జ‌న‌వ‌రి 21న శిల్పక‌ళావేదిక‌లో జ‌ర‌గ‌బోయే ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ సిల్వ‌ర్ జూబ్లీ సెల‌బ్రేష‌న్స్‌ను గ్రాండ్ స‌క్సెస్ చేయాల‌ని కోరుతున్నాను : నిర్మాత దిల్ రాజు

Wishing 'Little Musicians Academy' Silver Jubilee Celebrations to be held at Shilpakalavedika on 21st January a Grand Success : Producer Dil Raju
Spread the love

దివంగ‌త గాన గంధ‌ర్వుడు, ప‌ద్మ‌భూష‌ణ్ ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆశీస్సుల‌తో 1999లో ప్రారంభ‌మైన ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. గురు రామాచారి ఆధ్వ‌ర్యంలో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి ఎంద‌రో గాయ‌నీ గాయ‌కులను అందించిన ఈ అకాడ‌మీ సిల్వ‌ర్ జూబ్లీ సెలబ్రేష‌న్స్ వేడుక‌ల‌ను జ‌న‌వ‌రి 21న హైద‌రాబాద్ శిల్పక‌ళా వేదిక‌లో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో…
గురు రామాచారి మాట్లాడుతూ ‘‘‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ సంస్థ నుంచి ఇప్ప‌టికే చాలా మంద‌వి ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్స్ వ‌చ్చారు. నేను చాలా మంది గురువుల ద‌గ్గ‌ర సంగీతాన్ని అభ్య‌సించాను. ఈ క్ర‌మంలో సంగీతం ప‌ట్ల అభిరుచి ఉన్న పిల్ల‌ల‌ను చేర‌దీసి పాటంటే ఏంటి? అందులోని మాధుర్యం ఏంటి? అందులో గ్రామ‌ర్ ఎలా ఉంటుంది? ఇలా చాలా విష‌యాల‌ను నేర్పిస్తూ వారిని పెద్ద సినిమాల్లో పాడే గాయ‌నీ గాయ‌కులుగా, రియాలిటీ షోస్‌లో పాడే సింగ‌ర్స్‌గా, ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో షోస్‌లో పాడే సింగ‌ర్స్‌గా మార్చటానికి మా కోర్ క‌మిటీ సహాయంతో ప్ర‌య‌త్నిస్తున్నాం. ఈ ప్ర‌యాణంలో అంద‌రూ మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ప్రోత్స‌హిస్తున్నారు.
తెలుగు సినీ ఇండ‌స్ట్రీనికి చెందిన ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ మాకు ఎంతో స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. చాలా మంది టీవీ షోస్‌లో మా అకాడ‌మీ నుంచి పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇండియ‌న్ ఐడిల్ వ‌ర‌కు వెళ్లిన‌వాళ్లున్నారు. అలాగే జీ స‌రిగ‌మ‌ప వ‌ర‌కు వెళ్లారు. తెలుగులో కాకుండా ప‌లు భాష‌ల్లో పాటలు పాడుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎందరో శిష్యులున్నారు. దిల్‌రాజుగారి కుటుంబం నుంచి నాకెంతో ప్రోత్సాహం ఉంది. దిల్ రాజుగారి మొద‌టి సినిమా నుంచి ఆయ‌న‌తో ఏదో ర‌కంగా వ‌ర్క్ చేస్తున్నాను.
దర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, ఎం.ఎం.కీర‌వాణిగారు, కోటిగారు ఇలా ఎంద‌రో త‌మ వంతు స‌హ‌కారాన్ని అందిస్తున్నారు. భ‌గ‌వంతుడి ఆశీస్సుల‌తో ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చాం. జ‌న‌వ‌రి 21న‌ మేం సిల్వ‌ర్ జూబ్లీ ఉత్సవాల‌ను జ‌రుపుకుంటున్నాం. ఈ ఉత్స‌వానికి సార‌థ్యం వ‌హించాల‌ని రాఘ‌వేంద్రరావు, దిల్ రాజుగారిని కోర‌గానే వారు సార‌థ్యం వ‌హించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులంద‌రూ హాజ‌రు కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘మా మొదటి సినిమా దిల్ చేస్తున్నప్పుడు మా అన్నయ్య రాసిన మమ్ము కాచినవాడు..పాటకు రామాచారిగారే పాటను చక్కగా సమకూర్చారు. అప్పటి నుంచి నాకు ఆయ‌న‌తో ప‌రిచ‌యం ఉంది. దిల్ సినిమా చేస్తున్న‌ప్పుడు అప్పుడ‌ప్పుడే ఇక్క‌డ తెలుగు సినీ ఇండ‌స్ట్రీ పెరుగుతుంది. ఆ స‌మ‌యంలో రామాచారిగారు ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ గురించి చెప్పారు. రామాచారిగారు ఎంతో మంది గాయ‌నీగాయ‌కుల‌ను ప‌రిచ‌యం చేయ‌ట‌మే కాకుండా.. ఎంతో మంది చిన్న‌పిల్ల‌ల‌కు సంగీతం ప‌ట్ల మ‌క్కువ‌ను పెంచారు. మ‌న తెలుగు సినిమాకు కావాల్సిన గాయ‌నీగాయ‌కుల‌ను ఎంతో మందిని అందించారు. ఆ సంస్థ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌ను జ‌న‌వ‌రి 21న శిల్ప‌క‌ళావేదిక‌లో నిర్వ‌హిస్తున్నారు. రాఘవేంద్ర‌రావు, న‌న్ను క‌లిసి సార‌థ్యం వ‌హించ‌మ‌ని రిక్వెస్ట్ చేశారు. ఈ అకాడ‌మీలో ఉచితంగా సంగీతాన్ని నేర్పిస్తున్నారు. ఈ 25 ఏళ్లుగా వారు ఇండ‌స్ట్రీకి త‌న వంతు స‌పోర్ట్ అందించారు. ఇప్పుడు అంద‌రం ఈ వేడుక‌కు త‌మ మ‌ద్ద‌తుని తెలియ‌జేయాల‌ని కోరుతున్నాం. ఇండ‌స్ట్రీ నుంచి ప్ర‌ముఖుల‌ను ఆహ్వానిస్తున్నాం. అంద‌రూ ఈ వేడుక‌కి హాజ‌రై వేడుక‌ను స‌క్సెస్ చేయాల‌ని కోరుతున్నాను. ఇప్ప‌టికీ ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ని రెంట‌ల్ బిల్డింగ్‌లోనే నిర్వ‌హిస్తున్నారు. కాబ‌ట్టి త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వానికి వీరికి ప్ర‌భుత్వం త‌ర‌పున సాయం వ‌చ్చేలా చేయాల‌నే ఆలోచ‌న ఉంది. రామాచారిగారి లాంటి వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేస్తే స‌మాజానికి మంచి చేయాల‌నుకునేవాళ్లు ఎంతో మంది ముందుకు వ‌స్తారు’’ అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ పాట‌లు నేర్చుకుని సింగ‌ర్‌గా రాణిస్తోన్న ర‌మ్యా బెహ‌రా స‌హా ప‌లువురు గాయ‌నీ గాయ‌కులు విచ్చేశారు.

Related posts

Leave a Comment