కల్యాణ్ రామ్ 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా ‘బింబిసార’. ఈ సినిమాకి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించారు. సోషియో ఫాంటసీ జోనర్లో నడిచే కథ ఇది. ఈ సినిమాలో ఒక బంచ్ లో కల్యాణ్ రామ్ ‘బింబిసార’గా కనిపించనున్నాడు. ఆయన నుంచి వచ్చిన ఫస్టులుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అలాగే పెద్దగా అనుభవం లేని దర్శకుడి చేతుల్లో ఆయన ఇంత పెద్ద ప్రాజెక్టును ఉంచడం ఆశ్చర్యపరిచింది. కల్యాణ్ రామ్ హీరోగానే కాదు .. నిర్మాతగా కూడా కొన్ని సార్లు సాహసాలు చేస్తుంటాడు. అలాంటి సినిమాల జాబితాలోనే ‘బింబిసార’ను చేర్చుకోవచ్చు. ఇక ఈ సినిమాను మొదలు పెడుతున్నట్టుగా .. షూటింగు నడుస్తున్నట్టుగా కల్యాణ్ రామ్ ఎక్కడా చెప్పలేదు. అందువలన అప్ డేట్స్ రాలేదు. చాలా వరకూ సినిమా పూర్తయిన తరువాత పోస్టర్స్ పట్టుకునే ఆయన ఎంట్రీ ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఎప్పుడు మొదలుపెట్టారు? ఎలా పూర్తి చేశారు? అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమాలో కేథరిన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా అలరించనున్నారు. తెలుగులో సంయుక్త మీనన్ చేసిన మొదటి సినిమా ఇదే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా క్రిస్మస్ బరిలో దిగనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అప్పటికి ఇంకా పనులు పూర్తి కాకపోవడం వలన అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయని అంటున్నారు. నిజానికి ఈ తేదీన చిరంజీవి – కొరటాల ‘ఆచార్య’ రావలసింది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన ఏప్రిల్ 1వ తేదీకి ఈ సినిమాను వాయిదా వేశారు. ఇక ఆ రోజున ప్లాన్ చేసిన ‘సర్కారువారి పాట’ కూడా దాదాపు వాయిదా పడినట్టే. ‘బింబిసార’ను కూడా రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఒక భాగాన్ని ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నారన్నమాట. మొదటి భాగం విడుదలైన తరువాతనే సెకండ్ పార్టును మొదలు పెడతారని అంటున్నారు. కల్యాణ్ రామ్ తన కెరియర్ లోనే తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథను టచ్ చేస్తున్నాడు. డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Related posts
-
‘రంగంస్థలం’ తరవాత అంతటి సినిమా : ‘పొట్టేల్’ పై దర్శకుడు సందీప్ వంగా
Spread the love ‘రంగంస్థలం’ చిత్రం తరవాత అంత మంచి కథతో వస్తున్న చిత్రం ‘పొట్టేల్’ అని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి... -
‘మన్యం ధీరుడు’లోని “నమోస్తుతే నమోస్తుతే భారత మాతా” గీతానికి ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యం !
Spread the love ఈ సినిమా కధానాయకుడైన ఆర్ వి వి సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసి పాడి హిమాలయాల్లో చిత్రీకరించడం తో... -
MANYAM DHEERUDU Song NAMOSTHUTHE BHARATHA MATHA got appreciations all over the world .
Spread the love Namosthuthe bharatha matha song from film Manyam dheerudu which actually sung by RVV Satyanarayana...