‘రంగంస్థలం’ చిత్రం తరవాత అంత మంచి కథతో వస్తున్న చిత్రం ‘పొట్టేల్’ అని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అన్నారు. యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో సాహిత్ మోత్కూరి రూపొందించిన సినిమా ‘పొట్టేల్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న కథను తెరకెక్కిస్తున్నానంటూ సాహిత్ ఓ రోజు నాకు చెప్పాడు. అది వినగానే ‘ఇది చిన్న కథ కాదు పెద్దది’ అని అనిపించింది. సినిమా చూశా. నాకు నచ్చింది. ఇలా ఉంటుందని నేను ఊహించలేదు. అందరూ చక్కగా నటించారు. విూకూ నచ్చుతుందని భావిస్తున్నా. ఇటీవల యంగ్ డైరెక్టర్లు ఎవరూ ఇలా పూర్తిస్థాయి గ్రావిూణ నేపథ్యంతో సినిమా చేయలేదనుకుంటున్నా. ఆ బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ తర్వాత నేను చూసిన సినిమా ఇదే. చిన్న సినిమాని ప్రోత్సహించండి అని సందీప్ రెడ్డి ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఇందులో నటించిన వారంతా గర్వపడే చిత్రమిది. మేమంతా కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాం. గొప్ప సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నటించినందుకు నాకంటే ఎక్కువగా మా అమ్మ గర్వంగా ఫీలవుతారు. హీరోయిన్లు మేకప్ వేసుకుని.. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటున్నంత మాత్రాన వారికి హృదయం ఉండదు, ఫ్యామిలీ ఉండదని కాదు. మమ్మల్నీ గౌరవించండి అని నటి అనన్య నాగళ్ల పేర్కొన్నారు. తన కుమార్తెను చదివించాలనుకునే ఒక గొర్రెల కాపరి కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఫస్ట్ కథ విన్నా.. ఓ చిన్న కథ చేసుకున్నానని చెప్పిండు. కథ విన్న తర్వాత తెలిసింది చిన్న కథ కాదు.. పెద్దది.. సినిమా చూశాచాలా బాగా నచ్చింది. రెండు పాటలు చాలా బాగా నచ్చాయి. ట్రైలర్ కూడా బాగుంది. అజయ్ మాత్రం భయపెట్టించి వదిలి పెట్టారు. నేను సినిమా చూసిన అని చెప్పట్లేదు. ఇంత బాగా చేస్తారని నేను ఊహించలేదు. ఎందుకంటే చిన్న సినిమా అన్నడు.. నాకు పెద్ద బ్జడెట్ కనిపించింది. ఎట్ల తీస్తడో అనుకున్న. అతన్ని నమ్మిన నిర్మాత సేఫ్ అని.. పెద్ద మనసుతో చేసిన చూసిన సినిమా ఇది. చూసిన అని డబ్బా కొట్టడం కాదు.. అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడున్న యువ దర్శకుల్లో ఇలా గ్రామానికి వెళ్లి సినిమా తీయడం ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. అక్టోబర్ 25న విూ ముందుకొస్తుంది.. అందరూ చిన్న సినిమాను ప్రోత్సహించండని విజ్ఞప్తి చేశాడు. ఈచిత్రంలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్‌ఐఎస్‌ఏ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Related posts
-
లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం.. ‘డియర్ కృష్ణ’ మూవీ టీమ్ వినూత్న కాంటెస్ట్
Spread the love ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అనుభూతితో పాటు, అదృష్టాన్ని తీసుకొచ్చే సినిమాలు చాలా చాలా... -
Telugu DMF Creators and Influencers Awards 2024: Celebrating South India’s Digital Excellence
Spread the love The much-anticipated Creators and Influencers Awards 2024, presented by Truzon Solar by Suntek, concluded... -
మారిన ‘ఉద్వేగం’ విడుదల తేదీ..నవంబర్ 29న విడుదల
Spread the love నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న కోర్టు డ్రామా కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్...