గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు హీరోగా ఆర్కే మలినేని దర్శకత్వంలో ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన చిత్రం.‘క్యాలీ ఫ్లవర్’ ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.కరోనా టైం లో ఈ సినిమా విడుదల చేయడం జరిగింది. అప్పుడు చూడని ప్రేక్షకుల కోసం ఈ నెల ఏప్రిల్ 9 నుండి అన్ని ఓటిటి లో ఫ్లాట్ ఫామ్స్ లలో “క్యాలీ ఫ్లవర్” సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఆశా జ్యోతి, శ్రీరామ్ లు మాట్లాడుతూ.. ఈ నెల 9 న మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైన్మెంట్స్…
Category: FILM NEWS
ఉగాది సందర్భంగా కిరణ్ అబ్బవరం “నేను మీకు బాగా కావాల్సినవాడిని” మొదటి సాంగ్ ‘లాయర్ పాప’ విడుదల..
యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రోడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. కొత్త దర్శకుడు కార్తిక్ శంకర్ ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికే టాకి పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఉగాది సందర్భంగా మొదటి పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని లహరి ద్వారా మార్కెట్ చేస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా…
‘ఏ స్టార్ ఈజ్ బార్న్’ తొలి షెడ్యూల్ పూర్తి
కొత్తవారికి టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. కళ్యాణ్ శివ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా “ఏ స్టార్ ఈజ్ బార్న్”. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు. సి.రవి సాగర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి ముగ్గురు నూతన కథానాయికలు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. క్యారక్టర్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తో పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, సోమశిల,జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో హీరో,హీరోయిన్ ల మధ్య సన్నివేశాల చిత్రీకరణతో మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకోగా ఈ సినిమా లో 93 మంది కొత్త, పాత నటీనటులు నటిస్తుండడం విశేషం.…
‘శుభగృహ’ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాడిసర్‌గా మెగాస్టార్ చిరంజీవి
‘‘వెండితెరపై తన నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు తనదైన సామాజిక సేవా కార్యక్రమాలతో మహోన్నత వ్యక్తిగా పేరుపొందిన మెగాస్టార్ చిరంజీవి గారు మా ‘శుభగృహ’ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాడిసర్‌గా వుండేందుకు ఒప్పుకోవడం మాకు ఎంతో ఆనందంగా, గర్వంగా వుందని శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ నంబూరు కళ్యాణ్‌చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ అందమైన ఊహకు పొందికైన రూపం’ అంటూ లక్షలాది మంది కస్టమర్లకు చేరువైన మా సంస్థకు మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి గొప్ప వ్యక్తి ప్రచారకర్తగా వుండటం ఎంతో సంతోషంగా వుంది. ‘పుష్ప’ చిత్రంతో భారతదేశం గర్వించదగ్గ దర్శకుల జాబితాలో చేరిన జీనియస్ దర్శకుడు సుకుమార్ గారి దర్శకత్వంలో, నట శిఖరం చిరంజీవి గారు నటించగా, ఇటీవల మా సంస్థకు ఓ యాడ్ షూట్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైన శివ నాగేశ్వరరావు ‘దోచేవారెవరురా.. ‘ టైటిల్ ఫస్ట్ లుక్!!
IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దోచేవారెవరురా’ టైటిల్ చాలా బాగుంది అని.. సినిమా కూడా అంతే బాగుంటుందని నమ్ముతున్నట్లు చెప్పారు వర్మ. తనకు శివ నాగేశ్వరరావుతో మొదటి సినిమా నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాముతో మాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయనతో నేను ఉన్నంత క్లోజ్ గా మా బ్యాచ్ లో ఎవరు ఉండరు. దర్శకుడిగా నాకు మొదటి అవకాశం ఇచ్చింది ఆయనే. ఈ సినిమా ఫస్ట్…
ఉగాది సందర్భంగా ‘ది వారియర్’లో రామ్ పోతినేని స్టైలిష్ పోలీస్ లుక్ విడుదల
ఉగాదికి ఉస్తాద్ రామ్ పోతినేని స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాపో (#RAPO) అభిమానులకు పండగ తీసుకొచ్చారు. ఆయన స్టైలిష్ పోలీస్ లుక్ అదుర్స్ అని అంతా అంటున్నారు. రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ‘ది వారియర్’లో రామ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఖాకీ యూనిఫామ్ వేయడం ఆయన కెరీర్‌లో ఇదే తొలిసారి. సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు రామ్ పోలీస్ అనే సంగతి వెల్లడించారు. ఆ లుక్‌లో షార్ట్ హెయిర్…
RK Talkies Banner’s Dhatri First Look Poster Released On Ugadi
There is huge demand for films with unique concepts and following the trend upcoming filmmakers are coming up with content-based movies. Even, audience of this generation are showing interest in watching different movies, irrespective of scale of the films. Under these circumstances, Ravi Kiran is making debut as hero with Production No 2 of RK Talkies banner titled Dhatri. Billed to be an action entertainer, the film is set to go on floors soon. The film is written and directed by Narsimha Vadde, who has vast experience of working in…
ఉగాది పండుగ సందర్భంగా ఉదయ్ శంకర్ ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ..’ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్
యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. ఎప్పుడూ వైవిధ్యమైన కథలు ఎంచుకునే ఉదయ్ శంకర్ తన కెరీర్ లో చేస్తున్న మరో విభిన్న చిత్రమిది. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఉగాది పండుగ సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ చూస్తే…హీరోయిన్ కు రోజ్ ఫ్లవర్ ఇస్తూ లవ్ ప్రపోజ్ చేస్తున్న కథానాయకుడిని వద్దని వారిస్తున్నాడు అతని స్నేహితుడు. నచ్చింది గర్ల్ ఫ్రెండూ అనే టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు.…
విజువల్ ట్రీట్ తో వస్తున్న ‘105 మినిట్స్’
హన్సిక మోత్వాని ప్రధాన పాత్ర లో రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై ” సింగిల్ షాట్” ” “సింగిల్ క్యారెక్టర్” లో నిర్మించిన చిత్రం “105 మినిట్స్”. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కు సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా చిత్రం లో ముఖ్య భూమిక పోషించిన హన్సిక మోత్వాని మాట్లాడుతూ .. ” సింగిల్ షాట్” ” సింగిల్ క్యారెక్టర్ ” తో ఎంతో వైవిధ్యంగా నిర్మించిన ఈ చిత్రం నా కెరీర్ లో ఒక మైలురాయి గా నిలిచి పోతుంది. విజువల్స్ చూసాక షూటింగ్ లో పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. విజువల్స్ అంత అద్భుతంగా వస్తున్నాయి అని సంతోషం తో తెలిపారు. నిర్మాత బొమ్మక్ శివ మాట్లాడుతూ సినిమా అనుకున్నది అనుకున్నట్టు చాలా బాగా వచ్చింది.మా డైరెక్టర్ ఏదైతే…
శివ నాగేశ్వరరావు కామెడీ థ్రిల్లర్ ‘దోచేవారెవరురా..’ లోగో ఆవిష్కరణ
మనీ, సిసింధ్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివ నాగేశ్వరరావు ప్రస్తుతం నూతన నటీనటులతో సరికొత్త తరహాలో కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రత్యేక పాత్రల్లో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి కనిపించనున్నారు. ఐక్యూ క్రియేషన్స్ బ్యానర్ లో .వినోదాత్మక చిత్రాలను రూపొందించే క్రమంలో బొద్దు కోటేశ్వరరావు తమ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం-1 కింద శివ నాగేశ్వరరావుతో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ‘దోచేవారెవరురా..’ లోగో ఉగాది సంధర్బంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయనున్నారు.చిత్రబృందం!!
