లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో శ్రీరామ్ దత్తి నిర్మాతగా.. ప్రతాప భీమవరపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. శ్రీరామ్, ప్రతాప్, రాజేంద్ర, వివ రెడ్డి, రారాజు, కునాల్, కుషాల్, గుండు బ్రదర్స్ (రవీంద్రసూరి,భీమ) లక్ష్మీనారాయణ, మిమిక్రీ రాజు, అనురాధ, సురభి శ్రావణి, పునర్వి, మంజుల, రమ్యకృష్ణ, స్వాతి, ప్రమీల, అమృత వర్షిని, సాయి తేజ, సాయి చరణ్ తదితర తారాగణంతో చిత్రంలోని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్బంగా.. షూటింగ్ లొకేషన్ లోకి వచ్చిన మీడియా ప్రతినిధులతో నిర్మాత శ్రీరామ్ దత్తి మాట్లాడుతూ.. ” ఒక మంచి సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు పడే ఆవేదన పిల్లలకు ఒక కొత్త ఆలోచనను కలిగిస్తుందని…
Year: 2022
‘అలిపిరికి అల్లంత దూరంలో..’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా
కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూనిక్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘మా తిరుపతి’ పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రమోషనల్ మెటీరియల్ మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం నవంబర్ 18న థియేటర్లో విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో యూనిట్…
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ని మెప్పించిన ‘మసూద’
మళ్ళీ రావా లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి థ్రిల్లర్ తరువాత విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తన మూడవ చిత్రంగా మసూద అనే హారర్ డ్రామాని నిర్మించారు. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్,. సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీమియర్ ని చిత్రయూనిట్ తో పాటు… యువ దర్శకులు చూశారు. ఈ సదర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద్భంగా యువ దర్శకులు…
సమంతగారు ఒప్పుకుంటే ‘యశోద’ సీక్వెల్స్ చేస్తాం : దర్శక నిర్మాతలు హరి, హరీష్ & శివలెంక కృష్ణప్రసాద్
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. అన్ని భాషల్లో, అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లో 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అమెరికాలో హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ”సమంత గారి వన్ విమన్ షో ‘యశోద’. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత టైటిల్ రోల్‌కి సమంత గారయితే బావుంటుందని అనుకున్నాం. ఆమెకు వెళ్లి చెప్పిన వెంటనే ఓకే…
నాకు మాస్ జానర్ అంటే ఇష్టం : ‘సుడిగాలి’ సుధీర్ తో ఇంటర్వ్యూ..
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న మాస్అండ్‌యాక్షన్ ఎంటర్‌టైనర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరో సుధీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… -గాలోడు కథ నాకు చాలా నచ్చింది. నా పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా బాగుంటుంది. అందుకే సినిమాను ఒప్పుకున్నాను. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం, మళ్లీ సిటీలో ఇంకో సమస్యలో చిక్కుకోవడం, ఈ మధ్యలో ప్రేమ కథ ఉంటుంది.. చిన్న చిన్న టిస్టులతో మంచి మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా నడుస్తుంది. – గాలోడు…
Superstar Krishna : సాహసానికి మారుపేరు!
సూపర్ స్టార్ కృష్ణ గారి మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సాహసోపేతమైన నిర్ణయాలతో సినిమా స్థాయి పెంచిన హీరో అంటే కృష్ణనే. నిన్నటి నుంచీ ఆయన గురించి ఆలోచిస్తుంటేనే గుండె బరువెక్కుతుంది. హీరో అంటే కృష్ణ. కృష్ణ అంటే ఓ క్రేజ్. కృష్ణ అంటే ఓ ఇమేజ్. కృష్ణ అంటే ఓ సాహసం. సూపర్ స్టార్ అంటే కృష్ణ మాత్రమే. అది చెరగని ముద్ర. ఎప్పటికీ మాయని ముద్ర. తెరపై వెలిగే కృష్ణ అంటే బాల్యం నుంచీ పెనవేసుకున్న బంధం. ఎన్ని జ్ఞాపకాలో. కృష్ణ గారి సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందంటే చాలు. ఆ సినిమా ఎలా చూడాలో రకరకాల ప్లాన్ లు రెడీ చేసి పెట్టుకునేవాడిని. ఇంట్లో తెలియకుండా ఆదివారం సినిమా చూసే అవకాశం వస్తే సంతోషం. లేకపోతే మిగతా రోజుల్లో స్కూల్…
ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు
తెలుగు సినీ తారాలోకంలో మరో ధృవ తార నేల రాలింది.తన సినిమాలతో కొన్ని తరాలను ఊర్రూతలూగించిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. తమ అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు నాలు మూలాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కడసారి వీడ్కోలు పలికారు. కృష్ణ కుమారుడు మహేష్ బాబు తండ్రి చితికి నిప్పటించారు అగ్ని సంస్కారం నిర్వహించారు. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం తరుపున పోలీసులు గౌరవ సూచకంగా గాల్లో కాల్పులు జరిపి కృష్ణ పార్ధివ దేహానికి గన్ సెల్యూట్ చేశారు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అంతకు ముందు తెలంగాణ గవర్నర్ తమిళ సై ..…
లెజెండ్రీల శకం ముగిసినట్టే!
టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకున్న కథానాయకులంతా ‘ఇక సెలవంటూ..’ కళామతల్లికి వీడ్కోలు పలుకుతూ అనంత లోకాలకు పయనమయ్యారు. తెలుగు చిత్ర సీమలో తొలి తరం హీరోలుగా కొనసాగిన వారిలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు నటశేఖర కృష్ణ వంటి కథానాయకులందరూ ఎంతో అద్భుతమైన చిత్రాల్లో తమ పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల మన్నలను పొందిన ఈ హీరోలందరూ కళామతల్లికి సెలవు ప్రకటించారు. తెలుగు చిత్రసీమలో లెజెండ్ గా గుర్తింపు పొందిన ఈ హీరోలందరూ ఒక్కొక్కరిగా మరణిస్తూ చిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు. ఈ నేపథ్యంలో నందమూరి తారక రామారావు, శోభన్ బాబు, నాగేశ్వరరావు వంటి లెజెండరీ నటులు మరణించి కొన్నేళ్లు గడచింది.…
సూపర్ స్టార్ కృష్ణ మృతికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంతాపం
భారతీయ చలన చిత్ర చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణది ఓ సువర్ణాధ్యాయం. నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి వక్తి నుండి వ్యవస్థగా మారిన బంగారు మనిషి కృష్ణ. మహా నటుడు ఎన్టీయార్, ఏయన్నార్ అడుగు జాడల్లో నడుస్తూ, శోభన్ బాబుతో కలిసి తెలుగు సినిమా రంగానికి నాలుగో స్థంబంలా నిలిచారాయన. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్ గా అన్ని రంగాలపైనా పట్టు సంపాదించుకుని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషలలోనూ పలు చిత్రాలను నిర్మించారు. 300కు పైగా చిత్రాలలో నటించారు. తెలుగు తెరపై ఆయనే తొలి కౌబోయ్, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే ప్రథమ 70 ఎం. ఎం. మూవీ డైరెక్టర్ కమ్ హీరో… చిత్రసీమలో డేరింగ్ డాషింగ్ అనే పదాలకు నిలువెత్తు నిర్వచనం కృష్ణ. ఆయన…
మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం!
మీరు ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా మీ బడ్జెట్ పరిధిలో మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం చేసింది TV9 తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్టుమెంట్లు , కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాంహౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా మీరు సందర్శించాలిస్సిన ప్లేస్ TV9 Sweet Home Real Estate & Interior Expo. 60 కి పైగాప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో నవంబర్ 18 నుండి 20 వరకు 3 రోజుల పాటు హైటెక్ సిటీలోని హైటెక్ ఎక్సిబిషన్ సెంటర్లో జరగనుంది . ఆకర్షనియమైన ఇంటీరియర్, ఫర్నిచర్ మరియు అద్భుతమైన హాం డెకరేషన్, డిజైన్ కూడా వినియోగదారులకు అందించబోతుంది ఈ వేదిక. స్థిరాస్తి కొనాలనుకున్న వారికి ఋణ…
