డ్ ను ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా అధిగమించింది. మొత్తానికి అనిల్ రావిపూడి ఫుల్ వినోదాత్మక చిత్రాన్ని అందించారు, ఇందులో చిరంజీవి ట్రేడ్‌మార్క్…

అమెరికాలో ఘనంగా ‘ఆటాడిన పాట’ టైటిల్ విడుదల

‘Aataadina Paata’ Title Launched Grandly in the USA

నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ రచయిత వేణు నక్షత్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆటాడిన పాట’. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లాంచ్ కార్యక్రమం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం, స్టెర్లింగ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి టైటిల్‌ను అధికారికంగా లాంచ్ చేయగా, టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు వేణు నక్షత్రం మాట్లాడుతూ…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి, తమ సన్నిహిత మాటలతో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన జయంత్ చల్లా గారికి, అలాగే నాగేశ్వర్ రావు పూజారి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డీసీ…

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే హోప్స్

Hopes on 'Ustad Bhagat Singh'

హీరోయిన్ శ్రీలీలది ఒకప్పుడు గోల్డెన్ హ్యాండ్. ఓ వెలుగు వెలిగిన టాలెంటెడ్ యాక్ట్రెస్. ఈ భామ కెరీర్ ప్రస్తుతం సందిగ్ధంలోనే ఉంది. హీరోయిన్ గానే కాకుండా ‘భగవంత్ కేసరి’లో కీలకపాత్ర పోషించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నా… ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఈ బ్యూటీని వెక్కిరించాయి. గత రెండేళ్ళలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఎదుర్కొంది. కోలీవుడ్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన శివ కార్తికేయన్‌తో ‘పరాశక్తి’లో నటించింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ టాక్ నే తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఈ సొగసరి ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న ఈ చిత్రంలో శ్రీలీల మెరవనుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. దీంతో…

మెగాస్టార్ ఇంట్లో ఘనంగా విజయోత్సవ వేడుక

A grand victory celebration at the Megastar's house

* హాజరైన వెంకటేష్, రామ్ చరణ్, అనిల్ రావిపూడి, చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరంజీవి మెగా ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రికార్డులను బద్దలు కొట్టి, సంచలనాత్మకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో అద్భుతమైన జోరును కొనసాగిస్తూ, ఉత్తర అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో మెగాస్టార్ ఇంట్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని పురస్కరించుకుని, చిరంజీవి తన హైదరాబాద్ నివాసంలో ఒక గ్రాండ్ పార్టీని ఇచ్చి, ఆ సాయంత్రాన్ని సంక్రాంతి వేడుకల కొనసాగింపుగా మార్చారు. తారల సందడితో కూడిన వేడుకకు రామ్ చరణ్, వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు…

అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ ప్రాజెక్ట్‌

Mythri Movie Makers' big project with Allu Arjun as the hero

సంక్రాంతి రోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల‌కు మ‌రో గుడ్‌న్యూస్ వ‌చ్చేసింది.  అల్లు అర్జున్ హీరోగా బ్లాక్ బ‌స్ట‌ర్ ఫిల్మ్ మేక‌ర్‌ లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో  ఓ ప్ర‌తిష్టాత్మ‌క సినిమా రాబోతుంది. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో ఇద్ద‌రు స్టార్స్ క‌లిసి ప‌ని చేయ‌బోతోన్న ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నుంది. ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను ప‌వ‌ర్‌ఫుల్ వీడియో కంటెంట్‌తో అనౌన్స్ చేయ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బివి వ‌ర్క్స్‌తో క‌లిసి నిర్మిస్తోన్నఈ సినిమా నేష‌న‌ల్ రేంజ్‌లో అభిమానులు, ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను పెంచేస్తోంది. ఈ భారీ చిత్రానికి న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ నిర్మాత‌లు. బ‌న్నీవాస్‌తో పాటు న‌ట్టి, శాండీ, స్వాతి స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడీ అనౌన్స్‌మెంట్ తెగ వైర‌ల్ అవుతోంది.…

‘అనగనగా ఒక రాజు’ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

Star entertainer Naveen Polishetty thanks the audience for giving the movie 'Anaganaga Oka Raju' a blockbuster talk

ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టారు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, చివరిలో భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని.. అసలు సిసలైన పండగ…

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో పీపుల్ మీడియా ప్రయాణం

People Media's journey with Pawan Kalyan Creative Works

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’తో చేతులు కలిపిన విషయం విదితమే. ఈ రెండు సంస్థలు కలిసి గొప్ప చిత్రాలను ప్రేక్షకులను అందించడానికి సిద్ధమవుతున్నాయి. గతంలోనే ఈ సంస్థల మధ్య కథలకు సంబంధించిన చర్చలు జరిగాయి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలిసి రాబోయే ప్రాజెక్టులపై చర్చించారు. పవన్ కళ్యాణ్, టీజీ విశ్వప్రసాద్ భేటీ గురించి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ స్పందిస్తూ.. “భోగి శుభ సందర్భంగా కొత్త ఆరంభాల స్ఫూర్తిని సూచిస్తూ, రాబోయే ప్రాజెక్టులపై గతంలో జరిగిన చర్చలను కొనసాగిస్తూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ని కలిసి మరింత విస్తృతంగా చర్చించారు.”…

కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ్డి ‘వేదవ్యాస్’ ప్రారంభం

SV Krishna Reddy launches 'Vedavyas' on the occasion of K. Atchi Reddy's birthday

హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో  ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్”. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త,  పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. బుధవారం నిర్మాత కె.అచ్చిరెడ్డి బర్త్ డే పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఆయన పుట్టినరోజు వేడుకలతో పాటు  “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ ను పరిచయం చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నటుడు సాయికుమార్ మాట్లాడుతూ –…

‘నారీ నారీ నడుమ మురారి’తో ఇది శర్వా సంక్రాంతి అవుతుంది. : ప్రెస్ మీట్ లో నిర్మాత అనిల్ సుంకర  

This will be Sharva Sankranti with 'Nari Nari Nadu Murari': Producer Anil Sunkara at the press meet

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నిర్మాతగా ఇది 16వ సంవత్సరం. జనవరి 14, 2010 నమో వెంకటేశా విడుదలైయింది. యాదృచ్ఛికంగా జనవరి 14న నారీనారీ నడుమ మురారి రిలీజ్ అవుతుంది. సామజవరగమన ఒక మిరాకిల్. కోవిడ్ సమయంలో…