ఈ నెల 31న విడుదల కానున్న హీరో నవదీప్ సమర్పిస్తున్న ‘సగిలేటి కథ’ చిత్రం ట్రైలర్

The trailer of the movie 'Sagileti Katha' presented by hero Navdeep which will be released on 31st of this month
Spread the love

రవితేజ మహాదాస్యం, విషిక కోట నూతన నటి నటులు జంట గా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం లో తెరకెక్కించబడిన చిత్రం ‘సగిలేటి కథ’. అందరికి సుపరిచితుడైన హీరో నవదీప్ సి- స్పేస్ సమర్పణలో, అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో ఒక గ్రామం లోని పాత్రల మధ్య జరిగే నాటకీయ ఘటనల ఆధారంగా ఆయా పాత్రల మనస్తత్వాలకు అద్దం పడుతూ, అన్ని రకాల భావోద్వేగాలను నిజాయితీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ఇది ఒక కాంటెంపరెర్రి విలేజ్ డ్రామ, పాత్రల చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలతో కొద్దిరోజులు మీరు పక్కా ట్రావెల్ చేస్తారు. ప్రతి పాత్ర చాలా సహజం గా ప్రత్యేక శైలి లో ఉండబోతుంది. ఇందులో చికెన్ కూడా ఒక పాత్ర.
“చికెన్ అంటే కూరో, వేపుడో కాదు…చికెన్ అంటే ఒక ఎమోషన్ “. మలయాళం, తమిళ్ వంటి భాషలలో వాళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్ ని సినిమా రూపంలో చాలా కథలు చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ‘సగిలేటి కథ’ ద్వారా రాయలసీమ నేటివిటీ, కల్చర్ అండ్ ట్రెడిషన్ ని కథ రూపం లో వచ్చే ఆయా సన్నివేశాలు చూసి మన ఏపీ & తెలంగాణ లో మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం.
గతంలో షేడ్ స్టూడియోస్ వారు తమ షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ‘కనబడుటలేదు’ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడు కొత్త వారికి అండగా ఉండే షేడ్ స్టూడియోస్ మరొకసారి నూతన నటి నటులు, సాంకేతిక బృందం తో కలిసి ఇప్పుడు రెండవ చిత్రం గా ఈ “సగిలేటి కథ” ను చక్కని విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
సగిలేటి కథ కేవలం సినిమా కాదు. మన జీవితంలో ఉండే అన్ని భావోద్వేగాలా సమర్పణ. ప్రతి ఒక్క పాత్ర మిమ్మల్ని అలరిస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సినిమా లో హీరో గా చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను.
ఈ చిత్రాన్ని చూసి, హీరో నవదీప్ ప్రేక్షకుల ముందుకి తన సమర్పణ లో తీసుకురావడం కొండంత బలం చేకూర్చిందని చిత్ర బృందం తెలిపింది. ఈ నెల 31 వ తారీకు ట్రైలర్ ని విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ పేర్కొన్నారు
ఈ చిత్రానికి రచయిత, సినిమాటోగ్రఫి, ఎడిటర్, దర్శకత్వం రాజశేఖర్ సుద్మూన్ అందించారు.
నటి నటులు: రవితేజ మహాదాస్యం, విషిక కోట
నిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవిప్రసాద్ బలివాడ ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేష్ బాబు మాదినేని సంగీతం: జశ్వంత్ పసుపులేటి
నేపథ్య సంగీతం సనల్ వాసుదేవ్
రచన: రాజశేఖర్ సుద్మూన్ శశికాంత్ బిల్లపాటి
ఆర్ట్ డైరెక్టర్స్: హేమంత్ జి, ఐశ్వర్య కులకర్ణి
సాహిత్యం: వరికుప్పల యాదగిరి, రాజశేఖర్ సుద్మూన్, శశికాంత్ బిల్లపాటి, పవన్ కుందని
పీఆరోఓ: తిరుమలశెట్టి వెంకటేష్
పబ్లిసిటీ డిజైనర్: యమ్ కే యస్ మనోజ్

Related posts

Leave a Comment