బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై, ప్రొడక్షన్ నెంబర్-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో డైరక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా `సౌండ్ పార్టీ` టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ…“నేను కూడా గతంలో కొన్ని చిత్రాలకు సమర్పకుడుగా వ్యవహరించాను. అదే బాటలో జయశంకర్ ఈ చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ ట్రెడిషన్ ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా.…
Category: Entertainment
‘ప్రేమ్ కుమార్’ సినిమా హీరో సంతోష్ శోభన్ ఇంటర్వ్యూ….
సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మించారు. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు.. ‘ప్రేమ్ కుమార్’ కథేంటి? – చాలా కాలం, చాలా తెలుగు సినిమాల్లో కళ్యాణ మండపం మీద క్లైమాక్స్ ఉండే సినిమాలు కొన్ని ఉన్నాయి. అక్కడకు హీరో వచ్చి హీరోయిన్‌కి, ఆమె ఫాదర్‌కి కలిపి ఏవో నాలుగు నీతులు చెప్పి హీరోయిన్‌తో వెళ్లిపోతాడు. కానీ.. అక్కడొకడు మిగిలిపోతాడు. వాడు పరిస్థితేంటో తెలీదు.. ఎంత మందికి కార్డులిచ్చాడో.. ఎన్ని…
‘Prem Kumar’ Is Based On A Point Never Seen Before In Telugu Cinema – Hero Santosh Soban
Santosh Soban starrer’s latest film ‘Prem Kumar’ costarring Raasi Singh and Ruvhitha Sadineni is all set to hit the screens. Shiva Prasad Panneeru produced this film under the Sharanga Entertainment Pvt Ltd banner. Writer Abhishek Maharshi is making his debut as a director. The film which is blended with love and entertaining elements is releasing in theaters on 18th August. On this occasion, Hero Santosh Soban interacted with the media. Here is the transcript of his media interaction with ‘Prem Kumar’… What is the story of ‘Prem Kumar’? – For…
వరుస సినిమాలతో బిజీ బిజీగా మమ్ముట్టి!
పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒకరు. ఈ ఏడాది తెలుగులో ‘ఏజెంట్’ సినిమాలో కీలక పాత్రలో మెరిశాడు మమ్ముట్టి. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మమ్ముట్టి ఇప్పటికే గేమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బజూక’లో నటిస్తున్నాడని తెలిసిందే. డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో కొత్త సినిమా అప్‌డేట్ అందించి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ సారి హార్రర్ థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేస్తున్నాడు. ‘భ్రమయుగం’ టైటిల్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ షురూ అయింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసి లుక్‌లో డార్క్ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా..…
సూపర్ స్టార్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ‘జైలర్’
కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా లాస్ట్ ఇయర్ వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి మాత్రమే కాదు కోలీవుడ్ లో వచ్చిన క్లాసిక్ సినిమాల్లో కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ కనగరాజ్ బ్రిలియంట్ డైరెక్షన్ ఏంటి అన్నది ‘విక్రమ్’తో చూపించాడు. సరైన హిట్ పడితే కమల్ హాసన్ బాక్సాఫీస్ రేంజ్ ఏంటన్నది ‘విక్రమ్’ చూపించింది. అయితే తాజాగా వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ కూడా వసూళ్లతో అదరగొట్టేస్తుంది. రజనీకాంత్‌కు కూడా జైలర్’ ఒక సూపర్ కమ్ బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అయితే కమర్షియల్ గా విక్రమ్ కలెక్షన్స్ ని జైలర్ దాటేసిందని తెలుస్తున్నా ‘విక్రమ్’ తో పోలిస్తే ‘జైలర్’ చాలా వెనుక ఉంటుందని చెప్పొచ్చు. ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా తన మార్క్ డైరెక్షన్ తో సూపర్…
‘చంద్రముఖి 2’కి కీరవాణి సంగీతం!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది మంది సంగీత దర్శకులలో కీరవాణి మాత్రమే నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. తెలుగు సంగీత సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సినిమాలతో దేశ వ్యాప్తంగానే కాకుండా .. ప్రపంచ వ్యాప్తంగాను మంచి క్రేజ్ అందుకున్నారు. ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి తెలుగు జాతి గర్వపడేలా చేశారు. ఎలాంటి పాటనైనా సరే తనదైన శైలిలో కంపోజ్ చేసి ఆకట్టుకునే కీరవాణి మళ్లీ చాలా బిజీగా మారిపోయారు. ప్రస్తుతం కీరవాణి ‘చంద్రముఖి 2’ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ గా తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో కూడా మ్యూజిక్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. ఇప్పటికే…
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు జెండాను ఎగురవేశారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సందీప్ ప్రకాష్ ఐ.ఆర్.ఎస్. చీఫ్ కమిషనర్, హీరో శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో మొదటగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ ఫౌండర్ మెంబర్స్ ను స్మరించుకున్నారు. ముఖ్య అతిధి సందీప్ ప్రకాష్ , ఫౌండర్ కమిటీ మెంబర్ సినీ నటుడు మాగంటి మురళీమోహన్, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కె.ఎస్. రామారావు, డా. కె.ఎల్. నారాయణ, పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడారు. అనంతరం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ దత్తత తీసుకున్న గవర్నమెంట్…
అమరవీర సైనికులకు నివాళే ‘సోల్ ఆఫ్ సత్య’ : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నవీన్ విజయకృష్ణ దర్శకత్వంలో రూపొందిన షార్ట్ ఫీచర్ ‘సత్య’. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత దీన్ని నిర్మించారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ షార్ట్ ఫీచర్ నుంచి సోల్ ఆఫ్ సత్య అనే మ్యూజికల్ షార్ట్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈసందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో… మ్యూజిక్ డైరెక్టర్ శ్రుతి రంజని మాట్లాడుతూ ‘‘సంతోషంలో మాటలు రావటం లేదు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకుంటున్నారని తెలిసి నేను డెమో పంపితే ఈ సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. నవీన్‌గారు ఓ సైనికుడి కథను దీనికి స్క్రిప్ట్‌గా అందంగా మలిచారు. తేజ్, స్వాతి సహా ఎంటైర్ టీమ్‌కి థాంక్స్’’ అన్నారు. దర్శకుడు నవీన్…
‘భగవంత్ కేసరి’పై అప్పుడే దుమారం..హరికృష్ణ ‘స్వామి’కి కాపీ అంటూ విమర్శలు
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ’భగవంత్ కేసరి’ సినిమా అక్టోబర్ 19న విడుదలకు సిద్ధం అవుతోన్న వేళ విమర్శల దాడి జరుగుతోంది. ‘భగవంత్ కేసరి’ నందమూరి హరికృష్ణ నటించిన ’స్వామి’ సినిమాకి అనధికార రీమేక్ అని పుకార్లు వచ్చాయి. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు కాగా, ఇందులో శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అయితే శ్రీలీల, బాలకృష్ణకి కూతురుగా వేస్తోంది, అలాగే బాలకృష్ణ ఇందులో ఒక మధ్యవయస్కుడిగా కనిపించనున్నాడు. అతని పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. ఇప్పుడు సాంఫీుక మాధ్యమంలో ఈ సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది, ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాతలు ఖండించారు. ఇది రీమేక్ కాదు అని చెప్పారు. ఈ సినిమాకి సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు, అతని షూటింగ్ కూడా అయిపోయింది…
వసూళ్లలో ‘జైలర్’ దూకుడు.. సునీల్ కామెడీపై ప్రేక్షకుల అసహనం!
డ్రగ్స్, స్మగ్లింగ్, పిల్లల అక్రమ రవాణ, టెర్రరిజం.. వంటి సీరియస్ కథలకు డార్క్ కామెడీ జోడించి భిన్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. కెరీర్ ఆరంభంలోనే స్టార్ యాక్టర్స్ తో సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా సూపర్ స్టార్ జైలర్ చిత్రంతో భారీ గ్రాండ్ హిట్ ను అందుకున్నారు. ఈ చిత్రం కోలీవుడ్ తో పాడు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ముందు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులోనూ చిరు ‘భోళాశంకర్’ డిజాస్టర్ అవ్వడం వల్ల మరిన్ని వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రంలో టాప్ కమెడియన్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సునీల్ ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసింది. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు ఓ వర్గం తెలుగు ఆడియెన్స్ కు నచ్చలేదని తెలుస్తోంది. దర్శకుడు నెల్సన్ కుమార్ పై కాస్త ఆగ్రహానికి…
