సాయిరామ్ శంకర్ గతంలో నటించిన 143, బంపర్ ఆఫర్ చిత్రాలు ప్రేక్షకులను ఎలా అలరించాయో తెలిసిందే. సాయిరామ్ శంకర్ తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని అలరించడంలో దిట్ట. తాజాగా యాక్షన్, కామెడీ, డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఇందులో సాయిరామ్ శంకర్ సరసన యషా శివకుమార్, హెబ్బా పటేల్ నటించారు. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నూతన దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని దేవరాజ్ పోతూరు నిర్మించారు. యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సాయిరామ్ శంకర్ ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ఎలా అలరించాడో చూద్దాం..
కథ: తెలంగాణాలోని కామారెడ్డిలో సరదాగా తిరిగే కుర్రాడు కామారెడ్డి శంకర్(సాయిరామ్ శంకర్)… ఏదైనా ఉపాధి పొందాలని హైదరాబాద్ సిటీకి వస్తాడు. అక్కడ తన ఫ్రెండు(సత్యం రాజేష్)తో కలిసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ… సరదాగా గడిపేస్తూ ఉంటాడు. అయితే అతనికి పెద్దగా క్వాలిఫికేషన్ ఏమీ లేకపోవడంతో ఏదైనా డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్ ను తీసుకొని జాబ్ చేయాలనుకుంటాడు. అలా ఫేక్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నిస్తుండగా… శృతి(యషా శివకుమార్) పరిచయం అవుతుంది. ఈ పరిచయం ప్రేమగా మారుతుంది. శృతి కూడా ఫేక్ సర్టిఫికేట్ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగం సంపాధిస్తుంది. మరి కామారెడ్డి శంకర్ ఆ ఫేక్ సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం సంపాధించారా? అసలు శంకర్ సిటీకి వచ్చింది ఉద్యోగం కోసమా? లేక మరేదైనా ఇతర కారణాలున్నాయా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: సాయిరామ్ శంకర్ ఎప్పటిలాగే తన ఎనర్జీ చూపించారు. కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ను ఆటపట్టించే సన్నివేశాలు, సత్యం రాజేష్ తో వచ్చే సీన్స్ అన్నీ నవ్విస్తాయి. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో ఫుల్ ఎనర్జీ చూపించారు. అతనికి జోడీగా నటించిన యషా శివకుమార్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో ఫేక్ సర్టిఫికెట్స్ సప్లై చేసే పాత్రలో నటించిన చిత్ర నిర్మాత దేవరాజ్ మెప్పించారు. త్రూ అవుట్ సినిమా మొత్తం తన పాత్రను క్యారీ చేశారు. అతనికి జంటగా నటించిన గాయత్రి భార్గవి కూడా గృహిణిగా మెప్పించారు. సునీల్ విలన్ పాత్రలో ఎప్పటి లాగే నటించి ఆకట్టుకుంటారు. అయితే పుష్ఫ సినిమాలో సునీల్ విలనిజాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకాస్త బాగా పోట్రెయిట్ చేయాల్సింది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఎంటర్టైనింగ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అందులోనూ సాయిరామ్ శంకర్ ఎంటర్టైన్ మెంట్ అంటే… ఇష్టపడని ఆడియన్ ఉండరు. అతని కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ అందరికీ తెలుసు. దానికితోడు ఓ చిన్నపాటి సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ జోడిస్తే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ‘వెయ్ దరువెయ్’ సినిమాలో నూతన దర్శకుడు నవీన్ రెడ్డి కూడా చేసింది అదే. సాయిరామ్ శంకర్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకుని, కొంచెం ఫ్యామిలీ డ్రామాను జోడించి… చివర్లో ఓ చిన్నపాటి మెసేజ్ కూడా ఇచ్చారు. చదువుకోకుండా అడ్డదారుల్లో ఫేక్ సర్టిఫికెట్స్ పొంది ఉద్యోగాలు పొందితే కటకటాలపాలు కాకతప్పదని మెసేజ్ ఇచ్చారు. అలాగే నిరాశలో ఉన్న యువతను క్యాష్ చేసుకోవడానికి వారికి ఫేక్ సర్టిఫికెట్స్ తయారుచేసి ఇచ్చి… సొమ్ము చేసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఓ హాస్పిటల్ ఇన్సిడెంట్, ఓ కుంగిన ఫ్లై ఓవర్ కారణంగా కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి జీవితం… ఇలా మెసేజ్ రూపంలో ఆడియన్స్ కు ఇచ్చారు దర్శకుడు. అలాగే అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్స్ సప్లై చేసి… సమాజంలో పరువు పొగొట్టుకుని, విగతజీవునిగా మారడాన్ని ఇందులో చూపించారు. దురాశ దు:ఖానికి చేటు అనే నీతి సూత్రాన్ని… ఎంటర్టైనింగ్ గా, ఎమోషనల్ గా చెప్పారు. ఫస్ట్ హాఫ్ లో అంతా సత్యం రాజేష్ తో కలిసి సాయిరామ్ శంకర్ చేసే సరదా సరదా సన్నివేశాలతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసి… ఆ తరువాత ఇంటర్వెల్ బ్యాంగ్ తో సునీల్ ని పరిచయం చేస్తాడు దర్శకుడు. ఇటీవల తన విలనిజంతో విపరీతంగా మెప్పిస్తున్న సునీల్… ఇందులోనూ ఆకట్టుకుంటాడు. సెకెండాఫ్ అంతా యాక్షన్, డ్రామాతో సినిమాని ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. ఓవరాల్ గా ‘వెయ్ దరువెయ్’ సినిమా ఆడియన్స్ ని అలరిస్తుంది.
దర్శకుడు నవీన్ రెడ్డి ఎంచుకున్న మెయిన్ ప్లాట్ బాగుంది. దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ఎంటర్టైనింగ్ గా ఉంది. అయితే ఇంకాస్త బలమైన సన్నివేశాలు, సంభాషణలు రాసుకుని ఉంటే మరింత గ్రిప్పింగ్ గా ఉండేది. దర్శకునికి డెబ్యూ మూవీనే అయినా… ట్రీట్ మెంట్ చేసిన విధానం బాగుంది. భీమ్స్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మార్కు మ్యూజిక్ ఇందులో కూడా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జోడీని అందంగా చూపించారు. పాటల పిక్చరైజేషన్ చాలా బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కూడా సినిమాని నిర్మించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్: 3