దళిత సీఎం ‘డిక్లరేషన్’ కావాలి !

దళిత సీఎం 'డిక్లరేషన్' కావాలి !

By Sk.Zakeer, Editor,Bunker News : దళితుడ్ని ముఖ్యమంత్రి చేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించగల సాహసం కాంగ్రెస్ పార్టీ చేయగలదా ? అనే ప్రశ్నలకు ఆ పార్టీ హైకమాండ్ జవాబివ్వవలసి ఉన్నది .రైతు సంఘర్షణ పేరుతో పెట్టినా మరో పేరుతో పెట్టినా ముమ్మాటికీ రాజకీయసభే ! రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలు కాకుండా ఇంకేమి చేస్తుంది.కాంగ్రెస్ సన్నాసుల మఠం కాదు కదా ! తనకు ముఖ్యమంత్రి పదవి వద్దని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తన ప్రాధాన్యత అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘వరంగల్ డిక్లరేషన్’ సభలో అన్నారు.ఇప్పుడు ‘ముఖ్యమంత్రి’ మాట ఎందుకు ? ఎవరు సీఎం కావాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవర్ని అధికారంలోకి తీసుకురావాలన్నది ప్రజలు ఇవ్వనున్న అంతిమతీర్పు! ‘డిక్లరేషన్’ అంటే తెలుగులో వాంగ్మూలం అనీ,ప్రకటన అనీ,నివేదిక అనీ…

ఏ కేటగిరీలు మెగాస్టార్ ‘ఆచార్య’ని ముంచాయి?

ఏ కేటగిరీలు మెగాస్టార్ 'ఆచార్య'ని ముంచాయి?

కథ అందామా, స్క్రిప్టు అందామా, స్క్రీన్ ప్లే అందామా? ఏది అంటే అందులో జోక్యాల శాతం తగ్గొచ్చు? కథ అనగానే దాని గురించి మాట్లాడే వాళ్ళు చాలాచాలా మంది వచ్చి చేరిపోతారు. అలా కాదు, ఇలా వుంటే బావుంటుంది…ఇలా కాదు వుంటే బలంగా వుంటుందని తోచింది చెప్పేస్తూంటారు. స్క్రిప్టు అనగానే ఓ మోస్తరు స్పెషలిస్టులు వచ్చి చేరతారు. చూసిన సినిమాల ఉదాహరణలు చెప్తూ స్క్రిప్టు ని అటూ ఇటూ లాగుతారు. స్క్రీన్ ప్లే అనగానే ఈ మొదటి రెండు వర్గాలు ఫిల్టరై పోయి, స్క్రీన్ ప్లే అంటే ఏమిటో బాగా తెలిసిన వాళ్ళే వర్కులో మిగులుతారు. కథ అలా కాదు ఇలా వుండాలని అన్నప్పుడు, ఏఏ అంశాలు దృష్టిలో పెట్టుకుని అంటున్నట్టు? యాక్టివ్ క్యారక్టర్? గాథ కాకుండా కథ? క్యారక్టర్ ఆర్క్? టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్?…

ఆర్జీవీ ‘మా ఇష్టం, ఖత్రా’ సినిమా విడుదలపై రెండోసారి స్టే తెచ్చిన నట్టికుమార్!!

ఆర్జీవీ 'మా ఇష్టం, ఖత్రా' సినిమా విడుదలపై రెండోసారి స్టే తెచ్చిన నట్టి కుమార్!!

రాంగోపాల్ వర్మ రూపొందించిన తెలుగులో ‘మా ఇష్టం” (డేంజరస్), హిందీలో “ఖత్రా” సినిమా శుక్రవారం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఆ సినిమా విడుదలను అడ్డుకుంటూ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గురువారం రెండోసారి కోర్టు నుంచి స్టే తెచ్చారు. తనకు, వర్మకు మధ్య జరిగిన వివిధ సినిమాల లావాదేవీలలో భాగంగా ఇద్దరిమధ్య ఆర్ధిక ఒప్పందాలు జరిగాయని, వాటిని ఉల్లంఘించి, తనకు ఏమీ సంబంధం లేదని వర్మ వ్యవహరించడంతో పాటు, సినిమాలను విడుదల చేసుకుంటుండటంతో, తప్పనిసరి పరిస్థితులలో తాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. ఇంకా నట్టి కుమార్ మాట్లాడుతూ, ఇప్పటికే వర్మ తీసిన ‘లఢఖీ” (ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” చిత్రాన్ని కూడా ఇలానే కోర్టు నుంచి స్టే తెచ్చి…

‘నా నిన్నలలో కన్నులలో ..’ సాంగ్ చాలా స్వీట్ అండ్ క్యూట్ గా ఉంది : సందీప్ కిషన్

Richie-Gadi-Pelli-Second-Song-Launched-by-Sundeep-Kishan

కెఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నుండి “రిచి గాడి పెళ్లి” చిత్రం నుండి రెండో సాంగ్ ప్రముఖ నటుడు సందీప్ కిషన్ చేతుల మీదుగా విడుదల అయ్యింది.శ్రీమణి రాసిన , నా నిన్నలలో కన్నులలో అనే పాటకు లిరిక్స్ అందించారు. మంచి రెస్పాన్స్ కూడా లభిస్తుంది. శక్తిశ్రీ గోపాలన్ గారు మరియు సత్యన్ గారు ఈ పాటని పాడారు.. అలాగే ఈ చిత్రంలో పాడిన , నా నిన్నలలో కన్నులలో అనే పాట పై ప్రముఖ నటుడు సందీప్ కిషన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సందీప్ కిషన్ మాట్లాడుతూ, “రిచిగాడి పెళ్లి” లోని రెండో సాంగ్ నా నిన్నలలో కన్నులలో చూశాను. శక్తిశ్రీ గోపాలన్ మరియు సత్య గారు ఇద్దరు ఏక్స్ట్రార్డినరీగా పాడారు .సాంగ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా…

ఔనూ.. WHO IS VIRAJ REDDY.. ?

ఔనూ.. WHO IS VIRAJ REDDY.. ?

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘హూ ఈజ్‌ విరాజ్‌రెడ్డి?’ అంటూ ఓ వార్త ఫొటోతో సహా హల్‌చల్‌ చేస్తోంది. ముఖ్యంగా మీమ్స్‌ గ్రూప్స్‌లో ఇది విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీంతో ప్రస్తుతం యూత్‌తో పాటు అన్ని వయస్సుల వారిలోనూ నిజంగానే ఈ విరాజ్‌రెడ్డి ఎవరు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. యూత్‌ గేదర్‌ అయ్యే ప్రతి చోటా ఈ విరాజ్‌ రెడ్డి గురించే చర్చ జరుగుతోంది. అసలు ఎవరు ఈ విరాజ్‌రెడ్డి? రాజకీయ నాయకుడి కొడుకా?.. సినీ యాక్టర్‌ వారసుడా?.. ఎవరైనా బిజినెస్‌ టైకూన్‌ ఫ్యామిలీకి చెందిన వ్యక్తా?.. లేక సామాన్యుడా?.. ఇలా అనేక ప్రశ్నలకు తావిచ్చింది ‘హూ ఈజ్‌ విరాజ్‌రెడ్డి?’ పేరుతో విడుదలైన మీమ్స్‌, పోస్టర్‌. ఈ విరాజ్‌రెడ్డి ఎవరు? అని మీకూ తెలుసుకోవాలని ఉందా? అయితే సెర్చింగ్‌ మొదలెట్టండి ‘హూ ఈజ్‌ విరాజ్‌రెడ్డి?’ అని, ఖచ్చితంగా సమాధానం…

దాసరి జయంతి సందర్భంగా పాన్ ఇండియా దర్శకులకు సత్కారం!!

దాసరి జయంతి సందర్భంగా పాన్ ఇండియా దర్శకులకు సత్కారం!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిని అందుకుందన్న బాలీవుడ్ దర్శకులు-నటీమణులు! దాసరి జయంతిని పురస్కరించుకొని పాన్ ఇండియా దర్శకులకు దాసరి కల్చరల్ ఫౌండేషన్ ఆద్వర్యంలో తెలుగు సినిమా వేదిక-ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ సమన్వయంతో ఎఫ్.ఎన్.సి సి క్లబ్ లో అంగరంగ వైభవంగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన బాలీవుడ్ దర్శకులు, నటీమణులు తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిని అందుకుందని కితాబునిచ్చారు. దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు బయోపిక్ ను “దర్శకరత్న” పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాడివాక రమేష్ నాయుడు స్థాపించిన దాసరి కల్చరల్ ఫౌండేషన్… తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, ఎఫ్ టి పి సి అధ్యక్షులు చైతన్య జంగా సంయుక్త సారధ్యంలో దాసరి సంస్మరణ వేడుక…

ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అయ్యే సినిమా ‘శేఖర్’ : దర్శకురాలు జీవితారాజశేఖర్

ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అయ్యే సినిమా 'శేఖర్' : దర్శకురాలు జీవితారాజశేఖర్

‘శేఖర్’ ట్రైలర్ విడుదల చేసిన యంగ్ హీరో అడవి శేష్ రాజశేఖర్ గారి అక్క మొగుడు, సింహరాశి, గోరింటాకు, సినిమాలు ప్రేక్షకులను ఏవిధంగా అలరించాయో ఇప్పుడు వస్తున్న “శేఖర్ ” సినిమా కూడా అంతే ఎమోషన్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు చిత్ర దర్శకురాలు జీవిత రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “శేఖర్”. ఈ…

రాహుల్ పర్యటన ‘ఫైర్ బ్రాండ్’కు అగ్నిపరీక్ష !!

Rahulghandhi-Revanthreddy

By Sk.Zakeer, Editor, Bunker News : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్ర, శనివారాల్లో తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు. పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనను విజయవంతం చేయడం రేవంత్ కు కత్తిమీద సాము లాంటిది.రేవంత్ రాజకీయ చతురతకు,పరిణతికి, శక్తి సామర్ధ్యాలకు, పార్టీ నాయకుల మధ్య సమన్వయ సాధనకు సంబంధించిన అగ్ని పరీక్ష ఇది.ఆయన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు.రైతులతో పాటు దళితులు, బహుజనులు, అట్టడుగువర్గాలు, విద్యార్థులు, యువత,నిరుద్యోగులను ఆకట్టుకునే విధంగా రాహుల్ పర్యటన సాగుతుందని కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి వంటి వారు పోటీ పడినా రాహుల్ గాంధీ ప్లస్ పార్టీ హైకమాండ్ రేవంత్ వైపే మొగ్గు జూపడం వల్ల ఆయనకే పీసీసీ…

సుమ కాకపోతే ‘జయమ్మ పంచాయితీ సినిమా చేసేవాడిని కాదు’ : నిర్మాత బలగ ప్రకాష్

By Salmabegum, Sr.Reporter కుటుంబమంతా కలిసి హాయిగా చూసే సినిమా మా జయమ్మ పంచాయితీ మాటల మాంత్రీకురాలు, బుల్లితెర స్టార్మహిళ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ`. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించ గా విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 6 న సినిమా విడుదలకానుంది ❤️ జయమ్మ పంచాయతీ విడుదల ఏర్పాట్లలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు? అవునండీ… ఈరోజు మా శ్రీకాకుళం, టెక్కలి పరిసర ప్రాంతాల లో ప్రచారాన్ని నిర్వహించాం. 300 మందితో బైక్ ర్యాలీ, 500మందితో జయమ్మ జెండాలతో ఆకట్టుకునే ప్రచారం చేస్తున్నాం. ❤️ దర్శకుడు కథ చెప్పినప్పుడు మీరు జయమ్మ పాత్రకు ముందుగా ఎవరినైనా అనుకున్నారా? నేనైతే సుమగారి పేరే చెప్పాను. మరో నటి ఆలోచనరాలేదు. సుమగారు కాకపోతే సినిమా చేయనని…

శ్రీ‌విష్ణు కు బ్రైట్ ఫ్యూచ‌ర్ వుంది : ‘భళా తందనాన’ ప్రీరిలీజ్ వేడుక‌లో రాజ‌మౌళి

శ్రీ‌విష్ణు కు బ్రైట్ ఫ్యూచ‌ర్ వుంది : 'భళా తందనాన' ప్రీరిలీజ్ వేడుక‌లో రాజ‌మౌళి

By Salmabegum, Sr.Reporter ఘ‌నంగా జ‌రిగిన భళా తందనాన ప్రీరిలీజ్ వేడుక శ్రీవిష్ణు, క్యాథ‌రిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణ లో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మే 6న సినిమా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ప్రీరిలీజ్ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌ లోని జె.ఆర్‌సి. క‌న్‌వెన్‌ష‌న్‌లో జ‌రిగింది. ముఖ్య అతిథులుగా ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, శేఖ‌ర్ క‌మ్ముల హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బిగ్ టికెట్‌ ను వారిరువురూ ఆవిష్క‌రించారు. అనంత‌రం రాజ‌మౌళి మాట్లాడుతూ, చైత‌న్య బాణం సినిమా చూసిన‌ప్పుడు మొద‌ట ఎవ‌రైనా చిన్న సినిమాగా తీస్తారు. త‌ను మాత్రం పెద్ద సినిమా తీశాన‌నే యాటిట్యూడ్ క‌నిపించేలా చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే చేశాడు. ప్ర‌తి మూమెంట్‌లోనూ త‌ర్వాత…