మెగాస్టార్ `విశ్వంభ‌ర‌`పై మౌనమేల!?

Why the silence on Megastar 'Vishvambhara'?
Spread the love

మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ మీదున్నారు. ఇటీవల సంక్రాంతికి `మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్‌గారు`తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని త‌న ఖాతాలో వేసుకున్న చిరు అదే జోష్‌తో మ‌రో సినిమాని రంగంలోకి దించేస్తాడ‌ని.. అదే ఊపుతో మ‌రో చిత్రానికి శ్రీ‌కారం చుట్టేస్తాడ‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాద‌ని జ‌రుగుతున్న ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. ‘మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్‌గారు’కు ముందు చిరు మొద‌లు పెట్టిన భారీ గ్రాఫిక‌ల్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ‘విశ్వంభ‌ర‌’. మ‌ల్లిడి వ‌శిష్ట ద‌ర్శ‌కుడు. సినిమా పూర్త‌యింది. యువీ క్రియేష‌న్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌లై దాదాపు ఏడాది పూర్తయింది. అయినా స‌రే ఇప్ప‌టికీ దీని రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. టీమ్ నుంచి ప్ర‌క‌ట‌నా లేదు. గ్రాఫిక్స్ ఆశించిన స్థాయి క్వాలిటీగా లేవ‌ని గ్లింప్స్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో సినిమా రిలీజ్‌ని మేక‌ర్స్ నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. గ‌త ప‌దిహేను నెల‌లుగా గ్రాఫిక్స్ వ‌ర్క్ జ‌రుగుతున్నా దానికి సంబంధించిన అప్ డేట్‌ని మేక‌ర్స్ ఇవ్వ‌డం లేదు. సినిమా రిలీజ్‌పై క్లారిటీకి రావ‌డం లేదు. అయితే ఇదే సంస్థ నిర్మించిన ‘బైక‌ర్‌’ మాత్రం ఎలాంటి అడ్డంకులు, వాయిదాలు లేకుండా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. దీంతో ‘బైక‌ర్‌’పై ఉన్న క్లారిటీ `విశ్వంభ‌ర‌`పై ఎందుకు రావ‌డం లేద‌ని. ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన మేక‌ర్స్ ఎందుకు స్పందించ‌డం లేద‌నే కామెంట్‌లు ఇప్ప‌డు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఈ విష‌యంలో క్లారిటీ రావాలంటే మేక‌ర్స్ స్పందించాల్సిందేన‌ని అభిమానులు, నెటిజ‌న్‌లు కోరుతున్నారు. మ‌రి మేక‌ర్స్ స్పందిస్తారా? లేక ఎప్ప‌టిలాగే మౌనం పాటిస్తారా? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.

Related posts