‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు గారి సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి : స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్

'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు గారి సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి : స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్. తాజాగా విడుదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఆల్ టైం రికార్డ్ ని సృష్టించింది. సర్కారు వారి పాట ట్రైలర్ 24గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతుంది. ఇక మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతంలో ‘సర్కారు…

ఆసక్తికలిగిస్తున్న పెళ్లికూతురు పార్టీ ట్రైలర్

ఆసక్తికలిగిస్తున్న పెళ్లికూతురు పార్టీ ట్రైలర్

ప్రిన్స్. అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం పెళ్లికూతురు పార్టీ. ఎ.వి.ఆర్. స్వామి నిర్మించారు. అపర్ణ దర్శకత్వం వహించారు. లేడీ సెంట్రిక్ మూవీగా రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం మే 20న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంగళవారంనాడు పెళ్లికూతురు పార్టీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ఎలా వుందంటే, మగవారే పెండ్లికి ముందు బ్యాచ్లర్ పార్టీ చేసుకుంటున్నారు. మరి ఆడ వాళ్ళు చేసుకుంటే ఎలా వుంటుందనేది ఇందులో చూపించారు. సరదాగా నలుగురు అమ్మాయిలు బ్యాచ్లర్ పార్టీ చేసుకుందామని ఇంటిలో చెబితే బామ్మనుకూడా తీసుకెళ్ళమంటారు. ఇలా కొంచెం ఫన్నీగా మరికొంచెం సీరియస్ యాక్షన్ ఎపిసోడ్స్తో సాగే రోడ్ జర్నీ కథ ఇది. ప్రిన్స్ యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. యూత్…

‘ఎఫ్ 2’ కి మించిన ఫన్ రైడ్ ‘ఎఫ్ 3’ లో వుంటుంది : ఎడిటర్ తమ్మిరాజు

'ఎఫ్ 2' కి మించిన ఫన్ రైడ్ 'ఎఫ్ 3' లో వుంటుంది : ఎడిటర్ తమ్మిరాజు

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘F3’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రాని కి పని చేసిన స్టార్ ఎడిటర్ తమ్మిరాజు మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘ఎఫ్ 3’ విశేషాలు మీ సినీ ప్రయాణం ఎలా…

ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ తో సమంత ‘యశోద’

Samantha-Yashoda

యశోద కళ్లు తెరిచి చూసింది. రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం. చుట్టూ పరిసరాలు, తను వేసుకున్న డ్రెస్సు, తన చేతికున్న వాచ్ తో పాటు అక్కడున్న నిశబ్దం కూడా యశోదకు చాలా కొత్త కొత్త గాను, వింత వింత గానూ అనిపిస్తున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినబడుతుండగా మెల్లిగా వెళ్లి అక్కడున్న కిటికీ తెరిచి చూసింది. తన స్వేచ్ఛే అక్కడ వాలినట్టుగా ఉన్న తెల్లటి పావురాన్ని ఆత్రంగా అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ, అక్కడేం జరిగింది? ఇదంతా ‘యశోద’ ఫస్ట్ గ్లిoప్స్ లో కనిపిస్తుంది. దీన్ని బట్టే ‘యశోద’ సినిమా ఎంత వైవిద్యంగా ఉంటుందో ఊహించుకోవచ్చునంటున్నారు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14 గా రూపొందుతున్న చిత్రం ‘యశోద’. జంట…

ఐశ్వర్య రాజేష్ ‘డ్రైవర్ జమున’ ఫస్ట్ లుక్ విడుదల

ఐశ్వర్య రాజేష్ 'డ్రైవర్ జమున' ఫస్ట్ లుక్ విడుదల

అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఐశ్వర్య రాజేష్. విలక్షణమైన పాత్రలలో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా ‘డ్రైవర్ జమున’ పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా. కిన్స్లిన్ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “డ్రైవర్ జమున” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముఖం మీద చెమటలు, రక్తం మరకలతో ఫిరోషియస్ గా కనిపించారు ఐశ్వర్య రాజేష్. లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో ‘డ్రైవర్ జమున’ చిత్రాన్ని థ్రిల్లింగ్ గా రూపొందిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ఈ పాత్ర…

కలర్స్ స్వాతి రెడ్డి ‘ఇడియట్స్’ ఫస్ట్ లుక్ విడుదల

Colours Swathi Reddy, Abhishek Pictures, Aditya Hasan’s Idiots First Look Out

ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా, రావణాసురుడు, డెవిల్ వంటి భారీ బడ్జెట్ ఎంటర్టైనర్లతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకీ ప్రాధాన్యత ఇస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ నుండి తాజా ప్రొడక్షన్ వెంచర్ అమోఘ ఆర్ట్స్, ఎమ్ఎన్ఓపి కలిసి నిర్మిస్తున్న చిత్రానికి ‘ఇడియట్స్’ అనే క్రేజీ టైటిల్ ని ఖారారు చేశారు. రియల్ హీరోస్ అనేది ఉప శీర్షిక. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలైంది. కలర్స్ స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇడియట్స్’.. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మక అంశాలతో కూడిన స్వచ్చమైన ప్రేమకథగా ఉండబోతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రముఖ తారాగణం అంతా క్యారికేచర్ డిజైన్ లో ప్రతి పాత్ర విభిన్న భావోద్వేగాలతో కనిపించడం గమనించవచ్చు. స్వాతితో పాటు నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ…

Massiest Song Of The Season Ma Ma Mahesha From Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata On May 7th

Massiest Song Of The Season Ma Ma Mahesha From Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata On May 7th

Finally, here comes the announcement regarding the mass number in superstar Mahesh Babu’s highly anticipated flick Sarkaru Vaari Paata being directed by Parasuram. The track being promoted to be the massiest song of the season called Ma Ma Mahesha canned on Mahesh Babu and Keerthy Suresh, scored by the music sensation S Thaman and choreographed by Sekhar master, will be out on May 7th. The makers made the announcement through this poster that surely makes fans go gaga over it. Going by the poster, the makers tried to make it…

నాని ‘అంటే.. సుందరానికీ’ సెకండ్ సింగిల్ ‘ఎంత చిత్రం’ మే 9న విడుదల

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Second Single Entha Chithram Releasing On May 9th

నేచురల్ స్టార్ నాని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ’ ఫస్ట్ సింగిల్ పంచెకట్టు పాటకు అన్ని వర్గాలా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండవ సింగిల్ ”ఎంత చిత్రం” పాటని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మే 9న విడుదలయ్యే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని సర్ ప్రైజ్ చేయబోతుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్లో నాని, నజ్రియా నజీమ్లా కెమిస్ట్రీ లవ్లీగా వుంది. నాని నిద్రపోతున్నట్లు నటిస్తూ నజ్రియాపై తల ఉంచడానికి ప్రయత్నిస్తుండగా.. నజ్రియా ప్రేమగా నానిని చెంపపై చేయివేసి ఆపడం బ్యూటీఫుల్ గా వుంది. సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ ప్లజంట్ గా…

జూలై 1న వస్తున్న రానా, సాయి పల్లవిల ‘విరాట పర్వం’

Rana, Sai Pallavi, Venu Udugula’s Virata Parvam Releasing Worldwide In Theatres On July 1st

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికంరగా వుంది. అడవిలో రానా గన్ గురి పెట్టుకొని దూకుడుగా నడుస్తుండగా సాయి పల్లవి రానా చేయి పట్టుకొని పరుగు తీయడం ఒక వార్ మూమెంట్ ని తలపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్కి అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచనుంది. 1990లలో జరిగిన యదార్థ…

రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి ‘మేజర్’ థియేట్రికల్ ట్రైలర్ చూపించిన చిత్ర యూనిట్

'MAJOR' team shows Theatrical Trailer to Defence Minister Rajnath Singh in Delhi

ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అడివి శేష్ ‘మేజర్’ సినిమా ముందు వరసులో వుంది. 26/11 హీరో ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మేకర్స్, భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హీరో అడివి శేష్, దర్శకుడు – శశి కిరణ్ తిక్కా ఆదివారం మే 1వ తేదీన ఢిల్లీలో రక్షణ మంత్రితో భేటి అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ను ప్రదర్శించి, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ గురించి మాట్లాడారు. ఇదే సందర్భంలో రాజ్నాథ్ సింగ్ మేజర్ సినిమా నినాదాన్ని ఆవిష్కరించారు. తెల్లటి కాన్వాస్ పై ‘జాన్ దూంగా దేశ్ నహీ’ అనే ఫోటో ఫ్రేంని రివీల్ చేశారు. ఈ నినాదం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్…