టి-హబ్, మీస్కూల్ ఆధ్వర్యంలో సినీ ప్రెన్యూర్ షిప్ కోర్సు

T-Hub and MEESchool present the Cinepreneur Entrepreneurship Orientation @ Thub for students of Fine art, Mass communication & Engineering for upcoming cohorts
Spread the love

ఇప్పటికే విజయవంతంగా కోహర్ట్-1 పూర్తి : డిసెంబరు నుంచి రెండో కోహర్ట్; రిజిస్ట్రేషన్లు ప్రారంభం

హైదరాబాద్, అక్టోబర్ 30, 2022: భారతదేశంలో ఇన్నోవేషన్ కేంద్రాల్లో పేరొంది టి-హబ్, మీస్కూల్ (మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ ఈ స్కూల్) కలిసి సినీప్రెన్యూర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సర్టిఫికేషన్ కోహర్ట్-2ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే విజయవంతంగా ఒక బ్యాచ్ పూర్తిచేసి, ఇప్పుడు రెండో బ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాయి. సినీప్రెన్యూర్ అనేది మీడియా మరియు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (ఎం అండ్ ఈ) కార్యక్రమం. ఇందులో మీడియా వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారికి మాడ్యూళ్లవారీగా శిక్షణ ఉంటుంది. సినీ నిర్మాణం నుంచి కమ్యూనికేషన్ల వరకు అన్నీ ఇందులో ఉంటాయి. సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని రంగాల్లో అంటే.. స్క్రిప్టు రైటింగ్, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, సినీ నిర్మాణం, వాయిస్ ఓవర్, ఫిల్మ్ బ్రాండింగ్, మార్కెటింగ్ మరియు పిఆర్.. ఇలా అన్నింట్లోనూ సంబంధిత రంగాల్లో నిపుణులు నేరుగా శిక్షణ ఇస్తారు. ఈ విషయాన్ని మీస్కూలుకు చెందిన ప్రతిభా పులిజాల ఇలా వివరించారు.
‘‘కొత్త బ్యాచ్ కోసం మొత్తం 50 మందిని తీసుకుంటారు. రిజిస్ట్రేషన్లు నవంబరు నెలాఖరు వరకు ఉంటాయి. డిసెంబర్ 1 నుంచి హైబ్రిడ్ మోడల్లో క్లాసులు మొదలవుతాయి. నవంబరు నెల మొత్తం వారానికో వెబినార్ ఉంటుంది. దానికి రిజిస్టర్ చేసుకున్నవారికి ప్రీ ఓరియంటేషన్ ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న లింక్ క్లిక్ చేస్తే నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా +91 8074306196 నంబరుకు ఫోన్ చేసి వివరాలు చెప్పి రిజిస్టర్ చేసుకోవచ్చు. మొత్తం కోర్సు వ్యవధి రెండు నెలలు. ఇందులో ప్రత్యక్ష శిక్షణతోపాటు ఆన్ లైన్ క్లాసులు కూడా ఉంటాయి. కోహర్ట్-1లో యూఎస్ఏ, యూఏఈ, బెంగళూరు, ఢిల్లీ, నాగపూర్ లాంటి ప్రాంతాల నుంచి కూడా శిక్షణ తీసుకున్నారు. అక్కడి వారికి క్లాసులు ఆన్ లైన్ లో తీసుకుని, తర్వాత అక్కడ ఉండే స్టూడియోల్లో వాళ్లకు శిక్షణ ఇచ్చారు. ఈసారి చెన్నైకి చెందిన ప్రముఖ స్క్రిప్టు రైటర్ షణ్ముగ సుందరం, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ లాంటివాళ్లు ఆయా రంగాలకు సంబంధించి శిక్షణ ఇస్తారు. మొత్తం 10 సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక గెస్ట్ లెక్చరర్లతో పాటు ఫ్యాకల్టీ కూడా ఉంటారు. క్లాసులు హైబ్రిడ్ మోడల్లో ఉంటాయి కాబట్టి పట్టభద్రులు ఎవరైనా ఇందులో నమోదుచేసుకుని, శిక్షణ తీసుకోవచ్చు. శిక్షణ తీసుకునే ప్రతి ఒక్కరికీ సిల్లీమాంక్స్ లాంటి స్టూడియోలు, టిహబ్ లోని ఎంసీ హబ్ లాంటిచోట్ల లైవ్ ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం లభిస్తుంది’’ అని తెలిపారు.
ఈ సందర్భంగా టి-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు (ఎంఎస్ఆర్) మాట్లాడుతూ… “సరైన మెంటార్షిప్ తో నిజమైన వృద్ధి అవకాశాలను అన్ లాక్ చేయడానికి మీడియా, వినోద పరిశ్రమలలో ఇన్నోవేటివ్ వ్యవస్థాపకులు, నిపుణులకు ఈ కార్యక్రమం ఒక గేట్ వేగా పనిచేసింది. మొదటి కోహోర్ట్ విజయంతో మేము ఎంతో సంతోషించాం. మీస్కూల్ భాగస్వామ్యంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో మరింత మంది ప్రతిభావంతులు, వ్యవస్థాపకులను తయారుచేయడానికి ఎదురు చూస్తున్నాము’’ అని చెప్పారు.

Related posts

Leave a Comment