‘మారెమ్మ’ నుంచి బ్యూటీఫుల్ రూరల్ మెలోడీ ‘బావ బావ’ సాంగ్ రిలీజ్

Beautiful rural melody 'Bava Bava' song released from 'Maremma'

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ ఈ రోజు మారెమ్మ ఫస్ట్ సింగిల్ ‘బావ బావ’ సాంగ్ ని రిలీజ్ చేశారు. ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన ఈ పాటలో పల్లెటూరి మట్టి వాసనతో పాటు మోడరన్ మ్యూజిక్ లేయర్స్ మిళితమై ఎంతో మధురమైన అనుభూతిని కలిగిస్తోంది ప్లజెంట్ ఫీల్‌ను అందించేలా ఈ పాట సాగే తీరు ఆకట్టుకుంటుంది. కమల్ ఎస్లవత్ లిరిక్స్ బావపై ఉన్న ఆప్యాయతను ఎంతో సింపుల్‌గా, హృదయానికి దగ్గరగా వ్యక్తపరుస్తాయి.…

ఆశా భోస్లే : ఆ మధురం మనల్నివెంటాడుతూనే ఉంటుంది…!

Asha Bhosle: That sweetness will continue to haunt us...!

* ఆశా అంత్యక్రియల్లో పాల్గొన్న సినీ ప్రముఖులు * అశ్రునయనాలతో అభిమానుల వీడ్కోలు భారతీయ సంగీత ప్రపంచంలో ఓ మహత్తర యుగానికి ముగింపు పలికింది. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూయడం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరపురాని మధురగాయని ఆశా భోస్లేకు అశ్రునయనాలతో అభిమానులు వీడ్కోలు పలికారు. ఆశా మధురగానాన్ని మననం చేసుకుంటూ ఆమె అంత్యక్రియల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఆమె గళ విన్యాసాలకు అభిమానులు కాని వారుండరు. ఒక్కసారి ఆమె గాత్రంతో స్నేహం చేస్తే చాలు ఆ మధురం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె లెజండరీ గాయని ఆశా భోస్లే. ఆశా గళం నుండి జాలువారిన సినిమా గీతాలు, గజల్స్, భజన్స్, పాప్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, శాస్త్రీయ సంగీతం- అన్నీ భారతీయ…