2021లో ప్రయాణాలపై ఆసక్తి కనబర్చిన 75% మంది హైదరాబాద్ కస్టమర్లు

Over 75% customers from Hyderabad keen to travel in 2021 itself The city is a key source market for Telangana & Andhra Pradesh reveals Thomas Cook India
Spread the love

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు కీలక మార్కెట్ గా హైదరాబాద్ – థామస్ కుక్ ఇండియా వెల్లడి

  • -65 శాతం నెలవారీ వృద్ధి  పెరిగిన –  ట్రావెల్ డిమాండ్
  • -మహమ్మారి ముందుకాలం నాటి స్థాయిలో 55 శాతానికి కోలుకున్న రంగం
  • -దేశీయ ప్రయాణాలు 290%, అంతర్జాతీయ ప్రయాణాలు 60% వృద్ధి – బాట వేసిన ఎక్స్ పో 2020 దుబాయ్ 
  •  హైదరాబాద్, అక్టోబర్ 26, 2021: రాష్ట్రానికి, పరిసర ప్రాంతాలకు హైదరాబాద్ కీలక మార్కెట్ గా ఉన్నట్లు భారతదేశ అగ్రగామి ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ సర్వీసెస్ కంపెనీ అయిన థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ నివేదించింది. ఆంక్షలు విధించిన 18 నెలల తరువాత, సరిహద్దులు తిరిగి తెరవడంపై, టీకాల ఆమోదంపై సానుకూల ప్రకటనల నేపథ్యంలో, హైదరాబాద్ కస్టమర్లలో పటిష్ఠమైన ప్రయాణ కోరికలు ఉన్నట్లుగా కంపెనీ డేటా వెల్లడించింది. ఈ కారణంగా డిమాండ్ లో నెలవారీ ప్రాతిపదికన 65 శాతం  వృద్ధి చోటు చేసుకుంది. రాబోయే పండుగ సీజన్, శీతాకాలపు సీజన్ లు ఎక్స్ పో 2020 దుబాయ్ తో కలిపి మహమ్మారి ముందుకాలంలో ఉన్న డిమాండ్ లో 55 శాతానికి కోలుకుంది. దేశీయ ప్రయాణాలు 290 శాతం పెరిగాయి. అంతర్జాతీయ ప్రయాణాలు 60 శాతం వృద్ధి చెందాయి. (డేటా సేకరణ కాలం సెప్టెంబర్ 2021 వర్సెస్ సెప్టెంబర్ 2019). హైదరాబాద్ కు చెందిన వారికి వారి అభిమాన గమ్యస్థానాలుగా మాల్దీవులు, దుబాయ్ – అబుదాబి, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, టర్కీ, ఈజిప్ట్, రష్యా ఉన్నాయి.  
  • హాలీడే వ్యాపారంతో పాటుగా పెళ్లిళ్లు, హనీమూన్ విభాగంలోనూ ప్రయాణాలు పెరిగినట్లుగా థామస్ కుక్ ఇండియా గుర్తించింది. అంతేకాకుండా విదేశీ విద్య కోసం హైదరాబాద్ నుంచి విద్యార్థులు విదేశాలకు వెళ్లడం కూడా అధికమైపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోథామస్ కుక్ ఇండియా తన ఉనికి విస్తరించింది. అక్కడ 13 అవుట్ లెట్స్ ను కలిగి ఉంది. హైదరాబాద్ లో 7 అవుట్ లెట్స్ (సైఫాబాద్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, సైనిక్ పురి, సికింద్రాబాద్, దిల్ సుక్ నగర్) ఉన్నాయి. వీటిలో 3 కంపెనీ సొంతం కాగా 4 ఫ్రాంచైజీ అవుట్ లెట్స్. పరిసర ప్రాంతాలకు సైతం హైదరాబాద్ సౌకర్యవంతమైన కేంద్రంగా ఉంది.  
  • హైదారాబాద్ ట్రావెల్ ట్రెండ్స్: థామస్ కుక్ ఇండియా సర్వే హైదరాబాద్ నుంచి ప్రయాణికుల దృక్పథాలు, ప్రయాణ ధోరణులను వెల్లడించింది. 
  • పటిష్ఠమైన ప్రయాణ డిమాండ్: హైదరాబాద్ నుంచి స్పందించిన వారిలో 75 శాతం మంది 2021లో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరిచారు. 
  • అంతర్జాతీయ / దేశీయ మిళితం & ప్రాధాన్య గమ్యస్థానాలు:
  • • 66% ప్రాధాన్య అంతర్జాతీయ గమ్యస్థానాలు: దుబాయ్, అబుదాబి, మాల్దీవులు/మారిషస్, థాయిలాండ్, బాలి, యూరప్ (స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా), అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా
  • • 81% దేశీయ విహారాలు: కశ్మీర్, లేహ్ – లద్దాఖ్, రాజస్థాన్, గోవా, అండమాన్స్
  •  ప్రముఖ అనుభూతులు: లద్దాఖ్ – కశ్మీర్ రహదారిలో బైకింగ్, రాజస్థాన్; అండమాన్ దీవుల్లో సీ కార్టింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్, స్నోకరింగ్, టీ / కాఫీ ఎస్టేట్ లలో ప్లాంటేషన్ బంగ్లాలలో బస చేయడం; మనాలి ఆపిల్ తోటల్లో పిక్నిక్ లాంటివాటిని ఇష్టపడుతున్నారు. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లేదా రష్యా లోని లాప్లాండ్ & నార్తర్న్ లైట్స్, నీ లూ క్రూయిజ్, కప్పాడోసియాలో హాట్ ఎయిర్ బెలూనింగ్ (టర్కీ), ఎక్స్ పో 2020 దుబాయ్ అత్యధిక ప్రాధా న్యాలిచ్చే అంశాలుగా ఉన్నాయి.
  •  డిమాండ్ కలిగిన కీలక విభాగాలు: కుటుంబాలు, మిలీనియల్స్ / యువ ప్రొఫెషనల్స్, హనీమూన్ జంటలు, బిజినెస్  &  బ్లీజర్
  •  ప్రయాణంలో తోడు: హైదరాబాద్ నుంచి ప్రయాణించే వారు కుటుంబాలతో, పలు తరాలకు చెందిన వారితో కలసి ప్రయాణిస్తున్నారు (55%). స్నేహితులు / కొలీగ్స్ (20%); జంటలు (20); సోలో (5%)
  •  2021 నాలుగో త్రైమాసికంలో అగ్రగామిగా ఎక్స్ పో 2020 దుబాయ్
  • డిమాండ్ ను మరింత ముమ్మరం చేసేందుకు అధీకృత టికెట్ రీసెల్లర్స్ గా థామస్ కుక్ ఇండియా ఎంతో ప్రత్యేకమైన డీల్స్ ను కూడా ప్రారంభించింది: రూ.52,000 (ఎయిర్ ఇన్ క్లూజివ్ హాలీడేస్), రూ.28,000 (ల్యాండ్ ఓన్లీ) వీటిలో ఉన్నాయి.
  •  ఈ సందర్భంగా థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ లీజర్ ట్రావెల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సంతోష్ ఖన్నా మాట్లాడుతూ, ‘‘సుమారుగా 18 నెలల పాటు ఇళ్లకే పరిమితమైన తరువాత, హైదరాబాద్ / తెలంగాణ కస్టమర్లు 75 శాతం మంది ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. భారతదేశం, మాల్దీవులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యూరప్, టర్కీ, ఎక్స్ పో 2020 దుబాయ్ లాంటివి కుటుంబాలు, జంటలు, విద్యార్థుల్లో అధిక ఆసక్తి నెలకొల్పాయి.
  •  2021 నాలుగో త్రైమాసికంలో  డిమాండ్ ను అధికం చేసేందుకు మేం ఆకర్షణీయమైన ధరలతో పండుగ, శీతాకాలపు టూర్లను ప్రవేశపెట్టాం. ఎస్కార్టెడ్ గ్రూప్ ప్రయాణాలతో పాటుగా బై వన్ – గెట్ వన్ ఫ్రీ, ఫ్యామిలీ డిస్కౌంట్స్, ఎర్లీ బర్డ్ స్పెషల్స్, క్రేజీ డీల్ ప్యాకేజెస్ వంటివి వీటిలో ఉన్నాయి.
  •  మరీ ముఖ్యంగా మా ఆఫర్లు అన్నీ కూడా అపోలో క్లినిక్స్ తో కలసి ట్రావ్ షీల్డ్ – సమగ్ర సురక్షిత కమిట్ మెంట్ & అష్యూర్డ్ సేఫ్ ట్రావెల్ ప్రోగామ్ తో కూడి ఉంటాయి.

Related posts

Leave a Comment