Jul 31, 2026

‘స్పైడర్-మ్యాన్‌’తో అల్లు అర్జున్ క్రేజ్.. హైదరాబాద్‌లో ఘనంగా ప్రీమియర్

Allu Arjun's craze with 'Spider-Man' – Grand premiere in Hyderabad.

Allu Arjun's craze with 'Spider-Man' – Grand premiere in Hyderabad.

Spread the love

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ (భారతదేశంలోనే అతిపెద్ద, అత్యాధునిక డాల్బీ సినిమా స్క్రీన్)లో గ్రాండ్ ప్రీమియర్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రీమియర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి హాజరై సందడి చేశారు. అభిమానులు ఈ అరుదైన ఫ్యామిలీ మూమెంట్‌ను ఆసక్తిగా స్వాగతించగా, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు అల్లు అరవింద్, అల్లు శిరీష్, బన్నీ వాస్, దర్శకులు చందూ మొండేటి, సాయి రాజేష్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, నటి రష్యా గోరక్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి, హారిక & హాసిని క్రియేషన్స్‌కు చెందిన నిర్మాత చిన్నబాబు, ఆస్కార్ విజేత నిర్మాత గునీత్ మోంగా తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖుల సందడితో ప్రీమియర్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుండగా, విడుదలైన తొలి రోజే పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ ప్రదర్శనలతో సినిమా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దేశవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.