సూపర్ స్టార్ కృష్ణ చిత్ర సమాహారం!

Superstar krishna special story

సం. /సినిమా పేరు /తోటి నటీనటులు /దర్శకులు/ విడుదల తేదీ : 1 తేనె మనసులు సుకన్య ఆదుర్తి సుబ్బారావు 31.03.65 2 కన్నె మనసులు ఆదుర్తి సుబ్బారావు 22.07.65 3 గూఢచారి 116 జయలలిత కె.ఎస్.ఆర్. దాస్ 11.08.66 4 ఇద్దరు మొనగాళ్లు సంధ్యారాణి బి. విఠలాచార్య 03.03.67 5 సాక్షి విజయనిర్మల బాపు 01.01.67 6 మరపురాని కథ వాణిశ్రీ వి. రామచంద్రరావు 27.07.67 7 స్త్రీ జన్మ విజయలక్ష్మి కె.ఎస్. ప్రకాశరావు 31.08.67 8 ఉపాయంలో అపాయం విజయలక్ష్మి టి. కృష్ణ 07.09.67 9 ప్రైవేట్ మాస్టారు సుకన్య కాశీనాథుని విశ్వనాథ్ 14.09.67 10 అవేకళ్ళు కాంచన ఎ.సి. త్రిలోక్ చందర్ 14.12.67 11 అసాధ్యుడు కె.ఆర్. విజయ రామచంద్రారావు 12.01.69 12 నిలువు దోపిడి జయలలిత సి.ఎస్. రావు 25.01.68 13…

superstar Krishna special story : తెలుగు వీర లేవరా…!

తెలుగు వీర లేవరా...!

”సినిమాలంటే నాకు పిచ్చి ప్రేమ. నచ్చి చేసే పనే కదా..? అందుకే విసుగు రాలేదు. పైగా సినిమా సినిమాకీ వాటిపై ప్రేమ పెరిగింది..” – అంటారు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ అంటేనే.. మంచితనానికి, మానవత్వానికి నిలువుటద్ధం. గుంటూరు జిల్లా తెనాలి మండలములోని బుర్రిపాలెంలో 1942 మే 31న ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి – నాగరత్నమ్మలకు పెద్ద కొడుకుగా జన్మించిన ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్ గా మారడానికి చేసిన కృషి అంతా ఇంతా కాదు. నటుడు, దర్శకుడు, నిర్మాత, స్టూడియో అధినేతగా తెలుగు సినీ కళామతల్లికి ఆయన అందించిన సేవలు మరపురానివి. కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. కృష్ణ 1970-80ల్లో తెలుగు సినిమా హీరోగా విశేష ప్రజాదరణ పొంది సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతిగాంచారు. 1964కంటే ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన…

సూపర్ స్టార్ కృష్ణ మృతికి ప్రముఖుల సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ మృతికి ప్రముఖుల సంతాపం

టాలీవుడ్ సూపర్ ‌స్టార్, పద్మభూషణ్ కృష్ణ మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్థరాత్రి కార్డియాక్ అరెస్టు కారణంగా ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. మాటలకు అందని విషాదం ఇది: చిరంజీవి ‘‘మాటలకు అందని విషాదం ఇది.. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే…

సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం : శోకసంద్రంలో టాలీవుడ్

superstar krishna no more

సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుఝామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్దరాత్రి గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ కన్నుమూశారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేవీ పనిచేయలేదు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ఆయన కోలుకోలేదు. వైద్యానికి శరీరం సరిగా స్పందించలేదు. కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉందని నిన్న మధ్యాహ్నం వరకు డాక్టర్లు చెప్పారు. 48 గంటలు గడిస్తే గానీ.. ఏమీ చెప్పలేదని తెలిపారు. కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా పూజలు చేశారు. కానీ వైద్యులు ప్రయత్నాలు గానీ.. అభిమానుల పూజలు గానీ ఫలించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎనభై ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. భార్య ఇందిరా దేవి, పెద్దకుమారుడు రమేష్ బాబు మరణాల తర్వాత కృంగిపోయిన కృష్ణ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన…

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏం చెబుతన్నారంటే… !?

SuperStar Krishna Health news

తెలుగు సినీపరిశ్రమలో ‘నటశేఖర’గా వెలుగొందిన సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు మీడియాకు వివరాలను వెల్లడించారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యంపై కాంటినెంటల్‌ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణకు గుండెపోటు రావడంతో అర్ధరాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కృష్ణకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా, ఆయన ఆరోగ్యం కొద్దిగా నిలకడగా ఉందని చెప్పారు. క్రిటికల్‌ స్టేజ్‌లో అందరూ డాక్టర్‌లు కలిసి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కృష్ణ రాగానే ఎమర్జెన్సీకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు, ప్రస్తుతం కృష్ణ క్రిటికల్‌ స్టేజ్‌లోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ఆయన చాలా రోజులుగా మా దగ్గర చికిత్స తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. ఇదిలా ఉండగా .. సూపర్‌ స్టార్‌ కృష్ణ గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో…

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సింగల్ విడుదల కాబోతుంది!

megastar chiranjeevi valtheru veeraiah

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఈ వారమే విడుదల కాబోతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ సాంగ్ గురించి ట్వీట్ చేశారు. ”ఇప్పుడే ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సాంగ్ ని చూశాను. మెగాస్టార్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సింగల్ ఈ వారమే విదుదలౌతుంది. పార్టీకి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే ఇది బాస్ పార్టీ” అని ట్వీట్ చేశారు. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా…

నవంబర్ 18న ‘బెస్ట్ కపుల్’ వస్తున్నారు!

Best couple 18th Relese

వన్ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పార్థు రెడ్డి నిర్మాతగా జయంత్ వదాలి, శగ్న శ్రీ, చలకి చంటి, ఇమ్మనుయెల్ తదితరులు నటించిన చిత్రం ‘బెస్ట్ కపుల్’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తున్నారు, అదే కోవలో మా ‘బెస్ట్ కపుల్’ సినిమా విజయం సాధిస్తుందని నిర్మాత పార్థు రెడ్డి తెలిపారు. భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు, గొడవలు, ప్రేమాభిమానాలు ఇలా అన్ని ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. అందరికీ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ఈ ‘బెస్ట్ కపుల్’లో ఉన్నాయని దర్శకుడు…

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేసిన ‘మసూద’ ట్రైలర్

masoodha trailer relese by vijay devarakonda

‘మసూద’ ట్రైలర్ అద్భుతంగా ఉందని అన్నారు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వాట్టే గ్రేట్ ట్రైలర్.. అద్భుతంగా ఉంది.. సూపర్బ్‌గా కట్ చేశారు. టీమ్ అందరికీ నా అభినందనలు. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇలాంటి కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న నిర్మాత…

‘సీతారామపురం’’ పేరుతో వచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి: ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’ ప్రీ`రిలీజ్‌ వేడుకలో అతిథుల ఆకాంక్ష

seetharampuramlo oka premajanta

శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ పతాకంపై బీసు చందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఎం. వినయ్‌ బాబు దర్శకత్వంలో రణధీర్‌, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రీ `- రిలీజ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ…‘‘నిర్మాత నాకు బాగా కావాల్సినవాడు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకున్నా తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించే ధైర్యం చేయడం గొప్ప విషయం. హీరో రణధీర్‌కు ఒక మంచి హీరోగా ఎదడానికిగల అన్ని క్వాలిటీస్‌ ఉన్నాయి.…

వైభవంగా ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు : ప్రారంభించిన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/11/School.tif

ఎంతో ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ లోని ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నులపండువగా జరిగాయి. ఈ ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలను రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో శనివారం విద్యార్థినీ విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకలు ప్రతీ ఒక్కరికీ మరపురాని అనుభూతని కలిగించాయి. ఈ సందర్బంగా ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న పలు నూతన సాంకేతికతను ఉపయోగించుకొని విజ్ఞాన విహారంలో తెలియాడాలని, ఈ విషయంలో ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ముందుండాలని కోరారు. మనదేశంలొ విద్యను అభ్యసించిన భారతీయులు ప్రపంచ దేశాల్లో ఉన్నత మైన స్థానాలో వున్నారన్న విషయాన్ని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసారు. బ్రిటన్ ప్రధాని భారతీయులు కావడం…