నిఖిల్ సిద్దార్థ్ ‘స్పై’ నుంచి విడుదలై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న “జూమ్ జూమ్” పాట

Musical melody 'Jhoom Jhoom Re..' from Nikhil Siddharth's 'Spy' dropped
Spread the love

యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ 2” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఇప్పుడు వరుస సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. అలాగే వరుస లైనప్ సినిమాలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ తరుణంలో గ్యారీ పిహెచ్ దర్శకత్వంలో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న సినిమా స్పై. ఈడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ స్టోరీ, డెత్ మిస్టరీ ఆధారంగా ఉత్తరకెక్కుతున్న సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది.
జూమ్ జూమ్ అంటూ సాగే ఈ పాట నికుల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్ మధ్య వచ్చే లవ్ రొమాంటిక్ సాంగ్. అనురాగ్ కులకర్ణి, రమ్య బేహారా పాడిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ రచయితగా వ్యవహరించారు. సీతారమమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ ఆల్బమ్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకులుగా పనిచేస్తున్నారు. అలాగే శ్రీ చరణ్ పాకాల స్పై సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తూటాలే పేలుస్తుంటే నీ చిరు నగవే, అందాల గాయం తగిలే నా ఎదకే వంటి లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కమ్మని పదాలతో సాగే మెలోడీ సాంగ్ శ్రోతల మనసు దోచేసింది. ప్రస్తుతం ఈ పాట కుర్రకారు గుండెలను మీటుతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
భారదేశ అత్యుత్తమమైన రహస్య కథను చరిత్రలో నిలిచిపోయే స్పై థ్రిల్లర్ చిత్రంగా స్పై చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళ్, మళయాళం,కన్నడ భాషల్లో జూన్ 29 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముస్తాబు అవుతుంది.
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమటం, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ, కృష్ణ తేజ, ప్రిషా సింగ్, సోనియా నరేష్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం & ఎడిటింగ్ : గ్యారీ బీఎచ్
కథ & నిర్మాత: కె. రాజశేఖర్ రెడ్డి,
సీఈఓ: చరణ్ తేజ్ ఉప్పలపాటి
డీఓపీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
అదనపు సినిమాటోగ్రఫీ: జూలియన్ అమర్ ఎస్ట్రాడా DFP, కైకో నకహరా
రచయిత : అనిరుధ్ కృష్ణమూర్తి
సంగీతం : శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
ఆర్ట్ : అర్జున్ సూరిశెట్టి
సౌండ్ డిజైన్ సింక్ సినిమా
డీఐ & మిక్సింగ్ : అన్నపూర్ణ స్టూడియోస్
మిక్సింగ్ ఇంజనీర్: కన్నన్ గణపత్
అసోసియేట్ ఎడిటర్: భవిన్ ఎం షా
పీఆర్ఓ : హరీష్, దినేష్

Related posts

Leave a Comment