నాగ శౌర్య ‘రంగబలి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Naga Shaurya, Pawan Basamsetti, Sudhakar Cherukuri, SLV Cinemas Rangabali Theatrical Trailer Unveiled
Spread the love

యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’ వస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ తో పాటు మొదటి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.
హీరో తన ఊరు పై తనకు ఉన్న అభిమానానికి గల కారణాన్ని చెప్పడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. హీరో తండ్రి మెడికల్ షాప్ నడుపుతుండగా, తను స్నేహితులతో తిరుగుతూ కాలం గడిపేస్తుంటాడు. ఊర్లో ఓ డాక్టర్ తో ప్రేమలో పడతాడు. స్థానికంగా వున్న నాయకుడికి ఫాలోవర్ గా ఉంటాడు. అయితే వారి మధ్య శత్రుత్వం ఏర్పడి గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.
నాగ శౌర్య మరోసారి అద్భుతమైన నటన కనబరిచి కథను భుజానికెత్తుకున్నారు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌కి పేరుపొందిన శౌర్య మరోసారి ఆకట్టుకున్నారు. యుక్తి తరేజా తన పాత్రను చక్కగా పోషించింది. విలన్ షైన్ టామ్ చాకో భయపెట్టగా, శరత్ కుమార్ ఇంటెన్సివ్ పాత్రలో కనిపించారు. సత్య తనదైన వినోదాన్నిపంచాడు.
పవన్ బాసంశెట్టి తన రైటింగ్ , టేకింగ్‌ తో ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీతో పాటు యూత్ ఆడియన్స్‌ కి కూడా బాగా నచ్చే విధంగా సినిమా తీశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు, ఆర్ట్ వర్క్ అన్నీ ఉన్నతంగా వున్నాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. దర్శకుడు పవన్ పవన్ చెప్పింది చెప్పినట్లుగా తీశాడు. యుక్తి తరేజ చాలా బ్యూటిఫుల్ గా వుంది. తనకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమాతో అందరికీ కనెక్ట్ అవుతారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు
దర్శకుడు పవన్ మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన శౌర్య, సుధాకర్ గారికి కృతజ్ఞతలు. ఈ కథలో రంగబలి అనేది మెయిన్ సెంటర్. దానికి తగ్గట్టు ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టాం. జులై 7న సినిమా వస్తోంది. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం’’ అన్నారు
యుక్తి తరేజ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. జులై 7 సినిమా వస్తోంది. మీ అందరి ఆదరణ కావాలి’’అన్నారు
ఈ చిత్రానికి దివాకర్ మణి కెమెరా మెన్ గా పని చేస్తుండగా , పవన్ సిహెచ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్‌ ఎడిటర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ ప్రకాష్‌ . ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది.
నటీనటులు: నాగ శౌర్య, యుక్తి తరేజ, సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో తదితరులు.
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ ఎల్ వి సినిమాస్
సంగీతం: పవన్ సిహెచ్
డీవోపీ: దివాకర్ మణి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్

Related posts

Leave a Comment