అందరికీ అందుబాటులో వినోద్ ఫిలిం అకాడమీ… ఘనంగా వినోద్ ఫిల్మ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవం

Vinod Film Academy Open to all... Celebrating the third anniversary of Vinod Film Academy
Spread the love

వినోద్ ఫిల్మ్ అకాడమీ దిన దిన ప్రవర్ధమానమై మరింతగా ఎదగాలని ప్రముఖ పారిశ్రామికవేత్త సినీ నిర్మాత కృష్ణాజిల్లా లైన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ అన్నారు. మంగళవారం ప్రసాద్ లాబ్స్ లో జరిగిన వినోద్ ఫిల్మ్ అకాడమీ తృతీయ వార్షికోత్సవంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అకాడమీతో తన అనుబంధాన్ని వివరించారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడే విజయం వరిస్తుందని ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీదేవి ప్రసాద్ అన్నారు. నటుడు ప్రదీప్ మాట్లాడుతూ నటనలో ఉండే టెక్నిక్ ను పట్టుకోవాలని అన్నారు.
వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రముఖ దర్శకుడు ఏ మోహన్ గాంధీ విద్యార్థులను ఆశీర్వదించారు. దొరసాని చిత్ర దర్శకుడు శ్రీ కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ కొత్త నటులకు అవకాశం ఇస్తూ ఉంటానని ప్రకటించారు.
మాటల రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కోటి మంది మాత్రమే ఉంటారని అందులో తాము ఉండడం ఎంతో అదృష్టమని అన్నారు
అకాడమీ వ్యవస్థాపకుడు వినోద్ ప్రసంగిస్తూ.. తమ సంస్థ అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ టెక్నాలజీ నిపుణులు నల్లమోతు శ్రీధర్, జబర్దస్త్ అప్పారావు, యూ ట్యూబ్ ఫాదర్ సతీష్ , టిఏంటి డి ఎ యూ అధ్యక్షుడు రాజశేఖర్ ,బబ్లు, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.
అకాడమీ ప్రిన్సిపాల్ కిషోర్ దాస్ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

Related posts

Leave a Comment