హైదరాబాద్: హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ , గడ్డి అన్నారం , అస్మాంగడ్ ప్రాంతంలోని వి.కే. ధాగే నగర్ మెయిన్ రోడ్‌లో కాదంబరి హోమియోపతి క్లినిక్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సినీ ,టీవి నటులు , స్థానిక ప్రముఖులు, వైద్యులు, క్లినిక్ సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయిశ్రీ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో కాదంబరి హోమియోపతి క్లినిక్‌ను ప్రారంభించామని తెలిపారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అమ్మలాంటి వైద్యం హోమియోపతి అని తెలిపారు. నేటి తరానికి మేటి వైద్యం హోమియోపతి అని, తాను వైద్య ప్రముఖల దగ్గర నేర్చుకున్న విద్యని అస్మాంగడ్ ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకు రావడం ఆనందంగా ఉందన్నారు. గడ్డి అన్నారం ప్రాంత కాలనీల నాయకులు వచ్చి విషెస్ అందించడం సంతోషంగా…
Category: Lifestyle
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) తొలి జాతీయ సదస్సుకు ఆహ్వానం
“మన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) తొలి జాతీయ సదస్సుకు మీ అందరికీ ఆహ్వానం పలకడం ఎంతో ఆనందంగా ఉంది—మన సాంస్కృతిక సంప్రదాయాలను, వారసత్వాన్ని ఘనంగా జరుపుకునే ఈ వేడుకలో మీరు అందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. ఈ ఏడాది సదస్సు మరుపురాని సాంస్కృతిక కార్యక్రమాలతో అద్భుతంగా ఉండబోతోంది. సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, వీనుల విందైన సంగీత ప్రదర్శనలు, ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులచే అబ్బురపరిచే సంగీత కచేరీలు అలరించబోతున్నాయి. మన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ తెలుగు చిత్ర నటుడు హాజరై ఈ ప్రత్యేక సందర్భాన్ని మనతో కలిసి పండగలా జరుపుకోబోతున్నారు. మన సంస్కృతికి ప్రతిరూపం రంగవల్లులు. తెలుగు లోగిళ్ళలో పండగ కళ తీసుకొచ్చే ‘ముగ్గుల పోటీ’ని ప్రపంచవ్యాప్త పోటిగా నిర్వహిస్తున్నాం. అలాగే షార్ట్ వీడియోలని ఆకట్టుకునేలా రూపొంచేవారి కోసం ‘రీల్స్ పోటీ’ కూడా ఉంది.…
బెంగళూరులో హీరో శ్రీకాంత్ లాంచ్ చేసిన ” ఏఈఐఓయు రెస్ట్రో పబ్”
ప్రముఖ స్టార్ హీరో శ్రీకాంత్ రీసెంట్ గా బెంగళూరులోని ‘ మాన్యత టెక్ పార్క్’ ఆపోజిట్లో ఏ ఈ ఐ ఓ యు రెస్ట్రో పబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రాజు, మహేష్ రాజు, మధు, తదితరులు పాల్గొన్నారు.
Hero Srikanth launched restro pub
In Bengaluru, the prominent star hero Srikanth recently launched the “AEIOU Restro Pub” opposite Manyata Tech Park. The event was attended by Venkat Raju, Mahesh Raju, Madhu, and others.
Shrewsbury International School India advocates a holistic and whole-person model of education
Felicitates Paris 2024 Paralympic silver medallist Yogesh Kathuniya at a glittering event in Delhi Shrewsbury International School India, an iconic co-educational boarding British school, organised a grand event in New Delhi, to discuss and share about Holistic education in India and also to announce the commencement of its first academic session in August 2025. An inspiring fireside chat with Paris 2024 Paralympic silver medallist Yogesh Kathuniya was the central piece of this event which brought to the fore how the whole-person model of education is the cornerstone of British education…
కనుల పండువగా బి.ఎస్. రాములు అమృతోత్సవం
25 ఏళ్ల తెలంగాణ సాహిత్యంపై విశేష చర్చ 25 కొత్త పుస్తకాలు ఆవిష్కరణ హైదరాబాద్ : సామాజిక న్యాయమే రచయిత బి. ఎస్. రాములు లక్ష్యం అని, తన రచనలతో ఉపన్యాసాలతో జీవన నైపుణ్య కార్యశాలలు నిర్వహించిన తాత్వికవేత్త అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ముఖ్య కార్యదర్శి, కవి డా. ఎ. విద్యాసాగర్ అభినందించారు. జన చైతన్య మార్గాన్వేషకుడు బి. ఎస్. రాములు గొప్ప సృజనశీలి అని కవితాత్మకంగా ఆయన కొనియాడారు. శుక్రవారం రవీంద్రభారతిలో విశాల సాహిత్య అకాడమీ, సామాజిక తాత్విక విశ్వ విద్యాలయం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రచయిత, తెలంగాణ బిసి కమిషన్ తొలి చైర్మన్ బి. ఎస్. రాములు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అమృతోత్సవ వేడుకల సందర్భంగా పాతికేళ్ల తెలంగాణ సాహిత్యంపై సదస్సు…
ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్. వేణుగోపాల నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత రావు, సంయుక్త కార్యదర్శులు రమేష్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి ఎ. రాజేష్, కార్యవర్గ సభ్యులు వసంత్, బాపు రావు, ఎం. రమాదేవి, టి. శ్రీనివాస్ తో పాటు ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యులు హాజరయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని అధ్యక్షులు వేణుగోపాల నాయుడు సూచించారు. ఆనాటి పోరాట యోధుల త్యాగ ఫలితంతో మనం స్వేఛ్చను అనుభవిస్తున్నామని అన్నారు. నేటి తరానికి వారి త్యాగాలను వివరించాలన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో అందరూ భాగస్వామ్యులు కావాలని వేణుగోపాల నాయుడు కోరారు.
ఘనంగా ఆర్ ఎల్ టూర్స్ & ట్రావెల్స్ 2వ వార్షికోత్సవ వేడుకలు సందడి చేసిన సినీ ప్రముఖులు…
హైదరాబాద్: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రావెల్ ఏజెన్సీలలో ఒకటిగా హైదరాబాద్‌కు చెందిన ఆర్ ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకుసాగుతుంది. ఈ రోజు హైదరాబాద్‌లో ఆర్ ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తన 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఎయిర్ టికెటింగ్, గ్రూప్ ప్యాకేజీలు, వీసాలు, ఫారెక్స్, ప్రయాణ బీమా తదితర అన్ని సేవలను ఒకే గొడుగు కింద ఈ సంస్థ అందిస్తుంది. మాక్సివిజన్, క్లౌడ్‌టారో, గ్నాపికా ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్. జి మూవీ మేకర్స్ తదితర ప్రతిష్టాత్మక కార్పొరేట్ సంస్థలన్నింటికి ఈ సంస్థనే సేవలందిస్తుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS), (NATA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మరియు మరెన్నో సహా అనేక లాభాపేక్ష లేని సంస్థలలో భాగంగా వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో…
ప్రెస్ క్లబ్ కు శాశ్వత భవనాన్ని నిర్మిస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ
హైదరాబాద్: ప్రెస్ క్లబ్ హైదరాబాద్ కు అన్ని హంగులతో అద్భుత భవనాన్ని నిర్మించి ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సోమవారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డిమాట్లాడుతూ నూతన భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వానికి జర్నలిస్టులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తాము ఈ ఏడాది చివరి నాటికే కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రూ.20 కోట్లు ఖర్చు అయినా సరే పాత్రికేయుల కోసం అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల పక్షాన పని చేసే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో మహిళల సౌకర్యం కోసం…
సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమం లో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం ….
హైదరాబాద్: ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 31వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1500 పాఠశాలల నుండి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 31వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 16 మంది ర్యాంకేర్స్ కి మరియు 396 డిస్ట్రిక్ ర్యాంకేర్స్ కి, 8 మంది కి ఛత్రలయా పురస్కార్ అవార్డ్స్, 8 మందికి గురు బ్రహ్మ అవార్డ్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చిన యువ టాలెంట్ విద్యార్థులకు శ్రీ సత్యసాయి నిగమాగమం లో అవార్డులు ప్రదానం చేయనున్నారు అని సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ తెలిపారు.…
