సీనియర్ నటులు, నిర్మాత మురళీ మోహన్ చేతుల మీదుగా మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్ అండ్ గ్రోసరీ స్టోర్ ప్రారంభం

Senior actor and producer Murali Mohan launches exotic fruit, vegetable and grocery store in Manikonda Alkapuri Township
Senior actor and producer Murali Mohan launches exotic fruit, vegetable and grocery store in Manikonda Alkapuri Township
Spread the love

మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ప్రారంభించారు సీనియర్ నటులు, నిర్మాత, రాజకీయ నాయకులు మురళీ మోహన్. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్స్ గా ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్ లో ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ తో పాటు అన్ని గ్రోసరీ వస్తువులు సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా…
మురళీ మోహన్ మాట్లాడుతూ – ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ఓపెనింగ్ నా చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉంది. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ నా దగ్గరకు వచ్చి స్టోరీ డీటెయిల్స్ చెప్పినప్పుడు ఎంతో బాగుంది అనిపించింది. కొందరు పేరుకే ఆర్గానిక్ అని మామూలు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. అలా కాకుండా వీళ్లు రైతుల దగ్గర నుంచి నేరుగా కొని అంతే ఫ్రెష్ గా కస్టమర్స్ కు రీజనబుల్ ప్రైసెస్ లో అందిస్తున్నారు. అవన్నీ చూశాను చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఈ రోజు మన బిజీ లైఫ్ లో అన్నీ ఒకే దగ్గర కొనుక్కునేలా గ్రోసరీ ఐటెమ్స్ కూడా పెట్టారు. కాలనీలోని వారిని మెంబర్స్ గా చేర్చుకోవాలని అనుకుంటున్నారు. అలాగే ఎగ్జోటిక్ ను బ్రాంచీలుగా అన్ని ఏరియాల్లో పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జోటిక్ స్టోర్ ఒక మంచి బ్రాండ్ గా పేరు తెచ్చుకోవాలని, ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఎగ్జోటిక్ స్టోర్ ఎండీ ఎన్ఎన్ కిషోర్ మాట్లాడుతూ – మా ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ప్రారంభించిన మురళీ మోహన్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. రైతుల నుంచి నేరుగా ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కొని కస్టమర్స్ కు రీజనబుల్ రేట్స్ లో ఇస్తున్నాం. నిల్వ చేయకుండా ఏ రోజుకు కావాల్సినన్ని ఆ రోజే తీసుకొస్తున్నాం. దాని వల్ల అన్నీ ఇక్కడ ఫ్రెష్ గా దొరుకుతాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్, గ్రోసరీ వస్తువులతో పాటు ఎక్కువగా దొరకని యాష్ గార్డ్ జ్యూస్, ఆకు కూరల జ్యూస్ లు అందుబాటులో ఉంచాం. ఒక ఫ్రాంఛైజీలా మా స్టోర్ ను దేశవ్యాప్తంగా, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
ఎగ్జోటిక్ స్టోర్ ఎండీ వినోద్ కుమార్ మాట్లాడుతూ – కస్టమర్స్ కు ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బెస్ట్ ప్రైస్ లో ఇవ్వాలనేదే మా ఎగ్జోటిక్ స్టోర్ లక్ష్యం. కొన్ని నెలల్లోనే మీరు ఇతర ఆర్గానిక్ స్టోర్స్ కు మా ఎగ్జోటిక్ స్టోర్ కు తేడా చూస్తారు. ఈ రోజు మా ఎగ్జోటిక్ స్టోర్ ఒపెనింగ్ కు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన మురళీ మోహన్ గారికి థ్యాంక్స్. ఒక ఫ్రాంఛైలీగా మా స్టోర్ ను అన్ని ప్రాంతాల్లో విస్తరించబోతున్నాం. అన్నారు.