చిత్రపురి అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన చిత్రపురి బోనాల వేడుకలు భక్తులను అమితంగా ఆకట్టుకుని విశేషంగా అలరించాయి. చిత్రపురి అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, కౌన్సిలర్ హైమాంజలి దంపతులు అమ్మవారికి తొలి బోనాలు సమర్పించారు. భక్తులు చిత్రపురి శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అని చిత్రపురి వాసులు, భక్తులు ఎంతగానో కొలుస్తారు. చిత్రపురి కాలనీలో మొట్టమొదటిసారి LIG & EWS, HIG, MIG, Row House, HIG Duplex నుండి బోనాలు అమ్మవారికి సమర్పించుకోవడం జరిగినది. ఎన్నో సంవత్సరాలు ఇంటి కల నెరవేరినందుకు ఇక్కడ నివసిస్తున్న చిత్రపురి వాసులందరూ సుమారు 4000 కుటుంబాలు కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేయడం ఒక మహా జాతరను తలపించినది. ఇక్కడ అమ్మవారి బోనాలు ఇంత పెద్ద జరిగిన విధానం చూస్తుంటే రాబోవు రోజులలో ఈ అమ్మవారి ఆలయం మహా శక్తివంతమైన అమ్మవారి దేవాలయముగా భక్తులతో కటికటలాడుతుంది అనడానికి ఇదే నిదర్శనం. అనేక రకాలుగా డప్పులు, కోలాటాలు, బ్యాండ్, డీజే, పోతురాజులు, అనేక కాంతారా వేష ధారణాలతో శివ శక్తి మాతలతో అమ్మవారి బోనాలు జరగడం ఈ చుట్టు పక్కల చిత్రపురి లో చూస్తున్నాము. సాయంత్రం ఫలహారపు బండి ఊరేగింపు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరగడం చూస్తుంటే ఇక్కడ వల్లభనేని అనిల్ కుమార్ కమిటీ సభ్యుల ఏర్పాట్లు అమోఘంగా ఉంది అంబరాన్ని అంటాయి. ఈ బోనాల కార్యక్రమం లో సుమారు 10000 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా.. చిత్రపురి అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతోనే ఈ ఏర్పాట్లన్నీ చేశామని, శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారని, ఈ అమ్మవారిని అనుగ్రహం పొందిన తర్వాతే నేను ఈరోజు ఈ స్టేజిలో ఉండటం జరిగిందని, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచిన వారికి ప్రతి ఒక్కరూ విజయం పొందుతారని, త్వరలో ఇక్కడ అమ్మవారి ఆలయం నిర్మిస్తున్నామని, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ చిత్రపురి కాలనీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అందరి నివాసయోగ్యానికి అనుకూలంగా ఏర్పడినదన్నారు. ఈ బోనాల ఏర్పాట్లు ఇలా చేయడానికి ఆ అమ్మవారి అనుగ్రహం మాకు ఉన్నదని, అలాగే చిత్రపురి వాసులందరికీ కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ అమ్మవారి ఆలయం దినదినం అభివృద్ధి చెందుతూ విశేష ఆదరణ పొందాలని ఆ భక్తుల్ని కోరడమైనదని ఆయన పేర్కొన్నారు.