టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ’దేవర’ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కీలక తీర్పును వెలువరించింది. ఈ సినిమా టికెట్ల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. 14 రోజుల వరకు ఉన్న అనుమతిని 10రోజులకే పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. టికెట్ ధరల పెంపుదల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ ను విచారించిన కోర్టు పిటీషనర్ వాదనతో ఏకీభవించింది. ఈ సినిమా కోసం టికెట్ల ధరల పెంచాలని ‘దేవర’ మూవీ టీమ్ ప్రభుత్వాన్ని కోరగా.. దీనికి అనుమతినిస్తూ.. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు అలాగే సింగిల్…
Category: FILM NEWS
ఓటిటిలోకి వచ్చేసిన ‘భలే ఉన్నాడే’
ఇటీవల ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరా సామి’ అంటూ వరుస చిత్రాలతో పలకరించిన రాజ్ తరుణ్ తాజాగా నటించిన ‘భలే ఉన్నాడే’ సినిమా పక్షం రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘గీత సుబ్రహ్మణ్యం’ సిరీస్‌తో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు శివ సాయి వర్ధన్ ఈ మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. మనీషా కందుకూర్ హీరోయిన్‌గా నటించగా అభిరామి, హైపర్ ఆది, సింగీతం శ్రీనివాసరావు, లీలా శాంసన్, గోపరాజు రమణ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే.. రాధ (రాజ్‌తరుణ్) వైజాగ్‌లోని ఓ మధ్యతరగతి కుర్రాడు.శారీ డ్రేపర్ (ఫంక్షన్‌లో అమ్మాయిలకు చీర కట్టే వృత్తి) పని చేస్తుంటాడు. తల్లి గౌరి( అభిరామి) బ్యాంక్ ఉద్యోగి. కృష్ణ (మనీషా కంద్కూరు) మోడ్రన్ గర్ల్. ప్రేమ,…
డైరెక్టర్‌కు అస్వస్థత… రకుల్ హిందీ షూటింగ్ రద్దు!
‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్. హీరోయిన్‌గా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి బ్రేక్ అందుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగిన ఈ భామ తెలుగు సినిమాలో కనిపించక చాలా కాలమే అవుతుంది. ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులపైనే ఫోకస్ పెట్టింది. ఈ భామ అజయ్ దేవ్‌గన్, టబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘దే దే ప్యార్ దే 2’లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా పాటియాలో జరుగుతుంది. అయితే అనుకోకుండా సినిమా షూటింగ్ రద్దయినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. తాజా టాక్ ప్రకారం మూడీ డైరెక్టర్ అన్షుల్ శర్మ అస్వస్థతకు లోనవడంతో రెండు…
సుదర్శన్ థియేటర్ వద్ద హంగామా..పటాకులు పేల్చడంతో ‘దేవర’ కటౌట్ దగ్ధం!
భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దేవర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో గత రాత్రి ఒంటి గంటకు ప్రీమియర్ షోలు ప్రారంభమైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమా విడుదలైనప్పుడల్లా అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తుంటారు. కానీ వారి మితివిూరిన ఉత్సాహం కొన్నిసార్లు థియేటర్లలో ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద చోటుచేసుకుంది. ‘దేవర’ విడుదల సందర్భంగా థియేటర్ ఆవరణలో అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, ఎన్టీఆర్ కటౌట్‌కు మంటలు అంటుకుని దగ్ధం కావడంతో పాటు కొద్దిసేపటికే మంటలు చుట్టూ భారీగా చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కటౌట్‌పై…
‘దేవర’ : సముద్రతీరం నేపథ్యం…ఆధిపత్యం పోరాటం!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్‌హిట్ సినిమా వచ్చింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘దేవర’. సక్సెస్ కాంబో కావడం, ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కథలోకి వెళితే..ఎర్ర సముద్రం తీరంలో గల రత్నగిరి ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. బ్రిటీష్ కాలం నాటి చరిత్ర ఆ ఊరికి ఉంటుంది. ఆ ప్రాంత వాసులు తమ జీవనం సాగించడం కోసం మురుగ (మురళీ శర్మ) కోసం సముద్రం మార్గంలో అక్రమంగా రవాణా జరిగే సరుకును కోస్ట్‌గార్డ్‌లకు చిక్కకుండా మురుగకు అందజేయడం వారి పని. అలా వచ్చిన మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తారు. ఆ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామంలో నివశించే దేవర భయానికే భయం…
‘దేవర’గా ఎన్టీఆర్ ఇరగదీశారు.. సినిమానుఆదరిస్తోన్న అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు : నందమూరి కళ్యాణ్ రామ్
మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో… చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘‘ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మూడేళ్ల కష్టమే దేవర సినిమా. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ…
NTR cast as ‘Devara’.. Thanks to the fans and audience who are loving the movie so much: Nandamuri Kalyan Ram
‘Devara’ is a big budget film starring Man of Masses in the title role. Directed by Koratala Siva. Another Bollywood star Saif Ali Khan played a pivotal role in this movie starring Jhanvi Kapoor as the heroine. Presented by Nandamuri Kalyan Ram and produced by Mikkilineni Sudhakar, Harikrishna.K under the banners of NTR Arts and Yuva Sudha Arts, the film had a worldwide grand release on September 27. On this occasion, the film unit organized success celebrations. In this program… Film director Koratala Siva said, “Thanks to the Telugu audience…
Devara Movie Review in Telugu : ‘దేవర` మూవీ రివ్యూ: ఫ్యాన్స్ కు పండగే!
By M D ABDUL/Tollwoodtimes (చిత్రం : దేవర, విడుదల : 27 సెప్టెంబర్ 2024, రేటింగ్ :3.5, నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, శ్రీకాంత్, అజయ్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ తదితరులు. దర్శకత్వం: కొరటాల శివ, నిర్మాతలు: నందమూరి కల్యాణ్ రామ్ సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ : రత్నవేలు, ఎడిటర్: శ్రీకర ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్) జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘దేవర`. ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో విజువల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.…
‘ఎమర్జెన్సీ’కి లైన్ క్లీయర్!
కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యేలా కనిపిస్తోంది. చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డ్ బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 6న విడుదలకావాల్సి ఉంది. 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. అయితే ఈ సినిమాలో సిక్కుల మనోభావాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ విడుదలకు అనుమతిని నిరాకరించింది. దీంతో కంగన టీమ్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో సెప్టెంబర్ 25లోగా ఒక నిర్ణయానికి రావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను ఆదేశించింది. ఈ…
‘సత్యంసుదందరం’ విజయాన్ని అందుకోవాలి… చిత్రం విడుదల సందర్భంగా సాయిదుర్గా తేజ్ పోస్ట్
కార్తి, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెయ్యజగన్’ . ఈ సినిమా విడుదలను ఉద్దేశించి తాజాగా సాయిదుర్గా తేజ్ కార్తి , అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెయ్యజగన్’ . ’సత్యం సుందరం’ పేరుతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా సాయిదుర్గా తేజ్ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా ఘన విజయాన్ని అందు కోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన చిత్రం ‘సత్యం సుందరం’ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. మనసుని హత్తుకునే చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు ప్రేమ్ కుమార్, కార్తి అన్న కాంబినేషన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అరవిందస్వామి, సూర్య, జ్యోతికతోపాటు చిత్రబృందం మొత్తం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. దీనిపై కార్తి…
