-నువ్వు రాసి ఇచ్చిన అగ్రీమెంట్లు, చెక్కులు అన్నీ ఫోర్జరీ నే అంటావా? -లీగల్ గా తేల్చుకుంటాం… రాంగోపాల్ వర్మ…నువ్వు, అలాగే నీ తాత్కాలిక మరో స్నేహితుడు రామసత్యనారాయణ ఆడుతున్న నాటకాలు ఎవరికి తెలియవు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో స్నేహం నటించి, వారి చేత నీ సినిమాలకు పెట్టుబడులు పెట్టించుకుని, ఆ తర్వాత మోసగించడం నీకు తెలిసినంతగా బహుశా సినీ పరిశ్రమలో ఇంకెవరికీ తెలియకపోవచ్చు. మోసపోయిన వాళ్లంతా బయటకు వచ్చి, నీ నిజ స్వరూపాన్ని ఇంతవరకు బయట పెట్టకపోవడం వల్లే, ఇంకెందరో నీ చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. నీ పాపాలు పండే సమయం ఆసన్నమయ్యింది. అందుకే నీకు ఈ విపరీత బుద్దులు పుట్టి, ఈ విధంగా వ్యహరిస్తున్నావు. మా ఇష్టం (డేంజరస్), హిందీ “ఖత్రా” చిత్రం విడుదలపై మేము స్టే తేవడంతో ఆగిపోయిన. విషయం తెలిసిందే. అది జరిగిపోయిన ఇన్ని…
Category: FILM NEWS
నట్టి కుమార్, నట్టి క్రాంతి, నట్టి కరుణలపై చట్టపరమైన చర్యలపై మాత్రమే దృష్టి పెడతా : రాం గోపాల్ వర్మ
-అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయట పడబోతోంది గత కొద్ది రోజులుగా మీడియా లో చక్కర్లు కొడుతున్న నట్టి కుమార్, నట్టి క్రాంతి, నట్టి కరుణ ల విషయమై ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్ చిత్రాన్ని ఆపటానికి నట్టి క్రాంతి,నట్టి కరుణ లు కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా 5వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. ఆ క్రింది కోర్టు ఇచ్చిన injunction ఆర్డర్ ని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది నేను ఇప్పుడు నట్టి క్రాంతి నట్టి కరుణ ల మీద ఫోర్జరీ కి సంభందించిన కేసే కాకుండా, వివిధ…
‘ఆచార్య’ నుంచి ‘భలే భలే బంజారా..’ సాంగ్ రిలీజ్.. ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్!!
సింబా రింబ సింబా రింబ సిరత పులుల సిందాట సింబా రింబ సింబా రింబ సరదా పులుల సయ్యాట సీమలు దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చిందీ నిప్పు కాక రేగింది.. డప్పు మోత మోగింది కాకులు దూరని కారడవిలో పండగ పుట్టింది గాలి గంతులాడింది.. నేల వంత పాడింది సీకటంతా సిల్లుపడి ఎన్నెలయ్యిందియాలా అందినంత దండుకుందా పద తలో చేయ్యలా భలే భలే బంజారా మజా మందేరా రేయి కచేరీలో రెచ్చిపోదాం రా భలే భలే బంజారా మజా మందేరా రేయి కచేరీలో రెచ్చిపోదాం రా ’’ అని ఆచార్య, సిద్ధ హుషారుగా చిందేస్తున్నారు. అసలు వారికి అడవిలో ఏం పని.. వారిని చూసి ఆడవి బిడ్డలు ఎందుకు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. అనే విషయాలు తెలియాలంటే ‘ఆచార్య’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్‌స్టార్…
మ్యూజిక్ స్కూల్ నాలుగో షెడ్యూల్ గోవాలో పూర్తి!
శ్రియ శరణ్, శర్మణ్ జోషి, షాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా మ్యూజిక్ స్కూల్. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నాలుగో షెడ్యూల్‌ని ఇటీవల గోవాలో పూర్తి చేశారు పాపారావు బియ్యాల. బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేసుల్లోనూ, బీచ్ బ్యాక్‌డ్రాప్‌లలోనూ ఈ సినిమాలోని కీలకమైన టాకీ పోర్షన్‌ని కంప్లీట్ చేశారు డైరక్టర్. గోవాలో పూర్తి చేసిన ఈ షూటింగ్‌తో దాదాపు 95 శాతం చిత్రీకరణ పూర్తయినట్టే. మ్యూజిక్ స్కూల్‌లో తన పోర్షన్‌ని పూర్తి చేసిన షాన్ మాట్లాడుతూ ”మ్యూజిక్ స్కూల్‌కి షూటింగ్ చేస్తున్నంత సేపు చాలా అద్భుతంగా అనిపించింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం పెద్ద కుటుంబంలోని వ్యక్తుల్లాగా కలిసిపోయాం. సరదాగా గడిపాం. ముఖ్యంగా, మాతో పనిచేసిన పిల్లలు ఎప్పుడూ ఉత్సాహంగా, ఉరకలేస్తూ ఉండేవారు. వాళ్లందరినీ మిస్ అవుతానని మాత్రం కచ్చితంగా చెప్పగలను. సినిమా రూపుదిద్దుకున్న…
వైభవంగా ప్రారంభమైన ‘ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు’
కుటుంబం అంతా కలిసి చూసేలా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఎస్వీ. కృష్ణారెడ్డి. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టి నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు వంటి వైవిధ్యమైన టైటిల్ తో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా మజిలీ ఫేమ్ అనన్య హీరోయిన్ గా అమ్ము క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, కుష్భు, ఆలీ, సునీల్, వరుణ్ సందేశ్, రష్మీ, హేమ, అజయ్ గోష్, రాజా రవీంద్ర…
గౌడ కులస్తుల మనోభావాలని అర్ధం చేసుకుని మా ‘ధర్మపురి’ ట్రైలర్ లో అభ్యంతకర షాట్ ని తొలగించాం : ‘ధర్మపురి’ టీమ్
అందరికి నమస్కారం… గౌడ కుల సంఘం పెద్దలకు , గీత కార్మిక సహోదరులకు మా యొక్క ‘ధర్మపురి’ మూవీ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. గత 2 రోజులుగా మాయొక్క ధర్మపురి మూవీ లోని ట్రయిలర్ లో గౌడన్న ముఖము మీద కల్లు పోయడం మీద గౌడ సంఘాల పెద్దలు , సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటగా ఆ యొక్క సన్నివేశం మీమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నాము. ఆ సన్నివేశం ట్రైలర్ లో, మరియు సినిమా లో తొలగించడం జరిగింది అని మీకు తెలియజేస్తున్నాము. మరియు మిగతా సినిమా లో అన్ని సన్నివేశాలు గీత కార్మికుల, గౌడన్నల వృత్తి గౌరవాన్ని పెంచే విధంగా మా సినిమా ఉంటుంది. దయచేసి మన గౌడ సంఘాల పెద్దలు, గీత కార్మిక సహోదరులు అందరూ… కొత్తగా వస్తున్న మా…
సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా ‘హు ఆర్ యు?’ చిత్రం ప్రారంభం
సురేష్ సపవత్, సత్నా టైటస్ (బిచ్చగాడు మూవీ ఫేమ్) హీరోహీరోయిన్లుగా శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్‌పై వైకుంఠ్ బోణు దర్శకత్వంలో బొక్కిశం భూలక్ష్మి నిర్మిస్తోన్న చిత్రం ‘హు ఆర్ యు?’ (Who Are You?). సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నేడు (శుక్రవారం) హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రియా నాయుడు క్లాప్ కొట్టగా.. లలిత కెమెరా స్విచ్ఛాన్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం గురించి నిర్మాత బొక్కిశం భూలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘మా శివ ప్రియ ప్రొడక్షన్ బ్యానర్‌లో రెండో చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ప్రియా నాయుడు మంచి కథని అందించారు. మంచి టీమ్ కుదిరింది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సస్పెన్స్ క్రైమ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా…
కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం ఆలేరు మండల అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ నియామకం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ ని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం జిల్లా అధ్యక్షుడు గోదా రాహుల్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బంధారపు మధు మాట్లాడుతూ… ”నాపై ఎంతో నమ్మకంతో ఈ పదవికి ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుగుకుంటున్నాను. ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా శతవిధాల కృషి చేస్తాను. గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఓబిసి సెల్ రాష్ట్ర చైర్మన్ గారికి, భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ గారికి ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ పదవికి పార్టీకి అన్ని…
ధనుష్ క్లాప్ తో ఆశిష్ కొత్త మూవీ ‘సెల్ఫిష్’ ఘనంగా ప్రారంభం
రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. “సెల్ఫిష్” టైటిల్ తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్లాప్ నివ్వగా…దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…మా ఆశిష్ రౌడీ బాయ్ చిత్రంతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. మొదటి సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు రెండో సినిమా స్టార్ట్ చేశాడు.…
సినీ పరిశ్రమలోని యదార్థగాథలతో ప్రారంభమైన ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్) చిత్రం
శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై కట్ల ఇమ్మార్టెల్, అమ్మ రాజశేఖర్, అలీషా, షాలిని,సీనియర్ నటుడు సుమన్, బ్రహ్మాజీ,అలీ, చమ్మక్ చంద్ర, శివారెడ్డి, నటీనటులుగా కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఈ.డి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్).ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జీవిత, రాజశేఖర్‌లు స్క్రిప్ట్‌ను అందించి, ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్‌లపై కెమెరా స్విచ్‌ఆన్ చేయగా, పసుర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యం.డి. ప్రశాంత్ కుమార్ గారు క్లాప్ కొట్టారు. నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్‌లు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. చిత్ర నిర్మాత ఈ.డి.ప్రసాద్ మాట్లాడుతూ…కామెడీ, హర్రర్, సెన్సిబుల్ లవ్ స్టొరీ ఉన్న మంచి సబ్జెక్ట్‌ను దర్శకుడు రాజేంద్రప్రసాద్ చెప్పగానే…
