మాస్ మహారాజా రవితేజ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై అన్ని వర్గాల పేక్షకులని అలరించి పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈగల్ మేకర్స్ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు.
పబ్లిక్ బ్లాక్ బస్టర్ ఈగల్ సక్సెస్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కు చాలా ఆనందంగా వుంది. నా పాత్ర మేకోవర్ కి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. కార్తిక్ ఈ కథ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్ కి చాలా ఎక్సయిట్ అయ్యాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అభినందనలు. హరీష్ శంకర్ తో వచ్చే మిస్టర్ బచ్చన్ తో హ్యాట్రిక్ కొడుతున్నాం. డేవ్ జాండ్ సౌండ్ ఇరగదీశాడు. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. అలాగే మణి చాలా పవర్ ఫుల్ మాటలు రాశాడు. తన పద ప్రయోగం చాలా బావుంది. కావ్య థాపర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. తనకి బ్రైట్ ఫ్యూచర్ వుంటుంది. కాళికాదేవి ఎపిసోడ్ అయితే నన్ను నేను నమ్మలేకపోయాను. ఎవరినో చూస్తున్న అనుభూతి కలిగింది. చాలా అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. కార్తిక్ అద్భుతమైన విజన్ కలిగిన దర్శకుడు. చెప్పినదాని కంటే అద్భుతంగా తీశాడు. తను టాప్ డైరెక్టర్ అవుతాడు. అనుపమ, అజయ్ ఘోస్, వినయ్ రాయ్ అందరూ తమ పాత్రలని పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. ఈగిల్ చూసిన తర్వాత ప్రేక్షకుల మనసుల నుంచి వచ్చిన స్పందన చాలా టచ్చింగ్ గా అనిపించింది. యాక్షన్ సినిమా చేయాలనే కోరిక ఎప్పటినుంచో వుంది. యాక్షన్ సినిమాకి మంచి మీనింగ్ యాడ్ చేసి తీయడం రవితేజ గారు లాంటి స్టార్ వలనే సాధ్యపడింది. ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి ధన్యవాదాలు. టీం అందరికీ థాంక్స్. సినిమా ఖచ్చితంగా థియేటర్స్ లో చూడండి’ అని కోరారు
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రవితేజ గారితో ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇప్పుడు ఈగల్ తో బ్లాక్ బస్టర్ ని కొనసాగించాం. చాలా ఆనందంగా వుంది. కార్తిక్ తో మరిన్ని చిత్రాలు చేయబోతున్నాం. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ..ఈగల్ అద్భుతమైన చిత్రం. మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇలాంటి పాయింట్ ని ఇంత స్టయిల్ గా తీయడం కార్తిక్ కే సాధ్యపడింది. డేవ్ జాండ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ధమాకా, ఈగల్, ప్రస్తుతం నేను చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ ఇలా మూడు డిఫరెంట్ సినిమాలు రవితేజ గారికి అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి ధన్యవాదాలు. కార్తిక్ మైండ్ బ్లోయింగ్ టేకింగ్ తో ప్రపంచం అంతా మెచ్చుకునేలా సినిమా తీశాడు” అన్నారు.
హీరోయిన్ కావ్యథాపర్ మాట్లాడుతూ..ఈగిల్ ని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. రవితేజ గారితో వర్క్ చేయడం నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ లో భాగం కావడం చాలా ఆనందంగా వుంది’ అన్నారు. ఈ వేడుకలో బివిఎస్ రవి, మణిబాబు, శ్రీనివాస్ అవసరాల, ప్రణీత, డేవ్ జాండ్, మిగతా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.