చిత్రసీమలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి

Telangana CM Revanth Reddy should immediately respond to the injustices against women in cinema. The Best Choreographer Award announced by the Central Government to Johnny Master should be withheld till the trial of the case is over : Senior Producer Kethi Reddy Jagadeeswara Reddy
Spread the love

* జానీ మాస్టర్ కు కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్ కేస్ విచారణ ముగిసే వరకు ఆపాలి
* సీనియర్ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

చిత్రపరిశ్రమలో, ఐటి రంగంలో, బ్యాంకింగ్ రంగంలో మారుతున్న సమాజంలో దుష్ట లైంగిక వేధింపులు ఎక్కువగా అవుతున్నాయి. కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు. మరి కొందరు ఎవ్వరికీ చెప్పలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మహిళల పై గతంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న హింసలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఒక రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పరచి .నిష్పక్షపాతమైన వారిని కమిటీ సభ్యులుగా నియమించి మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలని తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్,. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ … కేరళ లో రిటైర్డ్ నాయమూర్తి ని విచారణ చేయడం కోసం అక్కడి ప్రభుత్వం నిష్పక్షపాతమైన వారిని కమిటీ సభ్యులుగా నియమించటం జరిగింది. ఆ న్యాయమూర్తి విచారణలో తెలిపిన అంశాలు తెలిసిన వెంటనే అక్కడ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. అంటే అక్కడ అది సగటు ప్రేయక్షకుడిపై ప్రభావం చూపుతుందన్న భయంతో సూపర్ స్టార్ వెంటనే తప్పుకోవడం జరిగింది. పూనమ్ కౌర్ తనకు అన్యాయం జరిగిందని ట్విట్టర్ వేదికగా చెబితే ఎలా ? రావాలి లిఖిత పూర్వకంగా తనపై జరిగిన హింస ను తెలిపితే వెంటనే తను ,చిత్ర రంగంలోని ప్రముఖులు అటు చట్ట పరంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. ఇక జానీ మాస్టర్ ప్రతిభను గుర్తించి ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్ ను ఈ లైంగిక వేధింపుల కేస్ విచారణ ముగిసే వరకు ఆపాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రికి లేఖరాస్తూ డిమాండ్ చేయటం జరుగుతుందని.. షూటింగ్ లు జరిగే ప్రదేశాలలో సి.సి.టివి లను ఏర్పాటు చేసి ఇలాంటి వేధింపులను నియంత్రించుటకు ప్రభుత్వం వెంటనే సి.సి కెమెరా లు ఉండేలా ఒక చట్టం తేవాలని, వానిటీ వెహికల్ నందు ఇలాంటి సౌకర్యం ను నిర్మాత లు వెంటనే తమిళనాడు లాగా రద్దు చేయాలని ఈ లైంగిక వేధింపుల కేస్ తేలే వరకు జానీ మాస్టర్ కు చిత్ర పరిశ్రమలో డాన్స్ మాస్టర్ అవకాశాలు ఇవ్వకూడదని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఆ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా కోరారు.

Related posts

Leave a Comment