మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘గాసిప్’. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన సిప్పు సిప్పు సాంగ్ ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఈ సినిమా నుంచి సిప్పు సిప్పు ఫుల్ లిరికల్ సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ ఎనర్జెటిక్ పబ్ డాన్స్ ట్రాక్‌కు కాసర్ల శ్యామ్ అందమైన సాహిత్యాన్ని అందించగా సింగర్ మాళవిక వోకల్స్ తో పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.…
Day: June 18, 2026
వెంకటేష్- కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ ప్రారంభం
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, ‘హిట్ మెషీన్’ అనిల్ రావిపూడి కలిసి ఒక పూర్తి స్థాయి పండుగ వినోదాత్మక చిత్రం అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రం 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర బృందం, పలువురు ప్రముఖ అతిథుల సమక్షంలో ఘనంగా జరిగిన ముహూర్తం, పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటికి అధికారికంగా అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ముహూర్తం సందర్భంగా, విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలపై చిత్రీకరించిన…
