‘చిట పటమని కసిరితే / గుసగుసమని నసిగితే / పొగరంతా కరిగేలా ర్యాంపాడిస్తా’ -అని అబ్బాయి అమ్మాయిపై చిటపట మంటున్నాడు.. ఇక అమ్మాయి ఊరుకుంటుందా? ‘తల బిరుసుతో ఎగిరితే/ మగ బలుపిక ముదిరితే / మొహమాటం పడకుండా రఫాడిస్తా’ అంటూ రఫ్‌గా సమాధానం ఇస్తుందమ్మాయి. ఇలా అబ్బాయి.. అమ్మాయి మాటలతో కాదండోయ్ ఏకంగా పాటలతోనే గొడవలు పడుతున్నారు. అసలు వీళ్ల గొడవకి కారణమేంటో తెలుసుకోవాలంటే మాత్రం ఫిబ్రవరి 18న రిలీజ్ అవుతున్న ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా చూడాల్సిందేనంటున్నారు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల. ఇంతకీ శ్రీదేవి ఎవరు.. శోభన్‌బాబు ఎవరు? వారి మధ్య గొడవేంది? అనేది తెలియాలంటే తప్పకుండా సినిమా చూడాల్సిందేనండోయ్. శోభన్‌బాబుగా సంతోష్ శోభన్.. శ్రీదేవిగా గౌరి జి కిషన్ నటించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల…