రైతుల తిరుగుబాటు నేపథ్యంలో `నాగలి`

raithula thirurugubaatu nepdyamlo NAAGALI

1995లో `తపస్సు` అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ప్రముఖ పాత్రలో ఒక రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ది డ్రీమ్స్ కంపెనీ బ్యానర్ పై శ్రీమతి పావని మొక్కరాల సమర్పణలో `నాగలి` అనే సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ….“ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నూతన నటీనటులతో చిత్రీకరణ జరిపాము. నూతన కథానాయకుడు సుదీప్ మొక్కరాల నిడదవోలు, కథానాయకి అనుస్మతి సర్కార్ ముంబాయి, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఎంఎల్ రాజా సంగీత సమర్పణలో జరిగాయి. రైతుల ఆత్మహత్యలు… వాళ్ళ కథలు , వెతలు కలయబోసిన 1857, 58ల మధ్య జరిగిన సిపాయిల తిరుగుబాటును తలపించేలా ఇప్పుడు రైతుల…

అన్ని రకాల పాత్రలు చేయాలనే కోరిక ఉంది : ‘మసూద’ విజయంపై హీరో తిరువీర్

అన్ని రకాల పాత్రలు చేయాలనే కోరిక ఉంది.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా హీరో తిరువీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… – పరేషాన్ సినిమా చేస్తున్న సమయంలో మసూద గురించి తెలిసింది. సినిమాటోగ్రఫర్ జగదీష్ చీకటి ద్వారా ఈ సినిమా గురించి నాకు తెలిసింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సినిమా ఆఫర్…

సీజన్ అఫ్ మ్యాజిక్ లో “గుర్తుందా శీతాకాలం”

Dec 9th Gurthundaseethakalam movie Relese

యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా న‌టించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం. ఈ చిత్రం ద్వారా క‌న్న‌డ‌ ద‌ర్శ‌కుడు, న‌టుడు నాగ‌శేఖ‌ర్ ని తెలుగుతెరకి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది ల స‌మ‌ర్పణలో కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు, డిసెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా నిర్మాత రామారావు చింత‌ప‌ల్లి మాట్లాడుతూ.. ”శీతాకాలం తో నాకు ప్ర‌త్యేకమైన ప‌రిచయం లేక‌పోయినా.. ఈ శీతాకాలం మాత్రం నాకు గుర్తుండిపోతుంది. ఈ సినిమా లో హీరో స‌త్యదేవ్ , త‌మ‌న్నా, మెఘా ఆకాష్‌, కావ్యాశెట్టి లు…

‘కాంతార’ వరాహ రూపం పాటపై స్టే ఎత్తివేసిన కోర్టు!

kantara varaha roopam movie news

చిన్న సినిమాగా విడుదలై పెను సంచలనం సృష్టించింది ‘కాంతార’. కన్నడ నుంచి నుంచి వచ్చిన ఈ సినిమా.. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లను కలెక్ట్‌ చేసింది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో కూడా సంచలనం సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఓటీటీలో సినిమా చూసిన వారందరూ సినిమాపై పెదవి విరుస్తున్నారు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లైమాక్స్‌లో వచ్చే ‘వరాహరూపం’ పాటనే ‘కాంతార’ సినిమాకు ఊపిరి. కానీ, ఈ పాట లేకుండా వేరే ట్యూన్‌తో ఓటీటీలో సినిమాను విడుదల చేశారు. దీంతో సినిమా చూసిన వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు…

‘మట్టి కుస్తీ’ మాస్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : హీరో విష్ణు విశాల్ ఇంటర్వ్యూ

Hero Vishnu Vishal Interview about Matti kusthee movie

విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయిక. ‘ఆర్ టీ టీమ్వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో హీరో విష్ణు విశాల్ చిత్ర విశేషాలని మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు… ‘మట్టి కుస్తీ’ గురించి చెప్పండి ? – ‘మట్టి కుస్తీ’ భార్య భర్తల ప్రేమ కథ. భార్యభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కథలో కుస్తీ స్పోర్ట్ కూడా భాగంగా వుంటుంది. కేరళలో మట్టికుస్తీ అనే స్పోర్ట్ వుంది. ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి మట్టికుస్తీ అనే పేరు పెట్టాం. పెళ్లి తర్వాత భార్యభర్తలకు కొన్ని అంచనాలు…

డిసెంబ‌ర్ 9న ‘పంచ తంత్రం’ విడుద‌ల

dec 9th Panchathanthram relese

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసిన చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేసింది. ‘పంచతంత్రం’ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఇది 5 జంట‌ల‌కు సంబంధించిన క‌థ అని అర్థ‌మ‌వుతుంది. డా.బ్ర‌హ్మానందం ఈ ఐదు క‌థ‌ల‌కు పంచేద్రియాలు అనే పేరు పెట్టి త‌న కోణంలో స్టార్ట్ చేస్తార‌ని ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధ‌లు కూడా వ‌స్తుంటాయి. అలా…

Ranasthali Movie Review : ఆసక్తికరంగా ‘రణస్థలి’!

Ranasthali Movie Review

(చిత్రం : రణస్థలి, విడుదల : 26 నవంబర్ 2022, దర్శకత్వం : పరశురాం శ్రీనివాస్, నిర్మాత : అనుపమ సూరెడ్డి, సమర్పణ : సూరెడ్డి విష్ణు, నిర్మాణం : ఏ.జె ప్రొడక్షన్ బ్యానర్, నటీనటులు: ధర్మ, అమ్ము అభిరామి, చాందిని రావు, సమ్మెట గాంధీ, బెనర్జీ, దిల్ రమేష్, ‘త్రిబుల్ ఆర్’ చంద్రశేఖర్, మధుమణి, ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం, తేజ తదితరులు, సంగీతం : కేశవ్ కిరణ్, సినిమాటోగ్రఫీ: జాస్టి బాలాజీ, ఎడిటర్ : భువనచంద్ర.ఎమ్, రేటింగ్ : 3/5) సూరెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం ‘రణస్థలి’. ఈ చిత్రం విడుదలకు ముందే మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. పరశురామ్ శ్రీనివాస్…

విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో ‘ఉక్కు సత్యాగ్రహం’ : ఆడియో విడుదల

Ukkusathyagraham telugu Movie

తాను ఏ తరహా సినిమా తీసినా అందులో సామాజిక అంశాలను మిళితం చేసే సత్యారెడ్డి ఇప్పటివరకు ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి ,రంగుల కళ ,కుర్రకారు ,అయ్యప్ప దీక్ష , గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా వంటి చిత్రాలను నిర్మించారు. దర్శక, నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్న విషయం తెలిసిందే. జనం సమస్యల పరిష్కారం కోసం రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకుని తాజాగా “ఉక్కు సత్యాగ్రహం” పేరుతో సత్యారెడ్డి ఓ సినిమా తీస్తున్నారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి రూపొందిస్తున్నారు. ఇదివరకే ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన ‘సమ్మె నీ జన్మహక్కురన్నో…’ అంటూ సాగే లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్…

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు : జంపాల శ్రీనివాస్

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు : జంపాల శ్రీనివాస్

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బిజెపి రాష్ట్ర నాయకులు జంపాల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించిన నిధులవల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరగనుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు రూ.573.13 కోట్లు విడుదల చేయడం వల్ల ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌-భూపాలపట్నం సెక్షన్‌లో 163వ జాతీయ రహదారి విస్తరణ, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌-167కేలో లేన్ల అభివృద్ధి పనులు ఉన్నాయన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణా నదిపై రూ.436.91 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించనున్నారని, ఈ రహదారి వల్ల హైదరాబాద్‌ నుంచి తిరుపతి, నంద్యాల, చెన్నైల మధ్య దాదాపు 80 కిలోమీటర్ల…

మా గుండె ధైర్యం.. మా ఆత్మబంధువు, సునీతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

మా గుండె ధైర్యం.. మా ఆత్మబంధువు, సునీతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

నవతరానికి నాయకురాలిగా, యువతరానికి ఆదర్శప్రాయురాలిగా, భర్తకు తగ్గ భార్యగా రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. ఆపదలో వున్న వారికి నేనున్నానే భరోసా కల్పిస్తున్నారామె. జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి ఏసీ గదుల్లో , కార్యాలయానికే పరిమితం కాకుండా సబ్బండ వర్గాల సమస్యలపై సునీత దృష్టి పెట్టారు. మారుమూల ప్రాంతాలలోని సామాన్యులతో కలియతిరుగుతూ, వారి కుటుంబంలో మనిషిలా వారికి తలలో నాలుకలా వుంటున్నారు. ఏం జరిగినా మా సునీతమ్మ వుందన్న భరోసాను ఆమె కల్పిస్తున్నారు. ఈ రోజు సునీత మహేందర్ రెడ్డి పుట్టినరోజు. ఆమె ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం.