ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిచిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”.
సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది.
త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ను దర్శకసంచలనం వి.వి.వినాయక్ విడుదల చేసి, ట్రైలర్ అద్భుతంగా ఉందని… సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ కు నిర్మాతలు రవి కనగాల- రామ్ తుమ్మలపల్లి సంతోషం వ్యక్తం చేశారు. రచయితగా ఎన్నో సంచలనాలకు నెలవైన యండమూరి దర్శకత్వంలో రూపొందిన “అతడు ఆమె ప్రియుడు” అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని పేర్కొన్నారు.
అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!