నటుడిగా స్వర్ణ ఉత్సవం జరుపుకుంటున్న డైలాగ్ కింగ్ సాయి కుమార్ ‘అగ్ని’ సాయి కుమార్ కి 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారానికీ ఎంపికచేసినట్లు సెలక్షన్ చైర్మన్ సి.పార్ధ సారధి IAS, కో-చైర్మన్ నాగబాల డి.సురేష్ కుమార్, కన్వీనర్ కొమరం సోనే రావు, శిడాం అర్జు మాస్టారు, అధికారిక ప్రకటనలో తెలియచేసారు. గత 12 సంవత్సరాలుగా ‘భారత కల్చరల్ అకాడమి, ఓం సాయి తేజ ఆర్ట్స్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్’ సంయుక్త నిర్వహణలో ఈ అవార్డ్ ను అందిస్తున్నామని, గతంలో ఈ కొమరం భీమ్ అవార్డును సుద్దాల అశోక్ తేజ, అల్లాణి శ్రీధర్, లెజెండరీ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్, గూడ అంజయ్య వంటి దిగ్గజాలకు ఈ పురస్కారం తో సన్మానించమని, అవార్డు తో పాటు జ్ఞాపిక ను, యాబై ఒక వెయ్యి రూపాయల నగదు అందిస్తామని,…