“మిన్నల్ మురళి” హీరో “టోవినో థామస్” ”ఏఆర్ఎమ్” (ARM) నాలుగు రోజుల్లో 35 కోట్లు కలెక్ట్ చేసింది !!!

Tovino Thomas Box Office Hunt Continues with ARM; Collected a Massive 35 Crores Gross Worldwide in 4 Days
Spread the love

మలయాళ నటుడు టోవినో థామస్ జితిన్ లాల్ దర్శకత్వంలో నటించిన ఏఆర్ఎం చిత్రానికి మూవీ మేకర్స్ అజయంతే రాండమ్ మోషణం (ARM) అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ఏరియాల్లో పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకొంది. అంతే కాకుండా కేవలం నాలుగు రోజుల్లో 35 కోట్లు కలెక్ట్ చేసి సంచలన విజయంగా పేరు తెచ్చుకుంది.
ఇటీవల ఏఆర్ఎం చిత్ర యూనిట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను మెంగలూర్ లో కలిసి ట్రైలర్ ను చూపించడం జరిగింది. టోవినో థామస్ మూడు డిఫరెంట్ లుక్స్ లో బాగున్నాడని ట్రైలర్ ప్రామిసిన్ గా ఉందని ప్రశాంత్ నీల్ చెప్పడం విశేషం.
డిబు నైనన్ థామస్ ఈ సినిమాను సంగీతం అందించారు. టోవినో థామస్, కృతి శెట్టి కెమెస్ట్రీ బాగా సెట్ అయ్యింది. పొడవాటి జుట్టుతో టొవినో థామస్ ఒక కఠినమైన అవతార్‌ను ప్రదర్శించడం చూసి అభిమానులు సంతోషిస్తున్నారు.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరియు కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. దిభు నినాన్ థామస్ సంగీతం అందించగా, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస్ మరియు లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ నంబియార్ కథను అందించారు.
తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ విజువల్ వండర్ గా ఉందని సినిమా ప్రేక్షకులు, ఫాన్స్ అంటున్నారు.

Related posts

Leave a Comment