మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ కీలక షెడ్యూల్ షూటింగ్ పూర్తి

Mass Maharaja Ravi Teja's 'Mr Bachchan' shooting of key schedule completed
Mass Maharaja Ravi Teja's 'Mr Bachchan' shooting of key schedule completed
Spread the love

మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా టీం ఒక కీలక షెడ్యూల్ ని పూర్తి చేసింది. రవితేజతో పాటు ఇతర తారాగణం పై సినిమాలోని చాలా ముఖ్యమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్ లో అద్భుతంగా చిత్రీకరించారు. అనంతరం ‘మిస్టర్ బచ్చన్’ టీం, మాస్ మహారాజా రవితేజతో కలసి పబ్లిక్ బ్లాక్ బస్టర్ ‘ఈగిల్’ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తుకున్నారు.
రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ ‘నామ్ తో సునా హోగా’. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి.
ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్, టీ-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు