తానా సత్కారం పొందిన ప్రముఖ కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యంను నంది అవార్డ్ తో సత్కరించిన టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

TFCC Chairman Dr. Pratani Ramakrishna Goud honoured renowned Karate Master Lakshmi Samayaram with the Nandi Award.
Spread the love

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నుంచి సత్కారం పొందిన ప్రముఖ కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యంను ఘనంగా సత్కరించారు తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటులు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కరాటే అసోసియేషన్ నుంచి స్వామి రెడ్డి, గౌరీ శంకర్, స్నిగ్ధ, చంద్రకాంత్, సక్సెల్ లైఫ్, దుబాయ్ స్థాపకులు యోగ నారాయణ, కరాటే మాస్టర్ రవి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా …
టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మన లక్ష్మీ గారికి తానాలో ఘన సన్మానం జరగడం మనందరికీ గర్వకారణం. తానాలో సత్కారం పొందిన లక్ష్మీ గారిని మన టీఎఫ్ సీసీ నుంచి తప్పకుండా సన్మానించుకోవాలని భావించి ఆమెకు నంది పురస్కారం అందిస్తున్నాం. షూటింగ్ లో ఎంతో బిజీగా ఉన్నా ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన సుమన్ గారికి థ్యాంక్స్. సుమన్ గారి సినిమాల్లో కరాటే, మార్షల్ ఆర్ట్స్ చూసి ఎంతోమంది ఇన్స్ పైర్ అయ్యారు. ఆయన ఫైట్స్ తోనే హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. సుమన్ గారికి మన ఫైటర్స్ అంటే చాలా ప్రేమ. అలాగే కరాటే మాస్టర్ రవి గారి దగ్గరే లక్ష్మీ గారు కరాటే నేర్చుకున్నారు. ఆమె షీ టీమ్స్ తరుపున కూడా ఎంతో కృషి చేశారు. కరాటే అసోసియేషన్ నుంచి ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన టీఎఫ్ సీసీ కార్యాలయం కోసం స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం. త్వరలోనే మనకు స్థలం వస్తుంది. అందులో కరాటే అసోసియేషన్ వారికి కూడా స్థలం కేటాయిస్తాం. ఇండస్ట్రీలో కరాటే ఫైటర్స్ కు చాలా డిమాండ్ ఉంది. మీలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ సినీ రంగంలో మీ వంతు ప్రయత్నం చేయండి. మా టీఎఫ్ సీసీ తరుపున తప్పకుండా సపోర్ట్ చేస్తాం అన్నారు.
నటులు సుమన్ మాట్లాడుతూ – ఈ రోజు లక్ష్మీ గారికి సన్మాన కార్యక్రమం చేసి నంది అవార్డ్ అందించిన రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి స్వామి రెడ్డి, గౌరీ శంకర్, స్నిగ్ధ, చంద్రకాంత్, సక్సెల్ లైఫ్, దుబాయ్ స్థాపకులు యోగ నారాయణ, కరాటే మాస్టర్ రవి రావడం సంతోషంగా ఉంది. లక్ష్మీ గారికి తానాలో సత్కారం జరగడం ఎంతైనా సముచితం. ఆమె ఒక మహిళగా ఎంతో కష్టపడి కరాటే నేర్చుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో తన ప్రతిభ చాటుకుంటున్నారు. తానా వంటి ప్రతిష్టాత్మక అసోసియేషన్ లో సత్కారం పొందారు. తానా వాళ్లు సత్కారం చేసే ముందు వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకుంటారు. నా జీవితంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంతో ఉపయోగపడింది. శారీరకంగా మానసికంగా నేను ఇప్పటికీ దృఢంగా ఉన్నానంటే దానికి మార్షల్ ఆర్ట్స్ కారణం. కరాటే నేర్చుకోవడం సులువైన పని కాదు. ఎంతో శ్రమించాలి. మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే ఇక్కడి స్టంట్స్ నేర్చుకోవాలి. గ్లాస్ బ్రేకింగ్, జంపింగ్, వాటర్ స్టంట్స్..ఇలా ఎన్నో ఉంటాయి. మీలాంటి ఎంతోమంది కరాటే మాస్టర్స్ కు రామకృష్ణ గౌడ్ గారు టీఎఫ్ సీసీలో కార్డ్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కరాటే మాస్టర్స్ కు అందిస్తున్న సహకారానికి థ్యాంక్స్ చెబుతున్నాం అన్నారు.
కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యం మాట్లాడుతూ – ఈ రోజు నాకు ఘన సన్మానం చేసి నంది పురస్కారం అందించిన డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్. నేను షీ టీమ్స్ లో పనిచేస్తున్నప్పుడు స్త్రీశక్తి అవార్డ్ ఇచ్చారు రామకృష్ణ గౌడ్ గారు. ఇప్పుడు నంది అవార్డ్ అందించారు. ఈ నంది అవార్డ్ గురించి మా నాన్నకు చెబితే అది నా కల అమ్మా అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుమన్ గారి సినిమాలు చూసి ఆ స్ఫూర్తితో కరాటే నేర్చుకున్నాను. మా మాస్టర్ రవి గారు కరాటే నేర్పించారు. నేను చిన్నప్పుడే కరాటే గురువుగా మారి పిల్లలకు నేర్పించేదాన్ని. అప్పుడు నెలకు పదిరూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు గంటకు పదివేలు తీసుకుంటున్నా. నేనెప్పుడూ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నా జీవితం ఉన్నంతవరకు కరాటేను వదులుకోను. కరాటే వల్ల మీకు ఆత్మవిశ్వాసం వస్తుంది. ఏ మార్షల్ ఆర్ట్స్ అయినా నేర్చుకోండి. జీవితంలో ఒక మంచి మార్పు చూస్తారు. నాకు తానాలో సన్మానం చేసిన నిర్వాహకులుకు కృతజ్ఞతలు అన్నారు.

Related posts

Leave a Comment