పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్‌ని విజయ్‌దేవరకొండ రిలీజ్చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం : నిర్మాత ఆర్.బి చౌదరి మృతి
Spread the love సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, తమిళ్ హీరో జీవా తండ్రి ఆర్.... -
M4M Movie Trailer Review : ది న్యూ ట్రెండ్ సెట్టర్
Spread the love * కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు బహుమతి ‘వాడు సామాన్యుడు కాదు.. కేర్... -
‘పెద్ది’ని టార్గెట్ చేస్తున్నారా?
Spread the love * టాలీవుడ్ ని కుదిపేస్తున్న ‘పెద్ది’ సమస్య.. టాలీవుడ్ లో ఇప్పుడు ‘పెద్ది’ సినిమా చర్చగా మారింది. థియేటర్ల...
