నానికి బన్నీ ప్రశంశలు!

Bunny praises me!
Spread the love

నాని హీరోగా నటించిన ‘హాయ్‌ నాన్న’ చిత్రంపై అల్లు అర్జున్‌ ప్రశంసలవర్షం కురిపించారు. మధురమైన చిత్రమని, మనసుకు హత్తుకుందని ఆయన కొనియాడారు. నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా శౌర్యువ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఆయన వీక్షించారు. ఈ మేరకు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ‘సోదరుడు నాని నటన అద్భుతం. ఆకర్షణీయమైన స్క్రిప్ట్ను వెలుగులోకి తెచ్చినందుకు టీమ్‌ విూద మరింత రెస్పెక్ట్‌ పెరిగింది. మృణాల్‌ నటన మనసుకు హత్తుకుంది. ఆ పాత్ర ఆమెకు లాగే బ్యూటిఫుల్‌గా ఉంది. మై డార్లింగ్ బేబీ కియారా.. నీ క్యూట్‌నెస్‌తో మనసుల్ని కరిగించేశావు. ఇక చాలు స్కూల్‌కి వెళ్లిపో. మిగిలిన ఆర్టిస్ట్‌లు కూడా ఎక్కడా పేరు పెట్టడానికి లేకుండా తమ ప్రతిభను చూపించారు. సాంకేతిక నిపుణుల అద్భుతమైన పని తెరపై కనిపిస్తోంది. ముఖ్యంగా కెమెరామెన్ సాను జాన వర్గీస్‌, సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ గొప్ప టెక్నీషియన్స్ అని నిరూపించుకున్నారు. ఇక దర్శకుడు శౌర్యువ్‌ తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఎన్నో హృదయాలను హత్తుకునేలా, కంట తడి పెట్టేలా సన్నివేశాలను క్రియేట్‌ చేశారు. సీన్స్‌ ప్రజంటేషన్‌ చాలా బావుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా మెచూర్డ్‌గా చిత్రీకరించారు, అద్భుతమైన స్క్రిప్ట్ను నిర్మాతలకు అభినందనలు. ‘హాయ్‌ నాన్న’ చిత్రం తండ్రులనే కాకుండా ప్రతి కుటుంబ సభ్యుడి హృదయాన్ని హత్తుకుంటుంది‘ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. బన్నీ చేసిన ట్వీట్‌కు నాని స్పందించారు. ‘అర్హా తండ్రి ఆమోదించారు. మంచి సినిమా కోసం విూరు ఎప్పుడూ నిలబడతారు. థ్యాంక్యూ సో మచ్‌ బన్నీ’ అని ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు నాని.

Related posts

Leave a Comment