వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ ‘వాట్స్ అప్ నరేష్’ నుంచి రెండో గ్లింప్స్ రిలీజ్

The second glimpse from the feel-good romantic entertainer What’s Up Naresh released, As a Valentine’s Day special
The second glimpse from the feel-good romantic entertainer What’s Up Naresh released, As a Valentine’s Day special
Spread the love

యూత్ ఫుల్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్ చిత్రాలకు ఎప్పుడూ కూడా ఆదరణ దక్కుతూనే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్..’‘కొత్తపోరడు’ ఫేమ్ అన్వేష్ మైఖేల్ జంటగా ‘వాట్స్ అప్ నరేష్’ అనే చిత్రం రాబోతోంది. సివివి సినిమా బ్యానర్ మీద భాగ్యలక్ష్మీ చింత నిర్మించిన ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్, లవ్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ఇటీవలె రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా రెండో గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు.
‘ఎట్ల నడుస్తుంది డేటింగ్ లైఫ్’ అని హీరో అడగడం.. ‘మొన్ననే చెప్పిన కదా నాకు ఇష్టం లేదని’.. అని హీరోయిన్ సంభాషణతో గ్లింప్స్‌ను ఓపెన్ చేశారు. ‘నువ్వెప్పుడూ డేట్స్‌కి వెళ్లడం లేదా?’.. అని హీరోయిన్.. ‘వెళ్లినా సెట్ అవ్వడం లేదు’ అని హీరో..‘ ఏ.. ఏ..’ అని హీరోయిన్ అడగడంతో వారి సంభాషణ మరింత ఇంట్రెస్టింగ్ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక చివరకు ‘మీ ఇంట్లో కాస్ట్ పిచ్చి ఏమైనా ఉందా?’.. అంటూకులం గురించి మాట్లాడుకున్న సంభాషణ ఎంతో ఫన్నీగా ఉంది. అలా మొత్తానికి ఈ రెండో గ్లింప్స్‌తో ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పకనే చెప్పేశారు.
ఇక ఈ గ్లింప్స్ లెంగ్త్ ఎక్కువ అయినా కూడా ఆ ఫీల్ మాత్రం ఎక్కడా మిస్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన “అయోమయంగా సాగుతున్న పయనమే ఇదా” అనే పాట ఎంతో హాయిగా, వినసొంపుగా ఉంది. టోటల్ గా ఈ గ్లింప్స్ ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్ గానే సైక్ సిద్ధార్థ్ మూవీకి ఇతను మంచి సంగీతాన్ని అందించాడు. విప్లవ్ నైషదం ఎడిటర్‌గా పని చేస్తున్నారు. వేదరామన్ శంకరన్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్‌లతో చిత్రయూనిట్ ఆకట్టుకోనుంది.
తారాగణం : అన్వేష్ మైఖేల్, కావ్య కళ్యాణ్‌రామ్, కె సాయి సంతోష్, ఉషశ్రీ మురళి, సంతోష్ నందివాడ, ప్రియాంక రవిరు, మధు, పద్మ, బొమ్మకంటి రవీందర్, సునందన, మాల పార్వతి, కిరణ్ కుమార్ తదితరులు.
సాంకేతిక బృందం :
బ్యానర్ : సివివి సినిమా
నిర్మాత: భాగ్య లక్ష్మి చింత
రచన & దర్శకత్వం: సివి విశాల్
DOP: వేదరామన్ శంకరన్
సంగీతం: స్మరణ్ సాయి
ఎడిటర్: విప్లవ్ నైషదం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణకాంత్ మామిడాల
సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్లపల్లి, గుణ వి బాలు
సింక్ సౌండ్ రికార్డిస్ట్ : భువనగిరి హేమ
ప్రొడక్షన్ డిజైన్: భరత్ చంద్ర మల్కేద్కర్
ఆర్ట్ డైరెక్టర్: సంగెం నిఖిల్ హాసన్
కాస్ట్యూమ్ డిజైనర్: నిఖితా బచల
రంగు: వెంకట్ పి
DI: కెమిలియన్ పోస్ట్
ప్రొడక్షన్ బ్యానర్: సివివి సినిమా
ప్రొడక్షన్ కంట్రోలర్: ఉబా ప్రసాద్
లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ
PRO: సాయి సతీష్