రియల్ హీరో సోనూసూద్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇటీవల కాలంలో కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలిచాడు. కరోనా ఫస్ట్ వేవ్ లో వలస కూలీల కు అండగా నిలబడి… వారిని స్వగ్రామాలకు తరలించాడు. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డాడు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ కూడా తన సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక సోను పై ఉన్న అభిమానంతో చాలామంది ఫ్యాన్స్ గుడులను కూడా కట్టారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు సోనూసూద్. ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లను దాటింది. భారతదేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో సోనూసూద్ ఒకడిగా నిలవటం విశేషం!!
రియల్ హీరో సోనూసూద్ ట్విట్టర్ లో సరికొత్త రికార్డు!
