మెగాస్టార్ `విశ్వంభ‌ర‌`పై మౌనమేల!?

Why the silence on Megastar 'Vishvambhara'?

మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ మీదున్నారు. ఇటీవల సంక్రాంతికి `మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్‌గారు`తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని త‌న ఖాతాలో వేసుకున్న చిరు అదే జోష్‌తో మ‌రో సినిమాని రంగంలోకి దించేస్తాడ‌ని.. అదే ఊపుతో మ‌రో చిత్రానికి శ్రీ‌కారం చుట్టేస్తాడ‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాద‌ని జ‌రుగుతున్న ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. ‘మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్‌గారు’కు ముందు చిరు మొద‌లు పెట్టిన భారీ గ్రాఫిక‌ల్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ‘విశ్వంభ‌ర‌’. మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌కుడు. సినిమా పూర్త‌యింది. యువీ క్రియేష‌న్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌లై దాదాపు ఏడాది పూర్తయింది. అయినా స‌రే ఇప్ప‌టికీ దీని రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. టీమ్ నుంచి ప్ర‌క‌ట‌నా లేదు. గ్రాఫిక్స్ ఆశించిన స్థాయి క్వాలిటీగా లేవ‌ని గ్లింప్స్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో సినిమా…