మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కోఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ సూటి ప్రశ్న సింగరేణి కానీకి చెందిన ఒక గిరిజన చిన్న పసి పాప ఐదు సంవత్సరాల పాప కిరాణా కొట్టుకు తల్లి ఇచ్చిన ఐదు రూపాయలతో కొనుక్కోడానికి వెళ్ళిన పాపను ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న దుర్మార్గుడు ఆ పాపను అపహరించి మానభంగం చేసి చంపేయడం జరిగింది.ఈ సంఘటన యావత్ ప్రపంచానికి గుండెలు పిండేసే విధంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గాని స్థానిక ఎమ్మెల్యే గాని ఎవరు కూడా స్పందించలేదు ఈ రోజున తల్లిదండ్రులు నడిరోడ్డు మీద కన్నీళ్లతో వాళ్ళు రోడ్డుపై బైఠాయించడం జరిగింది వాళ్ళతో మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోదు నా పాపను నాకు తెచ్చి ఇవ్వండి అని బోరునా ఏడుస్తున్న వాళ్లను చూసి ప్రతి ఒక్కరు…
Category: FILM NEWS
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా చిత్రం లాంఛనంగా ప్రారంభం
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి స్క్రిప్ట్‌ను డైరెక్టర్ శంకర్‌కు అందించారు.రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న 15వ చిత్రమిది. అలాగే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న 50వ చిత్రం. తెలుగు, తమిళ,, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో మూవీ రూపొందనుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా…
‘Bhavadeeyudu Bhagat Singh’ First Look
Bhavadeeyudu Bhagat Singh The blockbuster combination of Pawan Kalyan and Harish Shankar reunites. A prestigious project by Mythri Movie Makers. “Bhavadeeyudu Bhagat Singh” – an indelible signature on the silver screen.Pawan Kalyan – Harish Shankar – Mythri Movie Makers project titled as ‘Bhavadeeyudu Bhagat Singh’.The expectations are always sky high when a successful combo of an actor and director reunite for a project. ‘Bhavadeeyudu Bhagat Singh’ will exactly meet those expectations with leading actor Pawan Kalyan joining hands with blockbuster young director Harish Shankar under the production of the popular…
‘’భవదీయుడు భగత్ సింగ్”
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్న చిత్రం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం. వెండితెరపై చెరగని సంతకం ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్” ‘’భవదీయుడు భగత్ సింగ్” పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరిది. విజయవంతమైన చిత్రాల కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నిర్మిత మయ్యే చిత్రాలపై అంచనాలు ఎప్పుడూ అధికంగానే ఉంటాయి. వీటిని మరోసారి నిజం చేసేలా టాలీవుడ్ అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ , ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్” చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం పేరును ఈ రోజు ఉదయం 9.45 నిమిషాలకు…
శ్రీ విష్ణు, చైతన్య దంతులూరి, వారాహి చలన చిత్రం ‘భళా తందనాన’లో హీరోయిన్ కేథరిన్ థ్రెసా ఫస్ట్ లుక్ విడుదల
శ్రీ విష్ణు, కేథరిన్ థ్రెసా కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న చిత్రం భళా తందనాన . ఈ సినిమాకు బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. కేథరిన్ థ్రెసా పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు.చీరకట్టులో కేథరిన్ థ్రెసా అద్భుతంగా కనిపించారు. శశి రేఖ అనే పాత్రలో కేథరిన్ థ్రెసా కనిపించబోతోన్నారు. ఎంతో ధైర్యం కలిగిన అమ్మాయి పాత్రలో కేథరిన్ థ్రెసా అదరగొట్టనున్నారు. ఇక హీరో శ్రీ విష్ణును ఇది వరకెన్నడూ చూపించినటువంటి పాత్రలో ప్రజెంట్ చేయబోతోన్నారు దర్శకుడు చైతన్య. కేథరిన్ థ్రెసా అయితే ఎంతో సెలెక్టివ్‌గా సినిమాల్లో నటిస్తున్నారు. అలాంటి హీరోయిన్‌కు ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. కేజీయఫ్ ఫేమ్ రామచంద్రరాజు ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.వారాహి చలనచిత్రం బ్యానర్‌పై…
మాస్ మహరాజా రవితేజ, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు ఖిలాడి ఫస్ట్ సింగిల్ రిలీజ్
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇటీవల రవితేజ, డింపుల్ హయతి మీద తెరకెక్కించిన పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ఇష్టం’ అనే మొదటి పాటను రిలీజ్ చేశారు.ఈ పాటలో డింపుల్ హయతి చీరకట్టులో ఆకట్టుకున్నారు. రవితేజ మీదున్న ప్రేమను డింపుల్ ప్రకటించేట్టుగా ఈ పాట కొనసాగుతుంది. తన డ్యాన్సులతో డింపుల్ హయతి కట్టిపడేయగా.. రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జీతో అదరగొట్టారు. తెరపై ఈ జంట చూడముచ్చటగా ఉంది.ఇక ఈ పాటకు ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన మెలోడి…
నితిన్, ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి, శ్రేష్ట్ మూవీస్ ‘మాచర్ల నియోజకవర్గం’ పూజాకార్యక్రమాలతో ప్రారంభం
విభిన్న కథలు చేస్తోన్న హీరో నితిన్ ఇప్పుడు మరో సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నితిన్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, నిర్మాత రామ్ మోహన్ కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశానికి అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వెంకీ కుడుముల స్క్రిప్టును మేకర్స్‌కి అందజేశారు. ఈ మూవీ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కొంత మంది రౌడీలు హీరో నితిన్‌పై అటాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక మంటల్లో యాక్షన్…
ఈ ‘బర్త్ డే’కి నాకొక భారీ గిఫ్ట్: తుమ్మలపల్లి
“నిర్మాతగా నా వందో చిత్రం… వంద రోజుల సినిమాలు తీయడంలో సిద్ధహస్తులైన- “వంద సినిమాల దర్శకశిఖరం” రూపొందించనున్నారు. నిర్మాతగా నా స్థాయిని వంద రెట్లు పెంచే సదరు వందో చిత్రం అధికారిక ప్రకటన… వంద చిత్రాల దర్శకుడు అధికారికంగా అతి త్వరలో ప్రకటించనున్నారు. ఈ పుట్టినరోజుకు నేనందుకుంటున్న అతి పెద్ద కానుక ఇది. అంతేకాదు… నిర్మాతగా నాకిది “లైఫ్ టైమ్ అచీవ్మెంట్” లాంటిది” అంటున్నారు ప్రముఖ నిర్మాత – భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. సెప్టెంబర్ 10… తన 64వ పుట్టినరోజును పునస్కరించుకుని ఆయన మీడియాతో ముచ్చటించారు.“2021 నాకు చాలా ప్రత్యేకమైన సంవత్సరం. “జాతీయ రహదారి” 10 న విడుదలవుతోంది. ఈ సినిమా కచ్చితంగా అవార్డుల పంట పండిస్తుంది. నా పేవరెట్ డైరెక్టర్ ఆర్జీవి దర్శకత్వంలో ప్రముఖ రచయిత యండమూరి అందించిన కథతో ‘తులసి తీర్ధం’…
రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే.. అదే తనీష్ “మరో ప్రస్థానం” స్పెషాలిటీ
ఇప్పుడు ట్రెండ్ మారింది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది. ఇది తనీష్ హీరోగా నటించిన “మరో ప్రస్థానం” సినిమాకి ఓ వరం అని చెప్పచ్చు. తనీష్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెలాఖరుకు “మరో ప్రస్థానం” చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.“మరో ప్రస్థానం” సినిమా విషయానికి వస్తే…రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్, జర్క్స్, రివైండ్ షాట్స్ లేకుండా స్ట్రైట్ స్క్రీన్ ప్లే…
దేశానికే ఆదర్శం రామచంద్ర రెడ్డి గారి జీవితం : నీలకంఠ
( ప్రధమ భూదాన్ వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్ ) 1951 సంవత్సరంలో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రధమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి పేదలకు దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమి కోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే.. ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞంగా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన రామచంద్రారెడ్డి జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్…
