‘బైరాన్ పల్లి’ చిత్ర ప్రదర్శన : పోస్టర్ విడుదల

Bairanpalli chithra pradarshana poster relese
Bairanpalli chithra pradarshana poster relese
Spread the love

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ పై వెంకట్ కాచర్ల దర్శకత్వంలో నరేష్ వర్మ ముద్దం నిర్మించిన ‘బైరాన్ పల్లి’ చిత్రం చాలా బాగుందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో ‘బైరాన్ పల్లి’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన మామిడి హరికృష్ణ ‘బైరాన్ పల్లి’ చిత్రాన్ని తిలకించిన తర్వాత పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”బైరాన్ పల్లి చిత్రం అద్భుతంగా వచ్చిందని ఇందులో హర్రర్ సన్నివేశాలు ప్రతి పేక్షకుణ్ణి కట్టిపడేస్తాయని పేర్కొన్నారు. ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని, మంచి వసూళ్లు రాబడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ‘బైరాన్ పల్లి’ చిత్ర నిర్మాత నరేష్ ముద్దం, పలు చిత్రాల నిర్మాత ఆసంపల్లి, సీనియర్ జర్నలిస్టు, పలు చిత్రాల దర్శకుడు అయిలు రమేష్, నటీనటులు ప్రేమ్ సాగర్, విజయ్ కుమార్, ప్రభావతి, మాధవి, లోరా , దామెర రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి వై గిరి, సంగీతం: ఎన్.ఎల్ రాజా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సందీప్, ఎడిటింగ్: మహేంద్ర నాథ్, నిర్మాత: నరేష్ వర్మ, దర్శకత్వం : వెంకట్ కాచర్ల.