తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది కీర్తిసురేశ్. ఈ భామతోపాటు రెండు భాషల్లో మంచి క్రేజ్ ఉన్న తారల్లో ముందువరుసలో ఉంటారు ఐశ్వర్యలక్ష్మి, కల్యాణి ప్రియదర్శన్. ఎప్పుడూ ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే ఈ ముగ్గురు హీరోయిన్లు సరదాగా సినిమాకెళ్లారు. ఇంతకీ వీళ్లంతా ఏ సినిమా వెళ్లారనే కదా విూ డౌటు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో. ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. చెన్నైలోని వెట్రి థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా థియేటర్‌లో సీట్లలో కూర్చొని సెల్ఫీ దిగారు. ఇప్పుడీ సెల్ఫీ నెట్టింట ట్రెండిరగ్ అవుతోంది. విజయ్ క్రేజ్‌కు ఫిదా అయ్యే వారిలో సెలబ్రిటీలు కూడా ఎక్కువే ఉంటారని.. తాజా సెల్ఫీతో మరోసారి రుజువు చేస్తున్నారు ముగ్గురు హీరోయిన్లు. కీర్తిసురేశ్ ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. కళ్యాణి ప్రియదర్శన్ మలయాళంలో రెండు సినిమాలు, తమిళంలో ఒక సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాది కింగ్ ఆఫ్ కొత్త, పొన్నియన్ సెల్వన్ 2 చిత్రాల్లో మెరిసింది ఐశ్వర్య లక్ష్మి. ఈ భామ కొత్త సినిమా ఏం ప్రకటించలేదు.
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...