చిత్ర పరిశ్రమలోకి సీనియర్ నటీనటుల వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వ సాధారణమే. అయితే వారిలో చాలా తక్కువమంది మాత్రమే వేరే రంగాల్లో కూడా అడుగుపెడతారు. ఆ విధంగా అక్కడ కూడా తమ టాలెంట్ నిరూపించుకోవాలని చూస్తుంటారు. ఎక్కువగా హీరోల కుమారులు, కుమార్తెలే లైమ్ లైట్ లోకి వస్తుంటారు. ఇటీవల కాలంలో సీనియర్ హీరోయిన్ల కుమార్తెలు సైతం బాగానే పాపులర్ అవుతున్నారు. సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా కుమార్తె.. అన్షు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే తాజాగా ఈ అమ్మడు మొదటిసారి ర్యాంప్ వాక్ చేస్తున్న ఫోటోలు కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతున్నాయి. ఇప్పటికే రచయితగా తన ప్రతిభను చాటుకున్న ఆమె ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ తళుక్కుమంది. నైజీరియాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎంట్రపెన్యూర్షిప్ ఫెస్టివల్’లో సందడి చేసింది. ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. టాలీవుడ్ కు మరో హీరోయిన్ దొరికేసినట్టే అంటూ యూత్ అంతా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
వాహ్.. ర్యాంప్ వాక్‌తో అలరించిన రోజా కుమార్తె!
